Monday, March 16, 2026
29.3 C
Hyderabad

రచ్చేనా? చర్చేమైనా ఉందా?!|EDITORIAL

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి రెండు రాష్ట్రాలు ఏర్పడి పన్నెండు ఏళ్లు పూర్తయ్యాయి. పుష్కరం గడిచినా, ప్రజల జీవితాల్లో మాత్రం ప్రబలంగా జీవన ప్రమాణాలు పెరిగిన గణనీయమైన మార్పేమీ కనిపించలేదు. కొన్ని రాజకీయ పార్టీలకు, కొందరు నేతలకు మాత్రమే విభజన ప్రయోజనకరంగా మారిందన్న భావన ప్రజల్లో బలంగా ఉంది. రాష్ట్రాలు బాగుపడాల్సిన వేళ, ఆ రాజకీయ నాయకులే రాజకీయ సవాళ్ళు–ప్రతిసవాళ్ళతో కాలం గడిపేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు–జగన్ మధ్య, తెలంగాణలో రేవంత్-కేసీఆర్ ల మధ్య సవాళ్ళు, ప్రతి సవాళ్ళు వాగ్వాదాలు, కేవలం వారి రాజకీయ ప్రయోజనాల కోసమే. రెండు రాష్ట్రాల్లో పాలించిన సీఎంలు తమ పాలనే గొప్పదని చెబుతూనే ఉన్నారు. కాదు మా పాలనలోనే అని ప్రతిపక్ష నేతలు ప్రగల్బాలుపలుకుతున్నారు. “దమ్ముంటే రండి, చర్చిద్దాం” అంటూ పరస్పరం సవాళ్ళు విసురుకుంటున్నారు. ఆ గందరగోళంలో ప్రజలు, వారి ప్రయోజనాలు కొట్టుకుపోతున్నాయి.
అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళు అంటూ, ఉచిత పథకాలతో ఊదరగొట్టి, ప్రజలను సోమరులను చేసి, తమ పబ్బం గడుపుకుంటున్నారు. రెండు రాష్ట్రాలకూ అప్పుల భారం దినదిన ప్రవర్ధమానమవుతూనే ఉంది. ఉమ్మడి రాష్ట్రంతో పోలిస్తే విడిపోయిన తర్వాత రెండు రాష్ట్రాలు పోటాపోటీగా అప్పుల్లో కూరుకుపోతున్నాయి.

అసెంబ్లీకి రాని కేసీఆర్, ఆరునెలలకో, ఏడాదికో మీడియా ముందుకు వస్తున్నారు. తాజాగా ‘రెండేళ్ళు మౌనంగా ఉన్నా, వస్తున్నా, సర్వభ్రష్ట కాంగ్రెస్ తోలు తీస్తా..’ మళ్ళీ మరోసారి తెరమీదకు వచ్చారు. నదీజలాలపై కాంగ్రెస్, టీడీపీలను చెండాడారు. దీంతో తెలంగాణలో మరోసారి రాజకీయ రగడ మొదలైంది. ‘దమ్ముంటే అసెంబ్లీకి రా… తెలంగాణ నదీజలాల వాటాకు అన్యాయం, చేసిందెవరో? ప్రాజెక్టులతో ముంచిందెవరో? తేల్చుకుందామని సీఎం రేవంత్ ప్రతి సవాల్ చేశారు. కృష్ణా జలాల్లో ఏపీకి 511 (64%) టీఎంసీలు, తెలంగాణకు 299 (36%) టీఎంసీలు చాలని అంగీకరించిన ఒప్పందంపై కేసీఆర్ సంతకం పెట్టారని, ఆ నిర్ణయం మహబూబ్‌నగర్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలకు అన్యాయం చేసిందని కాంగ్రెస్ సర్కార్ ఆరోపిస్తోంది. కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. పట్టి సీమను పొగిడిందెవరు? ఉమ్మడిలోకన్నా, కేసీఆర్ హయాంలోనే తెలంగాణకు ఎక్కువ అన్యాయం జరిగిందని సీఎం రేవంత్ నిరూపిస్తామంటున్నారు.

కాంగ్రెస్ హయాంలో మొదలైన భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కల్వకుర్తి, పాలమూరు–రంగారెడ్డి, ఎస్‌ఎల్‌బీసీ, సీతారామసాగర్, కొడంగల్–నారాయణపేట వంటి కృష్ణా నదిపై ఉన్న కీలక ప్రాజెక్టులలో ఒక్కటినైనా కేసీఆర్ పాలనలో పూర్తి చేయలేకపోయారని కూడా విమర్శిస్తున్నారు. కృష్ణా, గోదావరి జలాలపై జనవరి రెండో తేదీ నుంచి “రోడ్లపై కాదు, అసెంబ్లీలో నీళ్లపై, నిజాలపై చర్చిద్దామ”న్న సీఎం వ్యాఖ్యలు రాజకీయ ఉద్రిక్తతను మరింత పెంచాయి.

దీనికి ప్రతిగా కేసీఆర్ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టారు. తమ పాలనలో రాష్ట్రం సంక్షేమం, అభివృద్ధి, పారిశ్రామిక వృద్ధి, శాంతిభద్రతలతో పురోగతి సాధించిందన్నారు. ఇప్పుడు మాత్రం పాలమూరుకు రెండేళ్లలో రూపాయి ఖర్చు చేయలేదని, దీని వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయో చెప్పాలని ప్రశ్నించారు.

అధికార, విపక్షాలు పరస్పరం ఆరోపించుకోవడమే కాక, నిరూపిస్తామని సవాళ్ళు విససురుకోవడమే గానీ, ఎవరూ ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయారు. ‘నేను కొట్టినట్లు చేస్తా, నువ్వు ఏడ్చినట్లు నటించు’ అన్నట్లుగా రెండు పార్టీల వ్యవహరిస్తున్నాయి. సంచలనాలతో వాళ్ళు చర్చనీయంగా ఉండే సంవాదాలు, సవాళ్లే తప్ప, ప్రజలు, వారి సంక్షేమంపై ఎవ్వరికీ చిత్తశుద్ధి ఉన్నట్లుగా కనిపించడం లేదు.

ఈ రాజకీయ యుద్ధంలో ప్రజలు, ప్రగతి అయోమయంగా కొట్టుకుపోతున్నాయి. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. దీనికి గతంలో పాలించినవారు, ప్రస్తుతం పాలిస్తున్నవారే బాధ్యులే. అప్పులు, నదీజలాల వాటాలు, అభివృద్ధి ప్రాధాన్యాలపై సమగ్రంగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఆ చర్చకు అసెంబ్లీ వేదికైతేనే అది రికార్డు కూడా అవుతుంది. బయట నిరూపించగలిగిన వాళ్ళెవరైనా, అసెంబ్లీలో చర్చకు భయపడాల్సిన అవసరంలేదు. చర్చకు రానంత వరకు, ఆరోపణలు నిరూపణ కానంతవరకు ఈ సవాళ్ళకు సత్తా లేనట్లే! ఆ సవాళ్ళు విసిరే నేతలకు విలువా లేనట్లే!! ప్రజలు వింటున్నారు కదా? అని అదే పనిలో ఉంటే, సమయం వచ్చినప్పుడు తగిన బుద్ధి చెబుతారు.

Latest News

16-03-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి ద్వాదశి ఉదయం 07.43 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం ధనిష్ఠ రాత్రి తెల్ల 05.09 వరకు ఉపరి శతభిషం యోగం శివ ఉదయం 08.15 వరకు ఉపరి సిద్ద కరణం తైతుల ఉదయం...

ఇంట, వంట, పంట, పయానం అన్నీ గా ట్రాక్టరే!?|ADUGU TRENDS

ఉపాయం లేనోన్ని ఊల్లెనే ఉండనీయొద్దట! గందుకే ఉపాయమున్న గీయినె, ఊల్లు తిరుగుతాండు!! ఊల్లు తిరుగుడంటే, ఊల్లు పట్టుకుని తిరుగుతాండని కాదుల్లా... ఇట్టమైన ఊల్లని ఏ కట్టం లేకుండా తిరుగుతాండు. గదెట్లంటరా? ఇగో మీరే...

బడ్జెట్ : ప్రజాకాంక్షలను ప్రతిబింబించేనా!?|EDITORIAL

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు రాష్ట్ర రాజకీయ వర్గాలనేగాక, సాధారణ ప్రజల్లో కూడా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. రాష్ట్రంలోని రైతులు, ఉద్యోగులు,...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

మార్చి 15 నుండి మార్చి 21 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి పనుల్లో కొంత ఒత్తిడి ఉన్నా చివరికి మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఉద్యోగంలో మీ...

ఈవీలేవీ? ఈవీలపై క్లారిటీలేవీ?|EV|TELANGANA|CM|GOVERNMENT

మొన్న సీఎం|CM|REVANTH REDDY, నిన్న డిప్యూటీ సీఎం|DEPUTY CM|BHATTI VIKRAMARKA MALLU ప్రకటనల సారాంశమేంటి?|SUMMARY ప్రస్తుత వాహనాలనేం చేస్తారు?|OLD VEHICLES కొత్తవి సరే, పాతవాటి పరిస్థితేంటి? ఇప్పటికే తుప్పుపట్టిన వాహనాల సంగతేంటి? ఇం‘ధన’ ఖర్చు తగ్గించడానికి వేల కోట్ల వ్యయమా? ఉన్న...

ఎలుకలు రాకుండ అదిరే శిట్కా!?|ADUGU TRENDS

ఎలుక సొర్రిందని ఇల్లు తగుల బెట్టుకుంటమా? ఏంది? యెట్లన్న శేసి గా ఎలుకను బయిటికి తోలుతం. ఇల్లును మాత్రం మంచిగ కాపాడుకుంటం. మరైతే ఇంట్లకు ఎలుకలు రాకుండ ఏం శేయాల్నో, ఎట్లెట్ల శేయాల్నో...

రాహుల్ పరిపక్వ విపక్ష నేతేనా!?|EDITORIAL

భారత రాజకీయాల్లో విపక్ష నాయకత్వం ఎప్పుడూ ప్రజాస్వామ్య పరిరక్షణకు అత్యంత కీలకం. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, విధానాలను సమీక్షించడం, ప్రత్యామ్నాయ మార్గాలను చూపడం, అవసరమైన సూచనలు చేయడం, తద్వారా ప్రభుత్వాన్ని గాడిలో పెట్టడం విపక్షం...

14-03-2026, శనివారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి ఏకాదశి పూర్తిగ రోజంత నక్షత్రం ఉత్తరాషాఢ రాత్రి 02.53 వరకు ఉపరి శ్రవణ యోగం వరీయాన్ ఉదయం 09.01 వరకు ఉపరి పరిఘ కరణం బవ సాయంత్రం 06.24 వరకు ఉపరి బాలవ రాహుకాలం...

ముగిసిన యువకుడి అంత్యక్రియలు|PALAKURTHI

పుత్రశోకంలో కన్నతల్లి కన్నీటి వీడ్కోలు ఘన నివాళులు అర్పించిన పాలకుర్తి విధి ఆడిన వింత నాటకంలో ఒక కన్నతల్లికి అంతకన్నా దౌర్భాగ్య స్థితి మరొకటి ఉండదు. కొడుకే లోకమని, తనే తన సర్వస్వమని బతికిన ఆ...

గాలి మోటర్ల.. గా అత్తగారింటికి!?|ADUGU TRENDS

అత్తగారింటికి దారేది? అంటే గాల్లో తేలినట్లు ఏకంగా గాలి మోటర్లనే తీసుకపోయి, సూసెటోల్ల గుండె పేలినట్టు శేసిండో పెండ్లి కొడుకు. గీ మద్దెల పండ్లిల్లకు ఇరగమరగ కర్సు సేత్తాండ్లు. ఎంత ఎక్కువ కర్సు శేస్తే,...

సాగు బాగుకు ఇదే సరైన సమయం!|EDITORIAL

ప్రపంచ రాజకీయ పరిణామాలు, పశ్చిమాసియాలో యుద్ధాలు, అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థను ప్రగాఢంగా ప్రభావితం చేస్తున్నాయి. ఎగుమతులు, దిగుమతులు తీవ్ర అంతరాయానికి గురవుతున్నాయి. ఈ సమయాన్ని భారత్ తన ఆహార భద్రత, వ్యవసాయ రంగాన్ని...

13-03-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి దశమి రాత్రి తెల్ల 05.47 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం పూర్వాషాఢ రాత్రి 01.02 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం వ్యతీపాత ఉదయం 08.53 వరకు ఉపరి వరీయాన్ కరణం వణజి సాయంత్రం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News