Saturday, September 5, 2026
27.6 C
Hyderabad

అవినీతిలో కాంగ్రెస్-ఆనందంలో బీఆర్ఎస్|EDITORIAL

రాజకీయ పార్టీలు పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకోవడం సర్వసాధారణం. అసలు అవినీతే లేదనడం హాస్యాస్పదం. అవినీతి వెలుగు చూస్తుండటం సాధారణం. పెచ్చుమీరిన అవినీతి అసాధారణం. ఇప్పుడు అవినీతి వ్యక్తుల నుండి వ్యవస్థల దాకా వ్యవస్థీకృతమైంది. అవినీతి సర్వత్రా వర్జయేత్! అనే దురవస్థలు వ్యాపించాయి. అవినీతి లేనిదెక్కడ? అంతా అవినీతిమయమే అనేంతగా విస్తరించాయి.
తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తోంది. డిసెంబర్‌ 1 నుంచి 9వ తేదీ వరకు రెండేళ్ల వార్షికోత్సవాలను ప్రజాపాలన దినోత్సవాలుగా ఘనంగా జరుపుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. అయితే, ప్రభుత్వంలో, పార్టీలో పరిస్థితులు మాత్రం ఇందుకు భిన్నంగా, దారుణంగా ఉన్నాయి. ప్రభుత్వంలో, పార్టీలో ఎవరికి వారే యమునాతీరేగా వ్యవహరిస్తున్నారు. మంత్రుల మధ్య మాటలే లేవు. నేతల మధ్య సఖ్యత లేదు. శాఖలు, అధికారుల మధ్య సమన్వయం లేదు. పార్టీని, ప్రభుత్వాన్ని ఏకతాటిపై నడపగలిగే సత్తా ఉన్న నేతలే లేకుండా పోతున్నారు. పార్టీలైనా, నేతలైనా, వ్యక్తులైనా అధికారం అవినీతి చుట్టూ పెనవేసుకుపోతోంది. పదేళ్ళ బీఆర్‌ఎస్‌ అవినీతిని పదే పదే విమర్శిస్తూ, కాంగ్రెస్ లో పెచ్చరిల్లుతున్న ఆవినీతిని కప్పిపుచ్చుకోలేరు. పైగా బీఆర్ఎస్ అవినీతిని విమర్శలతో పబ్బం గడుపుకోవడం తప్ప, చేతలతో రుజువు చేయలేకపోవడం ప్రభుత్వ వైఫల్యమే. గడిచిన రెండేళ్ళల్లో బీఆర్ఎస్ ఒక్క అవినీతిని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిరూపించలేకపోయింది. ఆపార్టీని ప్రజల ముందు దోషిగా నిలబెట్టలేకపోయింది. పైగా అదే అవినీతిలో కూరుకుపోతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచార అస్త్రంగా వాడుకుంటోంది.

సీఎం రేవంత్‌ రెడ్డి కూడా తన మానాన తాను పోతున్నట్లుగా ఉంది. ఇటీవల మంత్రుల మధ్య కుల పంచాయితీ రచ్చకెక్కింది. పొన్నం ప్రభాకర్‌, మరో మంత్రి అడ్లూరి లక్ష్మణ కుమార్‌ ని దూషించారు. ఆ మంత్రులిద్దరినీ పిలిచి సయోద్య కుదిర్చారు. మరోవైపు మంత్రులు అడ్లూరి, వివేక్ ల మధ్య కూడా గొడవలు ఉన్నాయి. అసలు మంత్రుల్లో ఒకరంటే ఒకరికి గిట్టడం లేదు.

ఇందిరమ్మ ఇళ్ల విషయంలోనూ అవినీతి ఆరోపణలు వచ్చాయి. అనర్హులకు కేటాయించారంటూ పలు జిల్లాల్లో ప్రజలు రోడ్డెక్కి నిలదీస్తున్నారు. ఎంక్వైరీ చేసిన అధికారులు వందలాది ఇండ్లను రద్దు కూడా చేశారు. సన్న బియ్యం దాదాపు అందరికీ అందుతున్నాయి. అందులోని వ్యయం, దుబారాలను ఎవరూ పట్టించుకోవడం లేదు.

మంత్రులపై వస్తున్న అవినీతి ఆరోపణలకు అంతులేకుండా పోతోంది. మొదట్లోనే ఆర్థిక వ్యవహారాలు చూస్తున్న డిప్యూటీ సీఎం భట్టీపై డబ్బుల విడుదలకు కమిషన్లు తీసుకున్నారని విమర్శలు వచ్చాయి. పలు శాఖల్లో మంత్రుల చేతి వాటం, వారి ఉద్యోగులపై కూడా ఆరోపణలు వచ్చాయి. ఉద్యోగుల్లోనూ అవినీతి పెరిగింది. డబ్బులు లేనిదే ఫైలు కదలడం లేదు. ఏసీబీ నామమాత్రపు దాడులను ఉద్యోగులు లెక్కచేయడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాది 2024లో ఉద్యోగులపై 152 ఏసీబీ కేసులు నమోదు కాగా, 2025 తొమ్మిది నెలల వ్యవధిలోనే 203 కేసులు నమోదు అయ్యాయి. ఉద్యోగుల్లో అవినీతి పెరుగుతోందనడానికి ఇంతకంటే ఉదాహరణ వేరే అక్కరలేదు.

చేపట్టిన ప్రాజెక్టుల్లోనూ గత ప్రభుత్వం బాటలోనే ప్రస్తుత ప్రభుత్వం నడుస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి. అంచనాలు పెంచుతూ అవినీతికి తెరలేపుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ మండిపడుతోంది. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు, ఫ్యూచర్ సిటీ, పలు రకాల భూముల వ్యవహరాల్లోనూ ప్రభుత్వంపై అవినీతి మరకలు పడుతున్నాయి. వాటిని కడుక్కోవాల్సిన అవసరం ఉంది. కొత్తగా కొండా సురేఖ ఓఎస్డీ గన్ పెట్టి చేసిన బెదిరింపుల వల్ల, అతన్ని ఉద్యోగంలోంచి ప్రభుత్వం తీసేసింది. అరెస్టు చేయడానికి పోలీసులు వెళితే, అతడిని తన ఇంట్లోనే దాచి పెట్టి, పోలీసుల ఎదుటి నుంచే అతడిని తన కారులోనే మంతరి సురేఖ తప్పించారు. పైగా ఆమె కూతురు పోలీసులపై బాహాటంగానే విరుచకుపడ్డారు. అవినీతిలో ఇదో బరితెగింపు అంకం. మంత్రులే అవినీతికి ఇంతగా మద్దతుగా నిలిస్తే ప్రభుత్వం పరువేం కాను?

పైగా సీఎం, మంత్రులు తనపై కక్షకట్టారని కొండా కుటుంబం చేసిన ఆరోపణలు సంచలనం కలిగిస్తున్నాయి. మేడారం కంట్రాక్టు పనులను ఆమె నిర్వహిస్తన్న దేవాదాయ శాఖ నుంచి తప్పించి, రోడ్లు భవనాల శాఖకు అప్పగించిన వైనం ఆశాఖలో జరుగుతున్న అవినీతికి నిదర్శనం. మంత్రుల మధ్య సమన్వయం లేదనడానికి కూడా మేడారం పనులే దోహదం చేస్తున్నాయి. ఈ పరిణామాలన్నింటిలో స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, మంత్రులు పొంగులేటి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఉన్నారని కొండా కుటుంబం ఆరోపిస్తోంది. తమను ’రెడ్డి’ సామాజికవర్గం టార్గెట్‌ చేసిందని ఆరోపిస్తున్నారు.

ఎప్పటికైనా, అవినీతి గుట్టు బట్టబయలుకాక మానదు. ఇది సర్కార్ కు అంత మంచిది కాదు. ముఖ్యంగా ముఖ్యమంత్రికి. నిన్నటి దాకా గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిని చర్చించుకునే ప్రజలు దాన్ని మరచి, ఇప్పుడు కాంగ్రెస్ అవినీతిని పట్టించుకుంటున్నారు. ఇది వచ్చే ఐదేళ్ళూ అధికారం మాదేనని కలలుగంటున్న కాంగ్రెస్ కు, ప్రస్తుత సీఎంకు దీర్ఘకాలికంగా పెద్ద దెబ్బే. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి బట్టబయలు అవుతున్న తరుణంలో తమ అవినీతి బయటకు రాదన్న భరోసా బీఆర్ఎస్ ఉంది.

Latest News

అమ్మంటే గామే!?|ADUGU TRENDS

మహారాష్ట్రల బీడ్ అంబాజోగాయిల అమ్రుత్ మహోత్సవ్ వేడుకలు జర్గుతానయి. అమ్రుత్ దౌడ్ మొదలైతాంది. గండ్లకు హఠాత్తుగా ఓ 47 ఏండ్ల రమాబాయి రణవీర్ దూసుకొచ్చింది. గా మారథాన్ పరుగు పందెంల ఉరుకుడు మొదలు...

ఏఐ యుగంలో గెలిచేది మానవ నైపుణ్యమే!?|EDITORIAL

ఉద్యోగార్థులకు ఏఐ గణాంకాలు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తున్నాయి. డిగ్రీ లేదా అనుభవం ఒక్కటే భవిష్యత్తుకు భద్రత ఇవ్వవు. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా నిరంతరం కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం, ఉన్న నైపుణ్యాలను మెరుగుపరచుకోవడం...

సెప్టెంబర్ 05, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం తిధి నవమి రాత్రి 08.54 వరకు ఉపరి దశమి నక్షత్రం మృగశిర రాత్రి 09.39 వరకు ఉపరి ఆరుద్ర యోగం వజ్ర పగలు 01.57 వరకు ఉపరి సిద్ది కరణం తైతుల ఉదయం 10.08 వరకు ఉపరి గరజి రాహుకాలం...

తలుసుకుంటే కాందేంది? నదే శుభ్రమైంది!?|ADUGU TRENDS

గీ డిగ్రీలు సదివే పిల్లలు ఏం ఆలోశిస్తరు? ఆటా, పాటా, అల్లరి, సదువు, కెరీర్ గివే కదా? కనీ గీ పిల్లగాడు గివేవీ ఆలోసించలే.. తమ ఊరి పక్కనుండే పోతున్న నది గురించి...

కొండా కుటుంబం దారెటు!?|EDITORIAL

అనూహ్యం కాకపోయినా, అనివార్యంగా జరిగిపోయింది. పరిణామాల ఫలితాలేమైనా, కొండంత ఆశయం, తన కూతురు, తమ భవిష్యత్తు కోసం కొంత పట్టువిడుపు ప్రదర్శించి ఉంటే, కొండా సురేఖ మంత్రి పదవి నిలిచేదేమో! అయినా కొండా...

సెప్టెంబర్ 04, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం శ్రీ కృష్ణాష్టమి తిధి అష్టమి రాత్రి 11.20 వరకు ఉపరి నవమి నక్షత్రం రోహిణీ రాత్రి 11.20 వరకు ఉపరి మృగశిర యోగం హర్షణ సాయంత్రం 05.00 వరకు ఉపరి వజ్ర కరణం బాలవ పగలు 12.30 వరకు ఉపరి...

అధిష్ఠానం నిర్ణయంపై చిన్నారెడ్డి సంచలనం|CHINNA REDDY|CONGRESS

ఒక్క పోటుతో కూల్చేశారు.. పదవులపై నాకు సోకు లేదు తనకు పదవులపై ఎలాంటి ఆసక్తి, వ్యామోహం లేదని స్పష్టం చేశారు. ఎంతో కష్టపడి రాజకీయంగా ఈ స్థాయికి వచ్చానని, అయితే ఒక్క పోటుతో తనను పదవి...

నా బర్తరఫ్‌ చెల్లదు|KONDA SUREKHA|SENSATIONAL COMMENTS

ఈరోజు నాకు జరిగింది.. రేపు మీకూ జరుగుతుంది ఇప్పటికైనా బయటకు వచ్చి మాట్లాడండి రేవంత్‌ సర్కార్‌పై కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు.. తెలంగాణ రాజకీయాల్లో మంత్రి పదవి నుంచి తనను తొలగించడంపై కొండా సురేఖ తీవ్రంగా స్పందించారు....

BREAKING: కొండా సురేఖపై వేటు..చిన్నారెడ్డి ఔట్

సీఎం రేవంత్‌ నిర్ణయం! తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మంత్రి కొండా సురేఖను రాష్ట్ర మంత్రివర్గం నుంచి తక్షణమే తొలగించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి నిర్ణయించినట్లు అధికారిక నోట్‌ వెల్లడించింది. ఈ మేరకు...

కొండా సురేఖకు కేఏ పాల్ ఆహ్వానం..|KONDA SUREKHA|KA PAUL

కాంగ్రెస్‌ను వీడి ప్రజాశాంతి పార్టీలోకి రండి మంత్రి కొండా సురేఖకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ బహిరంగ ఆహ్వానం పలికారు. కాంగ్రెస్ పార్టీలో చోటుచేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో సురేఖ పార్టీ...

రాజీనామా చేయాల్సిందే.. లేదంటే బర్తరఫ్‌!|KONDA SUREKHA|RESIGN|BURTRAF

కొండా సురేఖకు అధిష్ఠానం అల్టిమేటం.. ఇంటి వద్ద నిర్మానుష్యం పార్టీ లైన్‌ దాటని అనుచరులు  తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మంత్రి పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్‌...

ఉద్వాసనమే!|KONDA SUREKHA|CM|REVANTH REDDY|DELHI

సురేఖను పట్టించుకోని అధిష్ఠానం ముక్తసరిగా మూడు ముక్కల్లో ఖర్గేతో మచ్చట అపాయింట్ మెంట్ ఇవ్వని కేసీ వేణుగోపాల్ ఏఐసీసీ కార్యాలయంలోనే రోజంతా పడిగాపులు నిరాశతో వెనుతిరిగిన మంత్రి కొండా సురేఖ ఖర్గే, కేసీలతో రేవంత్ రెడ్డి వేర్వేరుగా భేటీలు సురేఖ వ్యవహారాన్ని...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News