ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకు తరలివచ్చే భక్తుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. జనవరి 18 వరకు 7.72 కోట్ల మంది త్రివేణి సంగమంలో స్నానం చేశారు. ఈ సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఆదివారం (జనవరి 19) మధ్యాహ్నం నాటికీ ఈ ఒక్కరోజే 30.80 లక్షలకు పైగా జనం సంగమంలో స్నానం చేశారు.

