టీఎస్ నుంచి టీజీ గా పేరు మార్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. అక్షరం మార్పు కోసం వెయ్యి కోట్లు ఖర్చు పెట్టడంపై కేటీఆర్ వ్యంగ్యంగా ట్వీట్ చేస్తూ, “లక్ష కోట్లు ఖర్చు పెట్టినా తెలంగాణ అస్థిత్వాన్ని చెరపలేరు” అని అన్నారు. ఈ ట్వీట్‌పై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ, కేటీఆర్ లెక్కలు తప్పుగా చెప్పారంటూ విమర్శలు చేశారు. గుంటూరు చదువులో లెక్కలు నేర్చుకోలేదా? అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. టీఎస్ నుంచి టీజీగా పేరు మార్పులో కేటీఆర్ ఇగో కనిపించిందని, కానీ ప్రజలకే సెంటిమెంట్ ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం మరింత వేడెక్కింది.

