Thursday, September 17, 2026
25.5 C
Hyderabad

తెలంగాణలో చారిత్రాత్మక సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే 2024

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల గణన (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే 2024) దేశంలోనే చారిత్రాత్మక నిర్ణయంగా నిలిచింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభ వేదికగా ఈ సర్వే ఫలితాలను ప్రకటిస్తూ, దీన్ని సమాజ అభివృద్ధికి దిక్సూచి లాంటి మోడల్ డాక్యుమెంట్ గా అభివర్ణించారు. గత ఏడు దశాబ్దాలుగా బలహీన వర్గాలు, మైనారిటీలు ఎదురుచూస్తున్న డేటాను ప్రభుత్వ పరంగా ఖచ్చితంగా అందించేందుకు చేపట్టిన ఈ సర్వే ఏడాది కాలంలో విజయవంతంగా పూర్తయిందని ఆయన తెలిపారు. ఈ నివేదికను మంత్రిమండలి ఆమోదించిందని, రాష్ట్రంలో అమలు చేయబోయే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఉపాధి, రాజకీయ అవకాశాలకు ప్రాతిపదికగా ఉపయోగిస్తామని ప్రకటించారు.

ఈ సర్వే ద్వారా 46.25 శాతం బీసీలు, మైనారిటీల్లోని బీసీలు కలిపితే 56.33 శాతం బీసీలు ఉన్నట్లు వెల్లడైంది. ప్రభుత్వం వీరందరికీ సముచిత గౌరవం, అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించిందని సీఎం తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే బలహీన వర్గాల జనాభా గణాంకాలపై చర్యలు చేపట్టామని, ఈ నివేదికకు చట్టబద్ధత కల్పించేందుకు మంత్రిమండలి ఉపసంఘం ఆమోదం తెలిపిందని వివరించారు. సర్వే పూర్తయిన తర్వాత, వెనుకబడిన తరగతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీల అభివృద్ధికి అవసరమైన సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన, ఉపాధి మరియు రాజకీయ అవకాశాల కోసం ప్రణాళిక రూపొందించి అమలు చేయాలన్న లక్ష్యంతో ఈ సర్వే చేపట్టామని స్పష్టం చేశారు.

ఈ సర్వే 2024 నవంబర్ 6న గవర్నర్ గారి సమక్షంలో ప్రారంభమై, డిసెంబర్ 25న పూర్తయింది. 50 రోజుల్లో 1,12,15,137 కుటుంబాలను (96.09 శాతం) నమోదు చేశామని వెల్లడించారు. ఫలితాల ప్రకారం, ఎస్సీలు 17.43 శాతం (61,84,319), ఎస్టీలు 10.45 శాతం (37,05,929), బీసీలు 46.25 శాతం (1,64,09,179), ముస్లిం మైనారిటీల్లో బీసీలు 10.08 శాతం (35,76,588) ఉన్నారని తెలిపారు. ముస్లిం మైనారిటీ బీసీలను కలుపుకుంటే మొత్తం బీసీల సంఖ్య 56.33 శాతంగా ఉన్నట్లు వెల్లడైంది. మైనారిటీ జనాభా 12.56 శాతం (44,57,012) ఉండగా, ముస్లిం మైనారిటీల్లో ఓసీలు 2.4 శాతం (80,424), హిందూ ఓసీలు 13.31 శాతం ఉన్నట్లు వెల్లడైంది. ముస్లిం మైనారిటీల్లోని ఓసీలను కలుపుకుంటే మొత్తం ఓసీల జనాభా 15.79 శాతం గా ఉందని తెలిపారు.

ఈ సర్వే డేటా ఆధారంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, ఇతర బలహీన వర్గాల సంక్షేమానికి అవసరమైన విధానాలను రూపొందించేందుకు ప్రభుత్వం ఉపయోగించనుందని ముఖ్యమంత్రి తెలిపారు. గత 75 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం చేపట్టని ఈ చర్యను తెలంగాణ ప్రభుత్వం పూర్తి చేసి దేశానికే ఆదర్శంగా నిలిచిందని వ్యాఖ్యానించారు. 2023 డిసెంబర్ 7న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 4 ఫిబ్రవరి 2024న మంత్రిమండలి ఆమోదం పొంది, 6 ఫిబ్రవరి 2024న శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టామని వెల్లడించారు. ఇతర రాష్ట్రాల్లో జరిగిన ప్రయత్నాలు న్యాయపరంగా నిలవకపోవడంతో, తెలంగాణ ప్రభుత్వం సర్వే పకడ్బందీగా ఉండేలా చర్యలు తీసుకున్నామని వివరించారు.

ఈ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే 2024 తెలంగాణకు కొత్త దశను అందించనుందని, ప్రభుత్వం సమాన అభివృద్ధికి నిబద్ధతతో పనిచేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.

Latest News

టెడ్డీ బేర్‌ కు గా పేరు ఎట్లొచ్చిందో తెలుసా!?|ADUGU TRENDS

సిన్న సిన్న సన్న పోరగాండ్లు, లవ్వు, గివ్వు అని తిరిగేటోల్లు, పెద్దోళ్ళు కూడా ఎందుకో గానీ గా ఎలుగుబంటి లెక్కుండే టెడ్డీ బేర్‌ బొమ్మను మస్త్ ఇష్టపడుతుంటరు. పొల్లగాండ్లకు కూడా గా బొమ్మల్ని...

యుద్ధాల్లో ప్రపంచం.. శాంతికి చొరవే మార్గం!|EDITORIAL

యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతటా కనిపిస్తుంది. ప్రాణనష్టం, ఆస్తి విధ్వంసంతో పాటు ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, ఆకలి, నిరాశ్రయత వంటి సమస్యలు తీవ్రమవుతాయి. శాంతియుత ప్రపంచమే మానవాళి అభివృద్ధికి...

సెప్టెంబర్ 17, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు షష్ఠి ఉదయం 09.53 వరకు ఉపరి సప్తమి నక్షత్రం అనురాధ రాత్రి 08.11 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం విష్కంబ పగలు 02.23 వరకు ఉపరి ప్రీతి కరణం తైతుల ఉదయం 09.53...

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

మోదీ 25ఏళ్ళ ప్రస్థానం బీజేపీ ప్రచార వ్యూహం!?|EDITORIAL

మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ రూపొందించిన కార్యాచరణలో ప్రజల వద్దకు వెళ్లడం మాత్రమేనా? లేక ప్రజల మాట వినడం కూడా జరుగుతుందా? రాబోయే ఎన్నికల రాజకీయాల్లో ఈ తేడానే...

సెప్టెంబర్ 16, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పంచమి ఉదయం 08.28 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం విశాఖ రాత్రి 06.02 వరకు ఉపరి అనురాధ యోగం వైధృతి పగలు 02.11 వరకు ఉపరి విస్కమ్బ కరణం బాలవ ఉదయం 08.28...

సెప్టెంబర్ 15, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు చవితి ఉదయం 06.59 వరకు ఉపరి పంచమి నక్షత్రం స్వాతి సాయంత్రం 04.18 వరకు ఉపరి విశాఖ యోగం ఐంద్ర పగలు 02.21 వరకు ఉపరి వైధృతి కరణం భద్ర ఉదయం 06.59...

సెప్టెంబర్ 14, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం వినాయక చవితి https://www.instagram.com/reel/DdPKUAqysmC/?stkn=Nmxzdnc3NDB4ejNn తిధి శు తదియ ఉదయం 07.00 వరకు ఉపరి చవితి నక్షత్రం చిత్త పగలు 03.05 వరకు ఉపరి స్వాతి యోగం బ్రహ్మ పగలు 02.54 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం...

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

గుప్తుల సమాజం|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL|HISTORY

గుప్తుల సామ్రాజ్యం అనేక రాష్ట్రాలుగా విభజించబడింది. ఈ రాష్ట్రాలను భుక్తులు అని పిలిచేవారు. ఒక భుక్తి యొక్క ముఖ్య అధికారిని ఉపారిక అన్నారు. ఈ భుక్తులను విషయాలుగా (జిల్లాలుగా) విభజించారు. ఒక విషయం...

గీ ఊర్లల్ల యేడ సూసినా, యేడి నీల్లే!?|ADUGU TRENDS

గా ఊర్లల్ల భూమి కింద మంట పెట్టినట్లు... అదే పనిగ కట్టెలెగేస్తున్నట్లు... కరెంటుతో గీజరేసినట్లు... యేడి నీల్లు ఉబికి వత్తయి.! ఒకేళ వాన పడ్డా సరే, పెనం మీద నీల్లు పోసినట్లు భూమి...

ప్రపంచానికి బ్రిక్స్ సరికొత్త దశాదిశ!?|EDITORIAL

ఢిల్లీ సదస్సు బ్రిక్స్ కు కొత్త దిశను సూచిస్తోంది. ప్రపంచ పాలనలో సంస్కరణలు, గ్లోబల్ సౌత్‌కు గొంతుక, ఆర్థిక సంస్థల్లో సమాన ప్రాతినిధ్యం వంటి లక్ష్యాలు స్వాగతించదగినవే. అయితే, తీర్మానాల అమలే అసలు...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News