Thursday, July 30, 2026
23.7 C
Hyderabad

ద్రవ్యోల్బణ సవాళ్ళకు పరిష్కారాలివే!|EDITORIAL

ప్రపంచ ఆర్థిక, రాజకీయ పరిణామాలు భారతదేశంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల పెరుగుదల, రూపాయి మారకం విలువ పతనం, వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు మన దేశమేగాక, ప్రపంచ ఆర్థిక ప్రగతికి ప్రధాన అడ్డంకులుగా మారుతున్నాయి. ఈ విపరిణామాలు ద్రవ్యోల్బణాన్ని ఆందోళనకరంగా మారున్నాయి.

పశ్చిమాసియా ప్రపంచ ఇంధన సరఫరాకు కీలక కేంద్రం. అక్కడ ఉత్పత్తి అయ్యే ముడి చమురు, సహజ వాయువుల దిగుమతులపైనే ప్రపంచ దేశాల మనుగడ కొనసాగుతోంది. అయితే ప్రస్తుతం అక్కడ కొనసాగుతున్న యుద్ధం చమురు ఉత్పత్తి, సరఫరాలను తీవ్రంగా ప్రభావితం చేశాయి. దెబ్బతీశాయి. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయటం వల్ల అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు ఒక్కసారిగా ఎగసాయి. ఈ ప్రభావం భారత్‌పై మరింత తీవ్రంగా పడుతోంది. దేశ ఇంధన అవసరాల్లో 90 శాతం దిగుమతులపైనే ఆధారపడి ఉంది.

చమురు ధరలు పెరగడం వల్ల రవాణా ఖర్చులు గణనీయంగా పెరిగాయి. ఈ ప్రభావం అన్ని రంగాలపై కనిపిస్తోంది. వ్యవసాయం నుండి పరిశ్రమల వరకు, వినియోగ వస్తువుల నుండి సేవల వరకు ప్రతి రంగంలో ధరలు పెరుగుతున్నాయి. ఫలితంగా ద్రవ్యోల్బణం వేగంగా పెరుగుతోంది. ఇటీవలి అంచనాల ప్రకారం ద్రవ్యోల్బణం 3.9% నుంచి 4.6% చేరుకునే అవకాశం ఉంది.

ఇంకా రూపాయి మారకం విలువ పతనం అత్యంత కీలకం. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఈ ఏడాది ప్రారంభం నుండి 4% వరకు పడిపోయింది. రూపాయి విలువ చరిత్రలోనే కనిష్ఠ స్థాయికి చేరి 94 మార్కును దాటడం గమనార్హం. రూపాయి విలువ పడిపోవడం వల్ల దిగుమతులు మరింత ఖరీదవుతాయి. చమురు వంటి కీలక వస్తువుల దిగుమతులు ఖరీదవడం ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచుతుంది.

ఈ పరిస్థితుల్లో దేశ ఆర్థిక వృద్ధి రేటు కూడా ప్రభావితం అవుతోంది. అంతర్జాతీయ ఆర్థిక సంస్థ గోల్డ్ మ్యాన్ సాచ్స్ ఇటీవల భారత జీడీపీ వృద్ధి అంచనాలను వరుసగా తగ్గించింది. 2026లో మొదట 7 శాతంగా అంచనా వేసిన వృద్ధిని, ఈ నెల 13న 6.5 శాతానికి, ఆ తర్వాత 5.9 శాతానికి తగ్గించడం పరిస్థితి తీవ్రతను ప్రతిబింబిస్తోంది. కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే పడిన కోతలు ఆర్థిక అస్థిరతను సూచిస్తున్నాయి.

ద్రవ్యోల్బణం పెరిగితే, వడ్డీ రేట్ల పెంపు కూడా అనివార్యమవుతుంది. రిజర్వు బ్యాంకు ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకు కఠిన ద్రవ్య విధానాన్ని అనుసరించాల్సి వస్తుంది. రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. వడ్డీ రేట్లు పెరిగితే రుణాల ఖర్చు పెరుగుతుంది. దీని వల్ల వ్యాపారాలు, పెట్టుబడులు తగ్గి, ఆర్థిక కార్యకలాపాలు మందగిస్తాయి.

ఇక గ్యాస్ కొరత కూడా మరో పెద్ద సమస్యగా మారుతోంది. గ్యాస్ సరఫరా తగ్గిపోవడంతో హోటళ్లు, చిన్న వ్యాపారాలు, పరిశ్రమలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఎరువుల తయారీపై కూడా ప్రభావం పడుతోంది. ఇది వ్యవసాయ రంగంపై ప్రతికూల ప్రభావాన్ని చూపే ప్రమాదం. తద్వారా ఆహార ధరలు పెరిగే అవకాశమూ ఉంది.

కరెంట్ అకౌంట్ లోటు కూడా పెరుగుతున్నది. ఇది జీడీపీలో 2 శాతానికి చేరుకునే అవకాశం ఉందని అంచనా. దీని వల్ల విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరుగుతుంది. విదేశీ రుణభారం కూడా అధికమవుతుంది. దీని ప్రభావం దీర్ఘకాలికంగా ఆర్థిక స్థిరత్వంపై పడుతుంది.

మొత్తంగా ప్రస్తుత పరిస్థితి సంక్లిష్ట ఆర్థిక సంక్షోభానికి సంకేతం. యుద్ధ ఉద్రిక్తతలు, ఇంధన కొరత, ధరల పెరుగుదల, రూపాయి పతనం పరస్పరం అనుసంధాన అంశాలు. ఈ పరిణామాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి పెట్టాలి. దిగుమతులపై ఆధారాన్ని తగ్గించుకోవాలి. దేశీయ ఉత్పత్తిని పెంచితేనే, ఈ సంక్షోభాన్ని కొంతవరకు తగ్గించవచ్చు. ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడం, ఆర్థిక వృద్ధిని కొనసాగించడమే ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ ముందున్న అతిపెద్ద సవాల్!

Latest News

మా అమ్మాయిని పెండ్లి చేసుకోండి…|CJP|ABHIJITH DIPKE|MARRIAGE

CJP అధినేత అభిజీత్ దీప్కే తల్లి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు|MOTHER|ANITA DIPKE ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడిగా, విద్యార్థుల హక్కుల పోరాటంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అభిజీత్ దీప్కే వివాహంపై ఆయన తల్లి...

ఆర్యుల/వైదిక నాగరికత|HISTORY|ADUGU DIGITAL MEDIA|SPECIAL|COMPITITIVE EXAMS

సింధు నాగరికత తర్వాత భారతదేశంలో అభివృద్ధి చెందిన రెండవ నాగరికత ఆర్యుల నాగరికత. ఈ ఆర్యులు నార్దిక్ జాతికి చెందినవారు. ఈ నార్దిక్ జాతి వారు ఆర్య అనే భాషను మాట్లాడడం ద్వారా...

గుండు కొట్టించుకోండ్రి! యేలు పట్టుకుపోండ్రి!?|ADUGU TRENDS

గుండు కొట్టించుకుంటే ఎవలన్నా పైసలిత్తరా? నిజంగనే ఇత్తరాని? ఇత్తరని గవాల్లు నమ్మిండ్రు. గుండు గూడా గీయించుకుండ్రు. పున్నానికొత్తే పినాయిల్ కూడా తాగుతరన్నట్టు, ఉచితాలకు మనోల్లు ఎంత అలవాటైపోయిండ్లో శేప్పే గీ ముచ్చట మీరే...

నీట్ పరీక్షల బిల్లులో పటిష్టతేది!?|EDITORIAL

కొత్త బిల్లు ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదు. ఎంత కఠినమైన శిక్షల బిల్లు తెచ్చినా, లీకేజీలకు పాల్పడేవారు శిక్షల నుంచి తప్పించుకునే మార్గాలను వెతుకుతూనే ఉంటారు. అందువల్ల శిక్షల కంటే వ్యవస్థను బలోపేతం...

జూలై 30, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పాడ్యమి రాత్రి 07.58 వరకు ఉపరి విదియ నక్షత్రం శ్రవణ సాయంత్రం 05.43 వరకు ఉపరి ధనిష్ఠ యోగం ఆయుష్మాన్ రాత్రి 01.02 నుండి ఉపరి సౌభాగ్య కరణం బాలవ ఉదయం 07.44...

సర్.. ఆ కుటుంబాన్ని కలిపింది సార్!?|ADUGU TRENDS

సర్ పక్రియ ఓట్లను తొలగించి సత్తెనాశనం శేసిందని, పతిపక్ష పార్టీలు అల్లరి శేసి ఆగమాగమైతాంటే, అధికార పార్టీ మాత్రం ఏ గిది మస్తుగుంటాందంటాంది. మొత్తానికి సర్, పార్టీలను యిడగొట్టినా, ఓ కుటుంబాన్ని కలిపింది....

హైడ్రా-పారదర్శకతే ప్రామాణికం కావాలి!|EDITORIAL

ప్రభుత్వ భూములను రక్షించడం ఎంత ముఖ్యమో, రాజ్యాంగం కల్పించిన ఆస్తి హక్కు, సహజ న్యాయ సూత్రాలను కాపాడటం కూడా అంతే ముఖ్యమైనది. ప్రభుత్వం హైడ్రా ద్వారా ప్రభుత్వ భూములను కాపాడాలనే లక్ష్యాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం...

జూలై 29, బుధవారం, 2026|RASHI PHALALU

గురు పౌర్ణమి శాకాంబరీ ఉత్సవం శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి పౌర్ణమి రాత్రి 07.05 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 03.48 వరకు ఉపరి శ్రవణ యోగం ప్రీతి రాత్రి 01.03 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం భద్ర ఉదయం...

ద్రవరూప రంగుల విల్లు|ADUGU|SPECIAL STORY|CANO CRYSTALS

కొలంబియాలోని ‘లిక్విడ్ రెయిన్‌బో’ కానో క్రిస్టేల్స్ అద్భుత గాథ! ప్రకృతి ఒడిలో దాగున్న వింతలు, విశేషాలు ఎప్పుడూ మానవాళిని మంత్రముగ్ధులను చేస్తూనే ఉంటాయి. మన భూగోళంపై నీలిరంగులో నిర్మలంగా పారే నదులు, అద్దంలా మెరిసే...

అగ్గి పెట్టెతోటే హాజరీ!?|ADUGU TRENDS

పాఠం సెప్పుడంటే పుస్తకం సూసి సదువుడు కాదు. గండ్లున్నదాన్నే వళ్లె యేసుడు కాదు. బెత్తెం పట్టుకుని, బట్టీ పట్టిచ్చుడు అసలే కాదు. గా పిల్లల మెదల్లకు మేతేసుడు. పదను పెట్టుడు. కొత్తగ ఆచరించుడు,...

పార్టీలకు, ప్రభుత్వాలకు ‘నీట్’ గా ఓ హెచ్చరిక!|EDITORIAL

సామాన్య పౌరులు ప్రారంభించిన చిన్న ఉద్యమాలకు దేశవ్యాప్త ఆదరణ లభించడం రాజకీయ పార్టీలకు ఒక గట్టి హెచ్చరిక. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సంప్రదాయ నాయకత్వంపై మాత్రమే ఆధారపడటం లేదు. కొత్త...

జూలై 28, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి చతుర్దశి సాయంత్రం 05.30 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం పూర్వాషాఢ మధ్యాహ్నం 01.31 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం విష్కంబ రాత్రి 12.49 వరకు ఉపరి ప్రీతి కరణం వణజి సాయంత్రం 05.30 వరకు ఉపరి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News