Thursday, October 8, 2026
25.5 C
Hyderabad

కొండా వర్సెస్ కాంగ్రెస్!?|KONDA SUREKHA|CONGRESS

సీఎం రేవంత్ పై కినుక|CM|REVANTHREDDY
కడియంపై సీఎం కు లేఖ|KADIYAM SRIHARI
అధిష్ఠానానికి ఫిర్యాదు?|AICC
గతంలోనూ అవమానాలే
క్రమశిక్షణా సంఘంతో విచారణకు డిమాండ్|DISIPLINERY COMMITTEE

హైదరాబాద్, జూలై 7 (అడుగు న్యూస్): తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతర్గత విభేదాలు మరోసారిగా భగ్గుమన్నాయి. రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. తాను నిర్వహిస్తున్న దేవాదాయ శాఖ అధికారులతో స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రత్యేకంగా సమావేశమవడంతో పాత సమస్యలు కూడా తెరమీదకు వచ్చాయి. గతంలోనూ తనకు అవమానాలే జరిగాయంటూ, తాజా సమస్యపై విచారణ జరపాలని సీఎం కు లేఖ రాసిన సురేఖ, అధిష్ఠానానికి కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ మేరకు లేఖ రాయనున్నట్లు విశ్వసనీయ సమాచారం.

కొండా కుటుంబానికి అధికారంతోపాటు వివాదాలు కొత్త కాదు. అయితే, అవి ఎప్పటికీ సమసిపోకుండా పోతున్నాయి. కొత్తగా తలెత్తుతుండటమే విచిత్రం. విధి వైపరీత్యం. స్వయం క్రుతాపారాధం. గతంలో అవినీతి ఆరోపణల కారణంగా మంత్రి కొండా సురేఖకు అత్యంత నమ్మకస్తుడైన ఓఎస్‌డీ సుమంత్ ను సీఎంఓ తొలగించింది. సురేఖకు కనీస సమాచారం కూడా ఇవ్వలేదు. ఈ ఏకపక్ష నిర్ణయం అప్పట్లో సంచలనంగా మారింది.

నిన్న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన పాలక మండలి నియామక వ్యవహారం మంత్రిని తీవ్ర మనస్థాపానికి గురిచేసినట్లు తెలిసింది. దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చే యాదాద్రి టెంపుల్ బోర్డు చైర్మన్‌తో సభ్యుల నియామకం విషయం కూడా మంత్రికి తెలియదట. నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే పేర్లు ఖరారై జీవో విడుదలైందట. తన సిఫార్సులకు కనీస విలువ ఇవ్వకపోవడంతో నొచ్చుకున్న కొండా సురేఖ, నిరసనగా ఇటీవల డిజిటల్ గా జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశానికే హాజరుకాకుండా డుమ్మా కొట్టారు. “కొండా సురేఖకు తెలియకుండానే కొణిదెల సురేఖ నియామకం” అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు రావడం ఆమెను మరింత మనోవేదనకు గురిచేసినట్లు తెలిసింది.

యాదాద్రి వివాదం చల్లారకముందే స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యవహారశైలి కొండా సురేఖకు మరింత ఆగ్రహం తెప్పించింది. దేవాదాయ శాఖ మంత్రికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, కడియం శ్రీహరి హైదరాబాద్‌లో దేవాదాయ శాఖ డైరెక్టర్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. దేవాలయాల అభివృద్ధి, నిధుల కేటాయింపులు, భూముల పరిరక్షణపై ఆయన అధికారులకు గడువులు నిర్దేశించడంపై మంత్రి సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఘాటుగానే ఫిర్యాదు చేశారు.

కడియం శ్రీహరి ప్రభుత్వ పరిపాలనా విధానాలను, ‘రూల్స్ ఆఫ్ బిజినెస్’ స్ఫూర్తిని ఉల్లంఘించారని మంత్రి మండిపడ్డారు. ప్రజా జీవితంలో ఇంత అనుభవం ఉన్న నాయకుడు, శాఖా మంత్రిని పూర్తిగా పక్కనపెట్టి సమీక్షలు నిర్వహించడం అనుచిత సంప్రదాయమని, ఇది అధికార యంత్రాంగంలో అయోమయానికి దారితీస్తుందని సీఎంకు రాసిన లేఖలో స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి, పార్టీ క్రమశిక్షణా కమిటీ ద్వారా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

శాఖాపరమైన ఇబ్బందులతో పాటు, తన సొంత ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లోనూ కొండా సురేఖకు తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవిని తన కుమార్తె కొండా సుస్మితా పటేల్‌కు ఇప్పించుకోవాలని ఆమె ప్రయత్నించినప్పటికీ, స్థానిక సీనియర్ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. పరకాల, వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో కొండా దంపతుల ఆధిపత్యానికి నిరసనగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంతర్గతంగా గ్రూపులు కట్టడం ఆమెను ఒంటరిని చేసింది. దీనికి విరుద్ధంగా అమె వ్యవహారశైలి, వ్యాఖ్యలు దుమారాన్నే రేపాయి. అధిష్ఠానం జోక్యం చేసుకునేదాకా వెళ్లింది. ఏదో విధంగా సద్దుమణిగింది.

ఈ మొత్తం పరిణామాలపై రాజకీయ వర్గాల్లో భిన్నమైన చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మంత్రిగా ఉన్న కొండా సురేఖకు అటు ప్రభుత్వంలో ఇటు పార్టీలో వ్యతిరేకతలు రావడం, నిర్లక్ష్యానికి గురవుతుండటాన్ని తన పట్ల వివక్షగా మంత్రి సురేఖ భావిస్తున్నారు.

అందుకే ఆమె ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుని తేల్చుకోవాలనుకుంటున్నారు. ఒకవైపు సీఎంకు లేఖ రాస్తూనే, అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో కొండా సురేఖ అధిష్టానానికి రాయనున్న లేఖ కాంగ్రెస్ ప్రభుత్వం, పార్టీలో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి.

Latest News

నానా పటేకర్ ఇక లేరు|NANA PATEKAR|FILM ACTOR

ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు నానా పటేకర్ (75) గురువారం ఉదయం కన్నుమూశారు. గోవాలోని తన నివాసంలో అపస్మారక స్థితిలో కనిపించిన ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే సమీపంలోని దవాఖానకి తరలించారు. అయితే...

మూగ జీవాలకో ఫుడ్ కోర్టు!?|ADUGU TRENDS

మూగ జీవాలను మనుసులతో సమానంగ సూత్తం. మంచి మంచి దేవుల్ల పేర్లు పెట్టి పిలుస్తం. గయి మనతో సమానంగ కలిసే జీవిత్తయి. కనీ, గీ మద్దెల గవాటిని పట్టించుకునుడే మానేసినం. గయ్యేమో ఆహారం...

నమో పాతికేళ్ళ అసాధారణ ప్రస్థానం!?|EDITORIAL

నమో పాతికేళ్ల అనుభవం నిజంగానే ఒక గొప్ప ఆస్తి. కానీ ప్రజాస్వామ్యంలో ఆ ఆస్తికి అసలైన యజమానులు ప్రజలే. కాబట్టి ఈ అనుభవానికి తుది కొలమానం అధికారంలో గడిపిన సంవత్సరాల సంఖ్య కాదు....

అక్టోబర్ 08, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం తిధి త్రయోదశి రాత్రి 09.40 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం పుబ్బ రాత్రి 09.50 వరకు ఉపరి ఉత్తర యోగం శుక్ల రాత్రి 02.25 వరకు ఉపరి బ్రహ్మ కరణం గరజి ఉదయం 10.23 వరకు ఉపరి...

‘అన్న’మో రామచంద్రా!?|RICE|FARMER|RICE MILL|STATE|CENTRAL|GOVERNMENT

బియ్యమా? ధరలు పెరుగుతున్న దయ్యమా? ధాన్యం ఉత్పత్తిలో టాప్..ధరల నియంత్రణలో ఫ్లాప్ రైతుకు గిట్టుబాటు-సామాన్యుడికి అందుబాటేది? మిల్లర్ల మాయా? పరిపాలనా వైఫల్యమా? రాష్ట్రమే కాదు, దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి! ధరల పెరుగుదలకు దరిద్రపు కారణాలెన్నో? అన్నపూర్ణ రాష్ట్రంలో ప్రజలు ‘అన్న’మో...

తాటిశెట్టుకు ఇనుప మెట్లు!?|ADUGU TRENDS

తాటి కల్లు మత్తుగున్నది.. నీ బాంచెన్ తాగుతుంటే ఎక్కుతున్నది. అనుకుంటనే గీ కల్లును మస్తుగ తాగుతుంటరు. తెలంగాణలనైతే ఊర్లల్ల ఆడోల్లు కూడా గీ కల్లు తాగుతరు. కనీ, గీ కల్లు గీసుడే మస్తు...

‘సర్’ సర్వేపై సర్వత్రా నిరసనలు.. భరోసా ఏది!|EDITORIAL

‘సర్’పై నెలకొన్న వివాదాన్ని విస్తృత ప్రజాస్వామ్య విశ్వాస సంక్షోభంలో భాగంగా చూడాలి. ఎన్నికల సంఘం నిష్పక్షపాతత్వంపై సందేహాలు రాకుండా ప్రతి అభ్యంతరానికీ పారదర్శకంగా సమాధానం చెప్పాలి. అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా...

అక్టోబర్ 07, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం తిధి ద్వాదశి రాత్రి 11.02 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం మఖ రాత్రి 10.32 వరకు ఉపరి పుబ్బ యోగం సాధ్య ఉదయం 07.05 వరకు ఉపరి శుక్ల కరణం కౌలవ ఉదయం 11.55 వరకు ఉపరి...

గాడ దుర్గమ్మకు శేపల కూరే నైవేద్యం!?|ADUGU TRENDS

దేవీ శరన్నవరాత్రోత్సవాలు గదేనుల్లా.. దుర్గా నవరాత్రులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పవిత్రమైన పండుగ. తొమ్మిది రోజులు జగన్మాత అయిన గా దుర్గాదేవిని రకరకాల రూపాలల్ల అర్చిస్తూ, పదో రోజున అంటే విజయదశమి దసరా...

భయపడటం కాదు, అప్రమత్తంగా ఉండాలి!?|EDITORIAL

సైబీరియా ఘటన మనకు నేర్పే పాఠం భయపడటం కాదు. అప్రమత్తంగా ఉండటం. అధికారిక నిర్ధారణకు ముందే రూమర్లను ప్లేగ్ మహమ్మారి వార్తలుగా మార్చడం ప్రజల్లో అనవసర భయాన్ని పెంచుతుంది. అదే సమయంలో ల్యాబొరేటరీ...

అక్టోబర్ 06, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం తిధి ఏకాదశి రాత్రి 12.45 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ఆశ్లేష రాత్రి 11.36 వరకు ఉపరి మఖ యోగం సిద్ద ఉదయం 09.47 వరకు ఉపరి సాధ్య కరణం బవ పగలు 01.47 వరకు ఉపరి...

అక్టోబర్ 05, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం తిధి దశమి రాత్రి 02.47 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం పుష్యమి రాత్రి 12.51 వరకు ఉపరి ఆశ్లేష యోగం శివ పగలు 12.50 వరకు ఉపరి సిద్ద కరణం వణజి పగలు 03.55 వరకు ఉపరి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News