తెలంగాణ ప్రభుత్వం సావిత్రిబాయి పూలే జయంతిని ఇకముందు మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. రేపు జనవరి 3న సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అధికారిక కార్యక్రమాలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. మహిళా విద్యలో ప్రాముఖ్యత కల్పించిన సావిత్రిబాయి సేవలను గౌరవిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.

