గీ మద్దెల కుక్కల రోజులొచ్చినయి. మనుసుల లెక్కనే గా కుక్కల జనాభా కూడా పెరిగింది. గవి జనం మీదకు ఎగపడుడు. కరుసుడు, పీక్కతినుడు కూడా ఎక్కువై పోయింది. గ వాట్ని సంపుదామంటే, జీవ కారుణ్య జీవులు గట్లెట్ల సంపుతరని అడగబట్టిరి. గిదంత పని కాదని, గా కుక్కల జనాభాకు కు.ని ఆపరేషన్లు శేసి, గవాటి జనాభాను అరికట్టబట్టిరి. గండ్ల గూడ అవినీతి తిమింగలాలు సొచ్చి, గా పైసలు లచ్చలకు లచ్చలు ఖతం చేస్తాండ్రట.
మధ్యప్రదేశ్ ఖండ్వా కార్పొరేషన్ల గిట్లనే కుక్కు బెడద ఎక్కువై గవాటికి కు.ని ఆపరేషన్లు శేత్తాండ్రట. గీదీంట్లె కూడ రుసి మరిగిన ఆపీసర్లు అవినీతికి మరిగిండ్రట. గిదీన్ని నిరసించడాన్కి, గా కొర్పరేషన్ల ప్రతిపక్ష నేతగున్న దీపక్ రాథోడ్ ఓ కొత్తరకం నిరసన తెలిపిండు. ఓ మనిసికి కోపంగా ఉన్న కుక్క తొడుగేసిండు. గాయిన్ని గా కమిషనర్ దగ్గరకు తీస్కపోయి, జరుగుతున్న అవినీతిని బయట పెట్టిండు. కుక్కుల సమస్య కు కుక్కల తొడుగు తోటే జవాబిచ్చిండన్నట్లు.

