వరంగల్ పోలీస్ కమిషనరేట్ నూతన పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ శనివారం స్టేషన్ ఘన్పూర్ పోలీస్ స్టేషన్ ను తొలి సరిగా సందర్శించారు. ఈ రోజు మధ్యాహ్నం పోలీస్ స్టేషన్ కు చేరుకున్న పోలీస్ కమిషనర్ ముందుగా స్టేషన్ పరిసరాలు, సిబ్బంది గృహ సముదాయాన్ని పరిశీలించారు. అనంతరం పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలు శాంతి భద్రతలకు సంబంధించి అక్కడ ఎలాంటి ఫిర్యాదులు వస్తాయి. పోలీస్ స్టేషన్ పనిచేస్తున్న సిబ్బంది వివరాలను పోలీస్ కమిషనర్ స్టేషన్ ఇన్స్ స్పెక్టర్ వేణు ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రేపు సియం రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా శివుని పల్లె గ్రామ శివారు ప్రాంతంలో జిరిగే బహిరంగ సభకు ఏర్పాటు చేయాల్సిన బందోబస్తు ఏర్పాట్లపై పోలీస్ కమిషనర్ పోలీస్ అధికారులతో సమీక్షా చేశారు. ఈ సమీక్ష లో ప్రధానంగా, సభాస్థలి, హెలిపాడ్ ల వద్ద పోలీస్ బందోబస్త్, అలాగే వాహన పార్కింగ్, ట్రాఫిక్ క్రమబద్దికరణతో సభ తరలి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై సీపీ సంబంధిత పోలీస్ అధికారులతో సమీక్షా జరిపారు.

