సౌతాఫ్రికా ఆటగాడు ర్యాన్ రికెల్టన్ టెస్టుల్లో ఓపెనింగ్ చేస్తూ సరికొత్త రికార్డును సాధించారు. పాకిస్థాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో రికెల్టన్ 214 నాటౌట్ స్కోరు చేసి, టెస్టు క్రికెట్ చరిత్రలో తొలి ఓపెనింగ్ ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు చేసిన ఆటగాడిగా నిలిచారు. ఈ క్రమంలో బ్రెండన్ మెక్కల్లమ్ (201*) రికార్డును అధిగమించారు. రికెల్టన్ తర్వాత గ్రేమీ స్మిత్ (200), డెవన్ కాన్వే (200), శిఖర్ ధావన్ (187), రోహిత్ శర్మ (176), యశస్వీ జైస్వాల్ (171) ఉన్నారు.

