Sunday, September 27, 2026
25.2 C
Hyderabad

తమిళనాట కొత్త చరిత|TAMILANADU|TVK PARTY

ద్రవిడ పార్టీలకు చరమగీతం
అనూహ్యంగా దళపతి విజయం|THALAPATHY VIJAY
స్టాలిన్ కు ఘోర పరాజయం|STALIN
ప్రభావం చూపని బీజేపీ నేతలు|BJP LEADERS

తమిళనాట కొత్త చరిత్ర ఆవిష్కృతమయ్యింది. అనూహ్యంగా దూసుకు వచ్చిన నటుడు విజయ్ పార్టీ తమిళనాట జెండా పాతింది. ఎగ్జిట్ పోల్ అంచనాలను తలకిందులు చేస్తూ ద్రవిడ పార్టీలను మట్టి కరిపించింది. అధికార డిఎంకెను ఓ కుమ్ము కుమ్మింది. తమిళనాట హిందీ వ్యతిరేకత, దక్షిణాదికి అన్యాయం అంటూ హుంకరించిన సిఎం స్టాలిన్ పార్టీ ఓడడమే గాకుండా స్వయంగా ఆయన కూడా ఓడిపోయారు. తెలంగాణ గవర్నర్‌గా పనిచేసిన తమిళసై సైతం వరుసగా రెండోసారి ఓటమిదిశలో ఉన్నారు. ఒకప్పటి తన అనుచరుడు, డిఎంకె పార్టీ నేత చేతిలో దారుణంగా ఓటమి చెందారు. ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ మాత్రం విజయం దిశగా ఉన్నారు. మంత్రులు చాలామంది ఇంటి ముఖం పట్టారు. ఇక టీవీకే చీఫ్ విజయ్.. పెరంబూరు నియోజకవర్గం నుంచి గెలుపొందారు. తాజా సమాచారం ప్రకారం టివికె 108 స్థానాల్లో, 59 స్థానాల్లో డిఎంకె, 44 స్థానాల్లో అన్నాడీఎంకే అభ్యర్థులు లీడింగ్‌లో ఉన్నారు. చెన్నై, చంగల్‌పట్టు, కంచీపురం, తిరువల్లూరులో టివికె విజయ కేతనం ఎగురవేసింది.వాస్తవానికి ఈ ప్రాంతాల్లో ద్రావిడ్ పార్టీల ఆధిపత్యం ఉండేది. సెంట్రల్ తమిళనాడులోనూ టీవీకే మంచి పోటీ ఇచ్చింది. తిరుచిరాపల్లి, తాంజావురు, కరూర్, పెరంబలూరు, అరియాలూరు, నాగపట్టణం, తిరువరూరు, పుడుకొటెí్ట, మలదుతరై జిల్లాలో టివికె గట్టి పోటీనిచ్చింది. దీంతో దళపతి ఇక కొత్త సిఎంగా కావడం అనివార్యం అయ్యింది. చిన్నా చితక పార్టీలు లేదా అన్నడిఎంకెతో పొత్తు కుదిరితే సరిపోతుంది. మొత్తంగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో దళపతి విజయ్ సరికొత్త చరిత్ర సృష్టించారు. తన రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కళగం ద్వారా ఎన్నికల బరిలోకి దిగిన ఆయన, దశాబ్దాలుగా రాష్టాన్ని ఏలుతున్న ద్రావిడ పార్టీలను విస్మయానికి గురిచేశారు. తాజా ట్రెండ్స్ ప్రకారం, విజయ్ నేతృత్వంలోని టీవీకే ఏకంగా 109 స్థానాల్లో ముందంజలో ఉండి, రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించే దిశగా దూసుకుపోతోంది. సినిమా స్టార్‌లు రాజకీయాల్లో రాణించలేరన్న అపవాదును చెరిపివేస్తూ, విజయ్ తన సినీ పాపులారిటీని ఓట్లుగా మార్చుకోవడంలో సఫలమయ్యారు. తద్వారా దివంగత నేతలు ఎన్టీ రామారావు, ఎంజీ రామచంద్రన్, జయలలిత వంటి దిగ్గజాల సరసన ఆయన నిలిచారు. 1977 తర్వాత తమిళనాడులో డీఎంకే, ఏఐఏడీఎంకే కాకుండా మరో పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేయడం ఇదే తొలిసారి.పార్టీ అధికార ప్రతినిధి ఫెలిక్స్ గెరాల్డ్ మాట్లాడుతూ.. ’ఇది కుటుంబ రాజకీయాలకు, అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన స్పష్టమైన తీర్పు. ఎవరి మద్దతు లేకుండానే మేము సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం’ అని ధీమా వ్యక్తం చేశారు. విజయ్ నివాసం వద్ద ఆయన కుటుంబ సభ్యులు పార్టీ గుర్తు అయిన ’విజిల’ సాంగ్‌తో సంబరాలు చేసుకున్నారు. మెజారిటీ మార్కు 118కి టీవీకే చేరువలో ఉంది. చిన్న పార్టీల మద్దతుతో లేదా స్వతంత్రంగా విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో చెన్నైలోని టీవీకే ప్రధాన కార్యాలయం వద్ద కార్యకర్తలు మిఠాయిలు పంచుకుంటూ, జెండాలు ఊపుతూ పండుగ చేసుకున్నారు. ఇకపోతే ఎన్నికల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ ఓడిపోయారు. కొళత్తూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన..టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు చేతిలో 9వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. కొళత్తూరు నుంచి వరుసగా మÖడుసార్లు గెలిచిన సీఎం ఈ ఎన్నికల్లో విజయం సాధించలేక పోయారు. 1996 తర్వాత స్టాలిన్ ఓడిపోవడం ఇదే తొలిసారి. ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ టీవీకే గెలుపు దిశగా దూసుకుపోతోంది. స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ మాత్రం ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వీఎస్ బాబుకు 82 వేల పైచిలుకు ఓట్లు రాగా, స్టాలిన్‌కు దాదాపు 73 వేల ఓట్లు పోలయ్యాయి. అన్నాడీఎమ్‌కేకు చెందిన సంతానకృష్ణన్ దాదాపు 14 వేల ఓట్లతో మÖడవ స్థానానికి పరిమితమయ్యారు. 1996 తరువాత డీఎమ్‌కే అధినేతకు ఓటమి ఎదురు కావడం ఇదే తొలిసారి. వీఎస్ బాబు గతంలో డీఎమ్‌కే, ఏఐఏడీఎమ్‌కే పార్టీల్లో సేవలందించారు. 2006`11 మధ్య పురసవల్కం ఎమ్మెల్యేగా పనిచేశారు. 2011 వరకూ డీఎమ్‌కే ఉత్తర చెన్నై డిస్టిక్ట్ సెక్రటరీగా కూడా ఉన్నారు. 2011 నాటి ఎన్నికల్లో కొళత్తూర్ నియోజకవర్గం ఇన్‌చార్జ్‌గా కూడా ఉన్నారు. ఆ ఎన్నికల్లో సీఎం స్టాలిన్‌కు మెజారిటీ తగ్గడంతో విమర్శల పాలయ్యారు. అనంతరం అన్నాడీఎమ్‌కేలో చేరారు. ఈ ఏడాది నటుడు విజయ్ సారథ్యంలోని టీవీకే పార్టీలో చేరారు. తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో అడుగుపెట్టిన విజయ్ సారథ్యంలోని టీవీకే విజయపథంలోకి దూసుకెళ్తోంది. అయితే మెజారిటీకి 118 సీట్లు అవసరమవుతాయి. మెజారిటీ తగ్గిన పక్షంలో ప్రభుత్వం ఏర్పాటుకు ఏయే పార్టీలతో సంప్రదింపులు జరిపే అవకాశం ఉందనే దానిపై తాజాగా సోషల్ విÖడియాలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఎన్నికల ఫలితాల అనంతరం అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకునేది లేదని టీవీకే ఇంతకుముందే ప్రకటించింది. అయితే టీవీకే మెజారిటీకి అతి దగ్గరలో ఆగిపోయిన పక్షంలో ఆ పార్టీ మద్దతు తీసుకునే అవకాశాలను తోసిపుచ్చలేమని అంటున్నారు. కాగా, సెక్యులర్ ప్రొగ్రసివ్ అలెయెన్స్‌లో భాగంగా డీఎంకేతో కాంగ్రెస్, సీపీఎం పొత్తు పెట్టుకున్నాయి. ట్రెండ్స్ ప్రకారం కాంగ్రెస్ 5 స్థానాల్లో, సీపీఐ రెండు స్థానాల్లో, సీపీఎం ఒక స్థానంలో గెలుపునకు చేరువలో ఉన్నాయి. డీఎంకేతో కాంగ్రెస్ భాగస్వామిగా ఉన్నప్పటికీ ఆ పార్టీలోని కొందరు టీవీకే పట్ల సానుకూలంగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో టీవీకేతో పొత్తు పెట్టుకోవాలని కాంగ్రెస్‌లోని ఒక వర్గం మొదట్నించీ పట్టుపడుతోంది. అయితే చివరి నిమిషంలో డీఎంకేతోనే కలిసి పోటీ చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో టీవీకే ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్ మద్దతు తీసుకునే అవకాశాలు బలంగా ఉన్నట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాగా ప్రభుత్వం ఏర్పాటులో భాగంగా టీవీకే ఇటు కాంగ్రెస్‌తో పాటు ఐయÖఎంఎల్, డీఎండీకే, లెప్ట్ పార్టీల సాయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. డాక్టర్ అన్బుమణి రామదాస్ సారథ్యంలోని పీఎంకే మద్దతును కూడా టీవీకే కూడగట్టవచ్చని చెబుతున్నారు. ఏదిఏమైనా పూర్తి ఫలితాలు వెలువడిన తర్వాతే టీఎంకే వ్యూహరచన ఉంటుందని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి.

Latest News

గీ యినాయకునికి.. నిమజ్జనమే లేదు!?|ADUGU TRENDS

పతి ఏటా యినాయకులను పతిష్టించి, పూజించి, కోటొక్క తీర్గ కొలిచి సివరాకరికి నిమజ్జనం చేస్తుంటం. కానీ, గీ యినాయకునికి నిమజ్జనమే లేదు!? ముంబై గిర్గావ్ లో ఓ గణేశ్ మండలి గీ సంప్రదాయాన్ని...

కత్తులు దూసిన చేతులే.. కరచాలనం!|EDITORIAL

నిన్నటి వరకు పరస్పరం సుంకాలు, ఆంక్షలు, హెచ్చరికలతో ఢీకొన్న అమెరికా–చైనా.. ఒక్కసారిగా ఆత్మీయ ఆలింగనంలో కనిపించాయి. శత్రువుల్లా కనిపించిన రెండు అగ్రశక్తుల అధినేతలు ఒకే వేదికపై చిరునవ్వులు చిందించడం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది....

ఈ రోజు/ వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 27 నుండి అక్టోబర్ 03 వరకు రాశి ఫలాలు మేష రాశి: ఈ వారం కొత్త బాధ్యతలు మీ ముందుకు రావచ్చు. ఉద్యోగంలో మీ పనితీరును ఉన్నతాధికారులు గమనించే అవకాశం ఉంది. పెండింగ్‌లో ఉన్న...

ఇగ్రహం ఉన్న సోటనే నిమజ్జనం!|ADUGU TRENDS

ప్రతి ఏటా ఇనాయకులను నిలబెడత0.. తొమ్మిది, పది రోజులు ఘనంగా పూజలు సేస్త0. ఇగ గా ఇగ్రహాలను చెరువుల్ల, కుంటల్ల నిమజ్జనం సేస్త0. గా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో సేసే గా...

సర్ వివాదం.. ఈసీ విశ్వసనీయతకు సవాల్!|EDITORIAL

ఓటు ప్రజాస్వామ్యానికి ఆయుధం.. ఆ ఓటుకు కాపలాదారు ఈసీ! మరి కాపలాదారుడి విశ్వసనీయతపైనే ప్రశ్నలు తలెత్తితే? సర్ వివాదాలు, కమిషనర్ల అభ్యంతరాలు, ప్రతిపక్షాల ఆరోపణల నడుమ.. ఎన్నికల సంఘం పారదర్శకత ఇప్పుడు దేశం...

సెప్టెంబర్ 26, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి పౌర్ణమి రాత్రి 09.45 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం పూర్వాభాద్ర ఉదయం11.50 వరకు ఉపరి ఉత్తరాభాద్ర యోగం గండ పగలు 02.41 వరకు ఉపరి వృద్ధి కరణం భద్ర ఉదయం 09.48 వరకు ఉపరి బవ రాహుకాలం...

అడుగుకు అభినందనలు!|ADUGU DIGITAL MEDIA

మట్టి వినాయకుల ప్రచారానికి పలువురి ప్రశంసలు ఈ ప్రయత్నాన్ని ఇలాగే కొనసాగించాలని సూచనలు అడుగు కార్యాలయానికి మంత్రి జూపల్లి, కలెక్టర్ పలువురి ఫోన్లు! పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకులను ప్రతిష్టించి పూజలు నిర్వహించాలని ప్రజలకు అవగాహన...

ఆరోగ్యకరమైన భవిష్యత్తుల కోసం ఫార్మసిస్ట్ ల సశక్తీకరణ!|PHARMACIST|HEALTH

(ప్రపంచ ఫార్మసిస్ట్ ల దినోత్సవం : 25 సెప్టెంబర్ 2026) ప్రపంచంలో ఔషధం అవసరం లేని మనిషి లేడంటే అతిశయోక్తి కాదు. ఔషధ ప్రయోక్తలైన ఫార్మసిస్ట్ లు ప్రతి నిత్యం ప్రపంచవ్యాప్తంగా ఔషధాలతో పాటు...

మూడో బిడ్డకు బంపర్ ఆఫర్!?|ADUGU TRENDS

ఎనకటికి ఎంత ఎక్కువ మందిని కంటే గంత ఇలువ. అంత గౌరవం. ఒక్కొకల్లు డజను మందిని కనేది. గంపెడు మందితో ఇల్లు కళకళలాడేది. ఎంత ఎక్కువ మంది ఉంటే, గా ఇంటికి అంత...

శాశ్వత సభ్యత్వంలో భారత్ ముందడుగు!?|EDITORIAL

భారత్‌కు శాశ్వత సభ్యత్వం సాధించాలంటే దౌత్య మద్దతుతోపాటు ఐ రా స చార్టర్‌ సవరణకు అవసరమైన ప్రక్రియలు పూర్తికావాలి. తాజా యూరప్‌ మద్దతు ఆశలను పెంచినా, తుది ఫలితానికి మరింత అంతర్జాతీయ సమ్మతి...

సెప్టెంబర్ 25, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు చతుర్దశి రాత్రి 09.53 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం శతభిషం ఉదయం 11.09 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శూల పగలు 03.50 వరకు ఉపరి గండ కరణం గరజి ఉదయం 09.43...

SIRపై CJP సమరం..|SIR|CJP

సీఈసీకి 48 గంటల డెడ్‌లైన్! న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ **(SIR)**పై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) తీవ్ర స్థాయిలో స్పందించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ 48 గంటల్లో...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News