ఊరూరా తెలంగాణ తల్లి విగ్రహాలు పెడుతాం
మీడియాతో చిట్ చాట్ లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి ఇప్పటి వరకు బాన్సువాడ, కామారెడ్డి నియోజకవర్గాల్లో ఆ హామీ అమలు కాలేదని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ మాట్లాడే బదులు పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు పనులు కొంతమేర పూర్తి చేస్తే నీళ్లు ఇవ్వడానికి అవకాశం ఉందన్నారు. అలాగే ప్రభుత్వం ప్రజల కోసం కాకుండా కొందరి వ్యక్తుల కోసమే నడుస్తుందన్నారు. సీఎం రైతులకు ఏం చేస్తారో చెప్పకుండా ప్రతిపక్షాలను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు అన్నారు.
అలాగే, కేసీఆర్ ప్రభుత్వం ప్రపంచ బ్యాంకును రానివ్వలేదని, కానీ రేవంత్ రెడ్డి ప్రపంచ బ్యాంకు నిధులను తెచ్చే దిశగా అడుగులు వేస్తున్నారని ఆమె అన్నారు. అలాగే సీఎం దళిత, గిరిజన సంఘాలకు ఏం చేసినట్లు చెప్పకుండా ప్రతిపక్షాలను విమర్శించడం సరియైన పద్ధతి కాదు అన్నారు. తెలంగాణ తల్లి విషయంపై గ్రామగ్రామాన తెలంగాణ తల్లి విగ్రహాలను పెడతామన్నారు. అలాగే, రాష్ట్రంలో రివెంజ్ పాలిటిక్స్, డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయని కూడా అన్నారు.
రాష్ట్రంలో కేవలం కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉందని ప్రజల్లో స్పష్టత ఉందని కవిత తెలిపారు. రేవంత్ రెడ్డి, బీజేపీ, కాంగ్రెస్ ల సమన్వయ కర్త అని మీడియా వారు అడిగిన ఒక ప్రశ్నకి సమాధానం ఇచ్చారు.

