హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకుంది. సమస్యలను పరిష్కరించేందుకు ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించేందుకు హైడ్రా గ్రీవెన్స్‌ను ఏర్పాటు చేసింది. జనవరి 6 నుంచి హైడ్రా కమిషనర్ రంగనాథ్ బుద్ధభవన్‌లో గ్రీవెన్స్ నిర్వహించి, ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఫిర్యాదులను స్వీకరిస్తారు. దీనిలో చెరువులు, కుంటలు, నాలాల ఆక్రమణలపై హైడ్రా ప్రత్యేక దృష్టి సారించింది.
ఈ సంక్రాంతికి హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. DSP స్థాయి అధికారితో పాటు పూర్తి సిబ్బందితో పనిచేయనున్న ఈ స్టేషన్ ద్వారా ఆక్రమణలపై వచ్చే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించనున్నారు. హైడ్రా ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పటి వరకు 5,000కి పైగా ఫిర్యాదులు వచ్చాయి. ఎక్కువగా నగర శివార్ల మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల నుంచి వచ్చినవే.
హైడ్రా పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ఖాజాగూడ, మల్కాజ్‌గిరిలో ఆక్రమణలను తొలగించడంతో ప్రజల్లో విశ్వాసం పెరిగింది. ఇకపై హైడ్రా ద్వారా ఫిర్యాదుదారులు తమ సమస్యలకు సత్వర పరిష్కారం పొందే అవకాశముంది.

