దేశవ్యాప్తంగా మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శివాలయాలకు భక్తుల తాకిడి పెరిగింది. భక్తులు ఓం నమః శివాయ అంటూ…., హర హర మహాదేవ శంభో శంకర అంటూ…. భక్తులు అభిషేకాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలో వేములవాడ రాజా రాజేశ్వర స్వామి ఆలయం, వేయి స్తంభాల రుద్రేశ్వరాలయం, కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం, కీసరగుట్ట శివాలయం, పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం, వరంగల్ భద్రకాళి, ఏడుపాయల వన దుర్గ భవాని,ఐనవోలు మల్లిఖార్జున స్వామి ఆలయం, కొలనుపాక సోమేశ్వరాలయం, నాగర్ కర్నూల్ జిల్లా ఉమ్మమహేశ్వరం, వికారాబాద్ అనంతగిరి ఆలయం, పానగల్ పాస్చల సోమేశ్వరాలయం, రాష్ట్ర వ్యాప్తంగా వున్న ఆలయాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం, ఇతర శివాలయాల్లో భక్తులు ఉదయం నుండే అభిషేకాలు జరుగుతుండటంతో భక్తులు పోటెత్తారు.

