పుణే రేప్ కేసులో కొత్త విషయం బయటపడింది. నిందితుడు రాందాస్, యువతిపై అత్యాచారం చేసిన బస్సులో పోలీసులకు వందల సంఖ్యలో కండోమ్ పాకెట్స్, మహిళల లోదుస్తులు వున్నాయి. దీనితో, ఆ మానవ మృగం ఇతర మహిళలపై కూడా ఇలాంటి దారుణాలకు పాల్పడినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంఘటన జరిగిన తరువాత నిందితుడు సంఘటన స్థలానికి 100 మీటర్ల దూరంలోని బస్టాండ్ వద్దే ఉన్నాడు. అక్కడే సోదాలు చేస్తున్న పోలీసులకు దొరికిన నిందితుడిని అరెస్టు చేసి విచారిస్తున్నారు.

