నెత్తిల పేండ్లు పోవాలన్నా, తీయాల్నెన్నా మామూలు ముచ్చట కాదు. గయి మన నెత్తిల్నే ఉంటయి. ఇగ గయి కర్తాంటే, గోకా, పీకా.. మస్తు చికాకుగుంటది. ఇగ గవాటికి తోడుగ ఈడ్తులు మొదలైతయి. సూసి కుక్కితే సిటుక్కుమని సత్తయి గనీ, గవాట్ని దొరకబట్టుడే కట్టం. దువ్వెనకు రావు, శేతికి శిక్కయి. మరి గివీట్ని మందులు మాకులు లేకుండ, ఇంటి శిట్కాతోటే సంపేసే మంచి శిట్కా శెప్తా ఇనుండ్రి.

గంతంత అల్లమ్ముక్క తీసుకోండ్రి. గదాన్ని దంచి గండ్లకెల్లి దాని రసం తీయండ్రి. గా రసంల గింత వేపాకు పొడి, గింత కప్పూరం వేయిండ్రి. గాదాన్ని మంచిగ నెత్తికి పట్టియిండ్రి. రెండు మూడు సార్ల గిట్ల శేసిండ్రా… కతం గా నెత్తిల పేండ్లు మటుమాయం కాకపోతే మీ మీద ఒట్టు!?

