హరిత తెలంగాణ…
వనమావోత్సవం…
అది…. ఇది.. .
పేర్లతోటి….
నాయకులని ,అధికారులని
తమను నాటమని మొక్కలు అడిగాయా..??
…మీరే కదా నాటింది!!
ఆ నాటడం కూడా…
పోయి పోయి
ఎక్కడ స్థలం లేనట్టు –
విద్యుత్తు తీగల కింద నాటడం ఎందుకు చేశారు ??
అదేదో పెద్ద ఘనకార్యం లాగా
ఏదో “గ్రీన్ రెవల్యూషన్” తెస్తున్నట్లు….
దానికి ఒక “పేపర్ పబ్లిసిటీ” ఎందుకు…??
ఇప్పుడు విద్యుత్ తీగల కు
అడ్డం వస్తుంది అనే పేరుతోటి …
ఆ మొక్కల్ని తిరిగి కొట్టడం ఎందుకు??
…. మొక్కలు నాటినప్పుడు
ఒక పని చేసిన యాక్షన్!
…. తిరిగి చెట్లని నరికినప్పుడు
మరొక పని చేసిన యాక్షన్!!
రెండుసార్లు మీరు ఏదో ఒక పని చేస్తున్నారు అని
అనిపించుకోవడం కోసం
మధ్యలో ….
చెట్లు హత్యలకు గురి అవుతున్నాయి!!
చెట్లు నరికే వాళ్లు కూడా
అలసట వచ్చినప్పుడు…
మరో చెట్టు నీడనే నిలబడటం చూస్తే అర్థం కావడం లేదా…??
చెట్ల ప్రాముఖ్యత ఏమిటి అనేది!!
అయినా ఆ చెట్లు నరికే తీరు
ఏమిటండి….
మీకు చెట్లకు ఏమైనా ..
పాత ఆస్తులు గొడవలు ఉన్నాయా?
మీకు చెట్లకు మధ్యన ఏమైనా…
పాత ఫ్యాక్షన్ పగలు ఉన్నాయా??
ఎందుకు అంత సమూలంగా నరికి పడేస్తున్నారు??
తీగలకు అడ్డం వచ్చే మేర తొలగించి ….
తిరిగి చిగురించేలాగా నైనా ఉంచొచ్చు కదా??
ముందు అసలు
తీగల కింద
చెట్లు పెట్టడమే పెద్ద తప్పు…
చెట్టు తన సంతానం అయిన కొమ్మలతో…. వృద్ధి చెందాక
మొత్తం కుటుంబాన్ని మీరు సర్వనాశనం చేయడం మరొక తప్పు….!!
ఉరుములు మెరుపులతో…
ప్రకృతి విలపిస్తుంది!
భగ్గు మనే ఎండలతో….
తన ఆక్రోషం వెళ్లగక్కుతుంది!
జోరున కురిసే వానలతో…
తన కన్నీటి వరదని మన ముందు ఉంచుతుంది!!
అయినా…. మారమా ?
అయినా…. మానమా ?
అఖిల పక్ష నాయకులు, విద్యుత్, మున్సిపల్ అధికారులు, ప్రజా సంఘాల వాళ్ళు , పాత్రికేయులు, బాధ్యతగల పౌరులు…. అందరూ ఆలోచించాల్సిన విషయం!!
ప్రకృతిని కాపాడుకుందాం!!
———–
దండె శ్రీనివాస్,
మద్దిరాల, సూర్యాపేట జిల్లా.

