Wednesday, August 19, 2026
26.1 C
Hyderabad

అప్పుల భారం, ఆర్థిక సంక్షోభం!|EDITORIAL

ప్రజా సంక్షేమం, ఆర్థిక నియంత్రణ, పాలనా బాధ్యత..ఈ మూడు ఒకదానితో ఒకటి అనుసంధానం కలిగినవి. వీటి మధ్య సమతౌల్యం అవసరం. లేకపోతే పరిపాలన, ప్రజాప్రగతి పడకేసి, దేశమే అల్లకల్లలమయ్యే ఆర్థిక ఇబ్బందుల ఆందోళన తీవ్రమవుతాయి. ప్రభుత్వాల ఖర్చు విధానం, ఉచిత పథకాల విస్తరణ, ఉద్యోగుల బకాయిల పెరుగుదల ఇవి కలిపి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై భారీ ఒత్తిడిని సృష్టిస్తున్నాయి.

తెలంగాణలో ఉద్యోగుల బకాయిలు రూ.6వేల కోట్లకు పైగా ఉన్నాయని అధికార వర్గాల అంచనా. గత దశాబ్ద కాలంలో బీఆర్‌ఎస్ పాలనలో ప్రారంభమైన ఈ సమస్య, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా పూర్తిగా పరిష్కారం కాలేదు. దీనికితోడు, పెన్షనర్లు, ఆర్టీసీ ఉద్యోగులు, కాంట్రాక్ట్ సిబ్బంది వంటి వర్గాలకు చెల్లింపులు ఆలస్యం అవుతున్నాయి. రోజువారీ నిర్వహణ ఖర్చులకే అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇక ఆంధ్రప్రదేశ్‌లో కూడా పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. గత ప్రభుత్వంలో అమలు చేసిన “బటన్ నొక్కుడు” పథకాల కింద లక్షల కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. ప్రస్తుత ప్రభుత్వమూ ఎన్నికల హామీల మేరకు సంక్షేమ పథకాలపై భారీగా ఖర్చు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు రాష్ట్రాలూ ఆదాయం-వ్యయం మధ్య బ్యాలెన్స్ ను కోల్పోయాయి.

ఈ ఆర్థిక ఒత్తిడిలో ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాలు, జీతాలు, భత్యాలు, పెన్షన్లపై చర్చ ప్రారంభమవుతోంది. సాధారణంగా ఒక ఎమ్మెల్యేకు నెలకు లక్షల్లో గౌరవ వేతనం, అదనంగా భత్యాలు లభిస్తాయి. మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా పెన్షన్లు కొనసాగుతున్నాయి. ఒక వ్యక్తి ఎమ్మెల్యే, ఎంపీ వంటి పదవులకు పలుమార్లు ఎన్నికైతే, అతనికి అనేక పెన్షన్లు పొందే అవకాశమూ ఉంది. ఈ నేపథ్యంలో “ప్రజాప్రతినిధులకు ఇంత అధిక పారితోషికం అవసరమా?” అనే ప్రశ్న సహజంగా తలెత్తుతోంది.

అయితే, ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాలు, భత్యాలను, పెన్షన్లను పూర్తిగా రద్దు చేయాలని కాదు. కానీ, హేతుబద్ధత అవసరం. ప్రజాస్వామ్యంలో ప్రతి వర్గానికి ప్రాతినిధ్యం ఉండాలి. జీతాలు లేకపోతే ధనవంతులే రాజకీయాల్లో కొనసాగుతారు. లేదా అంతా అవినీతికి పాల్పడతారు. ఇది ప్రజాస్వామ్య సమానత్వాన్ని దెబ్బతీస్తుంది. అంతేకాదు, సరైన పారితోషికం లేకపోతే అవినీతి పెరిగే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి జీతాల వ్యవస్థ అవసరం. అయితే, అది సమర్థవంతంగా, పారదర్శకంగా ఉండాలి.

ప్రధాన సమస్య ఉచిత పథకాల వితరణలోనే ఉంది. ఎన్నికల సమయంలో ఆకర్షణీయ హామీల కోసం ప్రభుత్వాలు భారీగా ఉచితాలను ప్రకటిస్తున్నాయి. ఉచిత రేషన్, ఉచిత విద్యుత్, పెన్షన్లు, గృహ పథకాలు వంటి సంక్షేమ కార్యక్రమాలు అవసరమే. కానీ అవి ఆర్థికంగా భరించగలిగిన పరిమితుల్లో ఉండాలి. లేకపోతే ఖజానా ఖాళీ అవుతుంది. ఆ ఖాళీని పూడ్చేందుకు అప్పులు తీసుకోవాల్సి వస్తుంది. అప్పులపై వడ్డీలు చెల్లించడం మరింత భారమవుతుంది.

భారత సుప్రీంకోర్టు కూడా ఉచిత పథకాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పలుమార్లు సూచించింది. అధిక ఉచితాలు ప్రజల్లో పని చేయాలనే ప్రేరణను తగ్గించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అయినప్పటికీ రాజకీయ పార్టీలు ఈ హెచ్చరికలను పెద్దగా పట్టించుకోవడం లేదు. ఎన్నికల లాభాల కోసం సంక్షేమాన్ని అతిగా వినియోగిస్తున్నాయి.

ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక క్రమశిక్షణ అత్యవసరం. ప్రభుత్వాలు తమ ఖర్చులను ప్రాధాన్యతల ఆధారంగా పునర్వ్యవస్థీకరించాలి. మొదటిగా ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, అవసరమైన సేవలకు చెల్లింపులు సమయానికి చేయడం తప్పనిసరి. అనంతరం అభివృద్ధి కార్యక్రమాలు, చివరగా సంక్షేమ పథకాలను ఆర్థిక సామర్థ్యానికి అనుగుణంగా అమలు చేయాలి.

ఇక ప్రజాప్రతినిధుల గౌరవ జీతాలు, భత్యాలు, పెన్షన్లలో సంస్కరణలు అవసరం. పనితీరు ఆధారిత భత్యాలు, ఒకే పెన్షన్ విధానం, పారదర్శక ఖర్చుల వివరాలు వంటి మార్పులు చేయవచ్చు. ఇది ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతుంది. అలాగే ఎన్నికల ఖర్చులను నియంత్రించడం, డబ్బు ప్రభావాన్ని తగ్గించడం కూడా కీలకం.

సంక్షేమం పూర్తిగా తప్పు కాదు. కానీ, అది మోతాదు మించకూడదు. అభివృద్ధి, మౌలిక వసతులు, విద్య, వైద్యం వంటి రంగాల్లో పెట్టుబడులు పెంచకపోతే దీర్ఘకాలంలో రాష్ట్రాలు వెనుకబడిపోతాయి. ఎక్స్ ప్రెస్‌వేలు, పారిశ్రామిక కారిడార్లు, వైద్యశాలలు, పాఠశాలలు ఇవే భవిష్యత్తును నిర్మిస్తాయి.

ప్రజాప్రతినిధుల జీతాలు సమస్యలో చిన్న భాగం మాత్రమే. అసలు సమస్య అసమతౌల్య, అహేతుక, దుబారా ఖర్చులు. ఎన్నికల రాజకీయాలు, ఆర్థిక నియంత్రణ లోపం. ప్రభుత్వాలు తక్షణ ప్రజాప్రియ నిర్ణయాల కంటే దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగాలి. లేనిపక్షంలో అప్పుల భారంతో రాష్ట్రాలు ఆర్థిక సంక్షోభంలోకి జారిపోవడం అనివార్యం.

Latest News

వరుస ఆరోపణలు.. షోకాజ్ నోటీసులు!|CONGRESS|NOTICE

తెలంగాణ కాంగ్రెస్‌లో అసలేం జరుగుతుంది?|TELANGANA|CM|REVANTH REDDY|KONDA FAMILY తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ కుటుంబం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గం మధ్య...

సుస్మితకు ఎమ్మెల్యేల ఘాటు కౌంటర్|KONDA FAMILY|MLAS|COUNTER

క్రమశిక్షణ చర్యలపై కాంగ్రెస్‌ ఫోకస్|MALLU RAVI|CONGRESS|FOCUS తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలో ఇటీవల పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో...

సీఎం అయ్యాక కళ్ళు నెత్తికెక్కాయా….|TELANGANA|CONGRESS|KONDA|REVANTH REDDY

సీఎం రేవంత్ వర్సెస్ కొండా కుటుంబం!|CM|KONDA SUSMITHA ఒకవైపు జెన్ జీ వాళ్లకు టిక్కెట్లు ఇవ్వాలి అంటావ్ మరోవైపు డైపర్లు వేసుకొని తిరుగుతున్న రేవూరి ప్రకాశ్ రెడ్డికి టికెట్ ఇస్తా అంటావ్ - మంత్రి కొండా సురేఖ...

స్టార్ హోటల్ల దోశ గిట్లనే తినాల్నట!?|ADUGU TRENDS

శిన్నప్పుడు మనం ఎట్ల తినాల్నో? ఎట్ల తినకూడదో మన అవ్వయ్యలు నేర్పిత్తురు. అన్నలక్కలు కూడా శెప్తరు. గట్లనే మనం తినడం నేర్సుకుంటం. పెద్దగైనంక సుత.. గట్ల తినుడే అలవాటు శేసుకుంటం. కనీ, పెద్ద పెద్ద...

ఉగ్రవాదం : అనుమానమే ఆయుధం కాకూడదు!?|EDITORIAL

దేశ భద్రతకు ‘ప్రజలు కూడా బాధ్యతాయుతమైన సమాచార భాగస్వాములుగా ఉండాలి. నిఘా సంస్థలు ఆధారాలను విశ్లేషించి, చట్టబద్ధమైన దర్యాప్తు ద్వారా నిందితులను గుర్తించాలి. ఉగ్రవాదంపై కఠిన చర్య అవసరం. అదే సమయంలో నిరపరాధ...

ఆగస్టు19, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం తిధి శు.సప్తమి రాత్రి 08.09 వరకు ఉపరి అష్టమి నక్షత్రం స్వాతి ఉదయం 08.58 వరకు ఉపరి విశాఖ యోగం శుక్ల ఉదయం 06.37 వరకు ఉపరి బ్రహ్మ కరణం గరజి ఉదయం 07.43 వరకు ఉపరి వణజి రాహుకాలం...

హవ్వ…ఆవు పెండ మట్టితోటి శివలింగం!?|ADUGU TRENDS

సావును తప్పించుకోవడానికి భక్త మార్కండేయుడు శివలింగాన్ని బిర్రుగ కావలిచ్చుని తపస్సు శేసిండు. యముడి పాశం శివలింగానికి తాకడంతోటి శివుడికి కోపమొచ్చిందిట. యముడిని తరిమికొట్టి మార్కండేయునికి చిరంజీవిగా వరం ఇచ్చిండట. గట్లనే తిన్నడు గదేనుల్ల భక్త...

మరి, ‘సౌరశక్తి మంథన్’ మాటేమిటి!?|EDITORIAL

చమురు, గ్యాస్‌ అన్వేషణ దేశానికి తక్షణ, వ్యూహాత్మక ప్రయోజనాలను అందించవచ్చు. కానీ అవి పరిమిత వనరులు. సూర్యుడు మాత్రం నిరంతర ఇంధన వనరు. అందుకే ‘సముద్ర మంథన్‌’తో పాటు ‘సౌర శక్తి మంథన్‌’...

ఆగస్టు 18, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం మంగళగౌరి వ్రతం తిధి శు.షష్ఠి రాత్రి 07.11 వరకు ఉపరి సప్తమి నక్షత్రం చిత్త ఉదయం 07.34 వరకు ఉపరి స్వాతి యోగం శుభ ఉదయం 07.00 వరకు ఉపరి శుక్ల కరణం కౌలవ ఉదయం 06.58 వరకు ఉపరి...

ఆగస్టు 17, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం నాగ పంచమి గరుడ పంచమి తిధి శు.పంచమి సాయంత్రం 06.43 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం హస్త ఉదయం 06.40 వరకు ఉపరి చిత్త యోగం సాధ్య ఉదయం 07.51 వరకు ఉపరి శుభ కరణం బవ ఉదయం...

గా ఊల్లె తాగొద్దు..!?|ADUGU TRENDS

ఎనకటికి 'మందు తాగనోడు దున్నపోతై పుట్టున్ ' అన్నరు. కానీ గా ఊరోల్లు మాత్రం మందు తాగితే జరిమానా ఏత్తం అంటున్నరు. పెండ్లి కానోళ్లు తాగొద్దట! పెండ్లి అయినోళ్ళు తాగొచ్చట? కానీ, కొట్లాడుకోవద్దట! తమిళనాడు...

రాహుల్ గాంధీ ముందున్న సవాల్ ఇదే!?|EDITORIAL

రాహుల్ గాంధీకి ఇప్పుడు ఎదురున్న అసలు సవాల్ మోదీని వ్యక్తిగతంగా విమర్శించడం కాదు. తన రాజకీయ శైలిని పునర్నిర్మించుకోవడం. సభలో హుందాతనం, వాస్తవాలపై పట్టు, విదేశాంగంపై బాధ్యతాయుతమైన భాష, పార్టీ పునర్వ్యవస్థీకరణ, యువ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News