ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ పాలకుర్తి మండల అధ్యక్షులు బీజ్జల సోమన్న ఆధ్వర్యంలో జిల్లా, రాష్ట్ర నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయగా, ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు బిజ్జాల నవీన్ గుప్తా ముఖ్య అతిథిగా హాజరై పాలకుర్తి మండల కమిటీ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం నిర్వహించిన వివిధ కార్యక్రమాలు, జయంతి వేడుకలు, ముగ్గుల పోటీలు, మజ్జిగ పంపిణీ, మట్టి వినాయకుల పంపిణీ, ఉత్తమ బతుకమ్మ అవార్డులు, గాంధీ జయంతి, కుట్టు మిషన్ల పంపిణీ వంటి కార్యక్రమాలపై చర్చించి, ఈ నూతన సంవత్సరంలో చేయవలసిన కార్యక్రమాలను రూపొందించి, వైశ్యులకు ఎలాంటి కష్టం వచ్చినా వారికీ అండగా వుంటామని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ IVF ఇన్చార్జ్ బీజ్జల శ్రీనివాస్, జనగామ జిల్లా అధ్యక్షులు బీజ్జల నవీన్ కుమార్ గుప్తా, జనగామ జిల్లా కోశాధికారి రాపాక విజయ్, పాలకుర్తి మండల అధ్యక్షులు బీజ్జల సోమన్న, వైశ్య యువ నాయకులు జిల్లా సంయుక్త కార్యదర్శి అల్లాడి వెంకన్న, రాపాక అనిల్, పబ్బా సంతోష్, యాద వెంకన్న, దొడ్డ సతీష్, అక్కినపల్లి శ్రీధర్, రాపాక శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

