కరీంనగర్ జిల్లా కేంద్రం జరుగుతున్న రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడల్లో వరంగల్ పోలీస్ కమిషనరేట్ చెందిన ఏసీపీలు మధుసూదన్ అనంతయ్య, జితేందర్ రెడ్డి రాణించారు. ఈ క్రీడల్లో బ్యాడ్మింటన్ క్రీడలో 55 వయస్సు విభాగం డబుల్స్ లో జితేందర్ రెడ్డి – మధుసూదన్ జోడి బంగారు పతకాన్ని గెలుచుకోగా, బ్యాడ్మింటన్ 50 వయస్సు డబుల్స్ విభాగంలో జితేందర్ రెడ్డి – అనంతయ్య జోడి రజిత పతకాన్ని గెలుచుకోగా, టేబుల్ టెన్నిస్ క్రీడా పోటీల్లో ఏసీపీ లు మధుసూదన్ – అనంతయ్య జోడీ కాంస్య పతకాన్ని గెలుచుకోగా, బ్రాండ్ పెన్ బ్యాడ్మింటన్ లో జితేందర్ రెడ్డి కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.ఈ సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తో పాటు జట్టు మేనేజర్ నాగయ్య ఏసిపిలకు కు అభినందనలు తెలియజేశారు..

