కోడిపందాల కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి మొయినాబాద్ పోలీసులు గురువారం నోటీసులు జారీ చేశారు. పోలీసుల దర్యాప్తులో కోడిపందెలు నిర్వహించిన ఫార్మ్‌హౌస్ శ్రీనివాస్ రెడ్డిదిగా గుర్తించారు. అయితే, ఈ ఫార్మ్‌హౌస్‌ను సబ్ లీజుకు భూపతి రాజు శివకుమార్ వర్మ అలియాస్ గబ్బర్ తీసుకున్నట్లు తెలుస్తోంది. గబ్బర్ భారీ సెటప్‌తో కోడిపందాలను నిర్వహించినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై పోలీసులు మరికొంత మందిని విచారణకు పిలవనున్నారు.

