స్వర్ణ విమాన గోపురంపై విష్ణుమూర్తి, లక్ష్మీదేవి (ఆండాళ్ అమ్మవారు) యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
ఆదివారం పంచకుండాత్మక నృసింహ మహాయాగం నిర్వహించి దివ్య స్వర్ణ విమాన గోపురాన్ని స్వామివారికి అంకితం చేయనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. వానమామలై మఠం పీఠాధిపతి మధురకవి రామానుజ జీయర్స్వామి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహా సంప్రోక్షణకు 40 జీవ నదుల జలాలు సేకరించారు. ఆదివారం ముగింపు కార్యక్రమం సందర్భంగా గుట్ట కింద సత్రాల్లో లక్ష మందికి ఉచిత పులిహోర ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు.
స్వర్ణ విమానం ప్రత్యేకతలు:-
స్వర్ణ విమాన గోపురం ఎత్తు: 50.5 అడుగులు
ఉపయోగించిన మొత్తం బంగారం: 68 కిలోల
బంగారు విమాన గోపురం వైశాల్యం:
10,759 చదరపు అడుగులు
తాపడం పనులు ప్రారంభించిన తేదీ: డిసెంబరు 1, 2024
తాపడం కవచాల బిగింపు పనుల పూర్తి: ఫిబ్రవరి 18, 2025
బంగారు తాపడం బిగింపు ఖర్చు: రూ.5.10 కోట్లు (జీఎస్టీ కాకుండా)
రాగిరేకుల తయారీ ఖర్చు: రూ.12 లక్షలు
పనిచేసిన కార్మికులు: 50 మంది
పనులు చేసిన సంస్థ: నవయుగ మెటల్స్
స్వర్ణ విమాన గోపురం పనులు చేసిన సంస్థ: ఎంఎస్ స్మార్ట్ క్రియేషన్స్, చెన్నై

