Thursday, September 17, 2026
30.5 C
Hyderabad

ప్రొఫెసర్ వ్యాఖ్యలు-పోస్టు మార్టం|JANASENA|PROF.NAGESHWAR|PSPK

స్థానిక బీజేపీ నాయకత్వం నుంచి కాని పనిని జాతీయ పార్టీ నెత్తికెత్తుకుందా? అందుకే జన సేనాని పవన్ ని తెలంగాణపైకి ఉసి గొల్పిందా? ఈ స్కెచ్ లో భాగంగానే జగన్ ను అరెస్ట్ చేయాలనే ఈ లీక్ ఇచ్చిందే బీజేపా? నాగేశ్వర్ కు లీకు ద్వారా జనంలో ఆయనకున్న ఉన్న క్రెడిట్ ని కొట్టేసిందా? తెలంగాణ వాదులు, ఆంధ్రా నేతలు, బీజేపీ ట్రాప్ లో పడ్డారా? తెలంగాణ-ఆంధ్రా సెంటిమెంట్ ని రెచ్చగొట్టే ఎజెండా ఎన్డీఏకు ఏమైనా ఉందా? ఈ వ్యాఖ్యల వల్ల ఎవరికి ఒనగూరిందెంత? అటు తెలంగాణ, ఆంధ్రా ప్రజలకు అసలు సంబంధముందా? వారికి పాత్ర ఉందా? ప్రజల్లో చర్చ ఉందా? ఉంటే ఏ మేరకు? ఈ వ్యవహారం పర్యవసానం ఏంటి?

అడుగు చీఫ్ ఎడిటర్ డాక్టర్ మార్గం ప్రత్యేక విశ్లేషణ

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని కోరుతూ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసినట్లుగా ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు వారం పది రోజులుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో మాటల మంటలకు కారణమయ్యాయి. తన వ్యాఖ్యలను భేషరతుగా ఉప సంహరించకున్నట్లుగా ప్రొఫెసర్ నాగేశ్వర్ ప్రకటించినప్పటికీ, సీన్ లోంచి తప్పుకున్నప్పటికీ, మాటల యుద్ధం సమసిపోకపోగా, రెట్టింపవుతున్నది. తెలంగాణ వాదులు వర్సెస్ జన సైనికులు, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి వర్సెస్ పవన్ కళ్యాణ్ లుగా మారింది. పరిస్థితి రోజు రోజుకు వేడెక్కుంతోంది.

అసలు ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆ వ్యాఖ్యలు ఎందుకు చేశారు? చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలా వ్యాఖ్యలకు తెలంగాణకున్న సంబంధం ఏంటి?

ఏమిటీ ట్విస్టులు?
ఈ వ్యాఖ్యల నేపథ్యంలో జనసేన శ్రేణులు నాగేశ్వర్ పై తెలంగాణ వాదులు జనసేనపై కల్పించుకుని మరీ విరుచుకుపడ్డారు. పనిలో పనిగా పవన్ కళ్యాణ్ కబ్జా చేసినట్లుగా ఆరోపిస్తూ, కొందరు మీడియా వాళ్ళతో కలిసి కొందరు తెలంగాణ వాదులు కోడి చెరువుకు నిజనిర్ధారణకు వెళ్ళారు. ఆ వెంటే పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టారు. తెలంగాణ వాదుల మీద జన సైనికుల ప్రెస్ మీట్ పెట్టారు. అడిగిన వెంటనే గద్దర్ కు కారు కొనిచ్చానని, పవన్ నోరు జారారు? దాని మీద గద్దర్ కుమార్తె వెన్నెల ప్రెస్ మీట్ పెట్టి మరీ ఖండించారు. తెలంగాణ మీ అయ్య జాగీరా? అంటే మీ అయ్య జాగీరా? అనే దాకా పరిస్థితి వెళ్ళింది. పరస్పర వ్యాఖ్యలు ప్రాంతీయ భావోద్వేగాలను రెచ్చగొట్టేలా మారాయి. రాజకీయ చర్చలు వ్యక్తిగత విమర్శలు, ఆత్మగౌరవం, చారిత్రక వాదనలు కలగలిసి రచ్చలా మారిపోయాయి.

మరోవైపు జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున తెలంగాణలో జనసేన సభ తలపెట్టడం, పర్మీషన్ ఇవ్వకపోవడం కూడా వివాదాస్పదమైంది. ఈ వివాదంపై తర్వాత పవన్, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావులు జోక్యం చేసుకుంటూనే ఉన్నారు.

అసలు ఎందుకీ వాదోపవాదాలు?
వ్యాఖ్యల ఉప సంహరణతో సమసిపోవాల్సిన ఈ సమస్య, ఆయన సీన్ నుంచి తప్పుకున్నాక కూడా ఆయన ఊసే లేకుండా సీన్మా ఎందుకు నడుస్తోంది? తెలంగాణతో సంబంధం లేకుండానే తెలంగాణ వాదులు, వారం రోజులుగా వదలకుండా వాదులాడుకోవడానికి కారణాలేంటి? ఏం ఆశించి ఇరు వర్గాలు ఘర్షణ పడుతున్నాయి?

బీజేపీ వ్యూహమా? రాజకీయ పరిణామమా?
ఈ మొత్తం వ్యవహారం బీజేపీ వ్యూహమా? యాదృచ్ఛికమా? రాజకీయ పరిణామమా? బీజేపీ ఉచ్చులో జనసేన భాగమైతే, తెలంగాణ వాదులు పావులయ్యారా? తెలంగాణలో బీజేపీ నాయకత్వం వైఫల్యాలను అదిగమించడానికి పవన్ కళ్యాణ్ వంటి ప్రముఖ నేతను తెలంగాణ రాజకీయ చర్చల్లోకి తీసుకువచ్చే ప్రయత్నం బీజేపీ జాతీయ పార్టీ చేసిందా?

షా-పవన్ ల మధ్య ఏం జరిగింది?
సరే, షా-పవన్ ల మధ్య అసలు చర్చ జరిగిందా? లేదా? జరిగితే, అంత ‘కాన్ఫిడెన్షయిల్ మీటింగ్ సమాచారం’ కేంద్ర హోం మంత్రి పేషీ నుంచి ఎలా లీక్ అయింది? అసలు లీక్ అయ్యే అవకాశం ఉంటుందా? కావాలని చేస్తే తప్ప! మరైతే నాగేశ్వర్ కి ఎలా ఆ సమాచారం అంది ఉంటుంది? అంత కీలక సమాచారాన్ని వివేచన, విచక్షణ కలిగిన ప్రొఫెసర్-జర్నలిస్టు ఎలా లీక్ చేస్తారు? కచ్చితంగా ఈ వ్యవహారంలో లీకు వీరులుండాలి? మరైతే ఆ లీకు వీరులను హోం మంత్రి, మంత్రిత్వశాఖ, ఏపీ ప్రబుత్వం, ఏపీ డిప్యూటీ సీఎం కూడా అయిన పవన్ కళ్యాణ్ ఇప్పటిదాకా ఎందుకు పట్టించుకోలేదు? ఎందుకు కనీసం ఖండించడంలేదు?

వారే చెప్పాలి!
జగన్ ను అరెస్టు చేయాలని పవన్ అమిత్ షాని కోరారో లేదో వారిద్దరే చెప్పగలరు. షా మౌనంగా ఉంటే, పవన్ మాత్రం ఆ ఊసే లేకుండా తెలంగాణ ఎవరి అయ్య జాగీరు? అంటూ ప్రశ్నిస్తున్నారు. బరాబర్ తెలంగాణల మీటింగులు పెడ్తం. జీహెచ్ఎంసీలో, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తం. అని తమ అసలు లక్ష్యాన్ని ప్రకటిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బెంగాల్ తరహాలో బీజేపీ టార్గెట్ తెలంగాణే అంటూ దీన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సమర్ధిస్తున్నారు. పైగా దేశంలో ఎవరు ఎక్కడనుంచైనా ప్రచారం చేసుకోవచ్చని ఏపీ సీఎం సైతం అన్యాపదేశంగా పవన్ వ్యాఖ్యలకు ఉద్దీపన గావించారు.

విషయం తేలిపోయింది!?
కాబట్టి అసలు విషయం తేలిపోయింది. వరుస ఘటనలు, నేపథ్యం తేట తెల్లమైంది. ఇదంతా బీజేపీ వ్యూహమేనని, జన సేనాని భాగమేనని, ప్రొఫెసర్ పాత్రధారని!? అనవసరంగా తెలంగాణ వాదులు పావులయ్యారనే అనుమానాలు అనివార్యంగా మరింత బలంగా బలపడుతున్నాయి.

కావాలనే లీకా!?
వామపక్షవాది, మేధావి ప్రొఫెసర్ నాగేశ్వర్ ద్వారా బీజేపీ కావాలనే ఆ వ్యాఖ్యలు చేయించిందా!? ప్రొఫెసర్ లీక్ చేసేంత ‘వీక్’ కాదని మనందరికీ తెలుసు. అన్యాపదేశంగానో లేక కాన్ఫిడెన్షియల్ గానో ఆయన చెవిలో వేసిందా? ఆయన కూడా పొరపాటున సెన్సేషన్ జర్నలిజం ఉచ్చులో పడ్డారా? ఆ వ్యాఖ్యలలో నిజమున్నా, లేకపోయినా, ఆ వ్యవహారాన్ని కేంద్రం, ఏపీ చూసుకుంటుంది. తెలంగాణ వాదులకేం పని? నాగేశ్వర్ ని జన సేనలు తూలనాడాయి కాబట్టి జోక్యం చేసుకున్నాయనే భావించాలి. కానీ, అది లాగి లాగా బీజేపీ లక్ష్యం నెర‘వేరేలా’ మారిపోయింది.

మొత్తానికి తెలంగాణలో పవన్ కళ్యాణ్ ని రాజకీయంగా ‘బలం’గా, రాజకీయ పరిభాషలో ‘గ్రాండ్’ గా ప్రవేశపెట్టగలిగింది. బహుషా సభకు పర్మీషన్ కోరడం కూడా ఇందులో భాగమేనని భావించాలేమో!?

తెలంగాణా వాదులంతా పావులేనా?
తెలంగాణ వాదులు, తెలంగాణ జనసైనికులు బీజేపీ-జన సేనాని ఆటలో పావులయ్యారా? ఈ వ్యవహారంలో తమ అస్తిత్వాన్ని కాపాడుకున్నామని తెలంగాణ వాదులు భావిస్తుండగా, జనసేన కార్యకర్తలు తమ నాయకుడి గౌరవాన్ని రక్షిస్తున్నామని నమ్ముతున్నారు. తెలంగాణ ఏర్పాటునే వ్యతిరేకించిన పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఏ ముఖం పెట్టుకుని అడుగు పెడతారు? తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాకే రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మరోవైపు తెలంగాణ ఏర్పాటప్పుడు అన్నమే తినని పవన్ మా తెలంగాణ కొస్తే బిర్యానీ పెడతామని, సెక్రటేరియట్ లో అడుగు పెడతామంటే ఆలోచిస్తామని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అంతకుముందు పవన్ తాను తెలంగాణను ఏర్పాటును వ్యతిరేకించలేదని, ఏర్పాటు విధానాన్ని మాత్రమే వ్యతిరేకించానని వివరణ ఇచ్చారు. పార్లమెంట్ లో బిల్లులు ఎలా పాస్ అవుతాయో పాపం పవన్ కు తెలియకపోవచ్చని మరెవరో వాపోయారు.

గోల్ గోల్ గా ‘గోల’వుతున్నారు
ఈ అంశాలెలా ఉన్నా, తెలంగాణను ఎవరైనా వ్యతిరేకిస్తే, వ్యాఖ్యానిస్తే వెంటాడాలి. వేటాడాలన్న గుడ్డిగా తెలంగాణ వాదులు, తెలంగాణ సెంటిమెంట్ ను ఇంకా తమకనుకూలంగా మలచుకోవాలనే భ్రమల్లో, దూరాలోచనల్లో రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఉనికి కోసం కొందరు, పేరు కోసం మరికొందరు సెన్సేషన్ గా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు పరకాయ ప్రవేశం చేసి ఊదరగొడుతున్నారు. కానీ, నిజంగా జనం వీటిని పట్టించుకుంటున్నారా? నమ్ముతున్నారా? అన్న ‘కామన్ సెన్స్’ ను మిస్ అవుతున్నారు. ఏ అంశంపై ఏ మేరకు స్పందించాలన్న విచక్షణను కోల్పోతున్నారు. ఎలాగైనా ప్రజల్లో పడాలని గోల్ గోల్ గా గోలవుతున్నారు.

-డాక్టర్ మార్గం లక్ష్మీ నారాయణ

Latest News

టెడ్డీ బేర్‌ కు గా పేరు ఎట్లొచ్చిందో తెలుసా!?|ADUGU TRENDS

సిన్న సిన్న సన్న పోరగాండ్లు, లవ్వు, గివ్వు అని తిరిగేటోల్లు, పెద్దోళ్ళు కూడా ఎందుకో గానీ గా ఎలుగుబంటి లెక్కుండే టెడ్డీ బేర్‌ బొమ్మను మస్త్ ఇష్టపడుతుంటరు. పొల్లగాండ్లకు కూడా గా బొమ్మల్ని...

యుద్ధాల్లో ప్రపంచం.. శాంతికి చొరవే మార్గం!|EDITORIAL

యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతటా కనిపిస్తుంది. ప్రాణనష్టం, ఆస్తి విధ్వంసంతో పాటు ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, ఆకలి, నిరాశ్రయత వంటి సమస్యలు తీవ్రమవుతాయి. శాంతియుత ప్రపంచమే మానవాళి అభివృద్ధికి...

సెప్టెంబర్ 17, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు షష్ఠి ఉదయం 09.53 వరకు ఉపరి సప్తమి నక్షత్రం అనురాధ రాత్రి 08.11 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం విష్కంబ పగలు 02.23 వరకు ఉపరి ప్రీతి కరణం తైతుల ఉదయం 09.53...

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

మోదీ 25ఏళ్ళ ప్రస్థానం బీజేపీ ప్రచార వ్యూహం!?|EDITORIAL

మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ రూపొందించిన కార్యాచరణలో ప్రజల వద్దకు వెళ్లడం మాత్రమేనా? లేక ప్రజల మాట వినడం కూడా జరుగుతుందా? రాబోయే ఎన్నికల రాజకీయాల్లో ఈ తేడానే...

సెప్టెంబర్ 16, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పంచమి ఉదయం 08.28 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం విశాఖ రాత్రి 06.02 వరకు ఉపరి అనురాధ యోగం వైధృతి పగలు 02.11 వరకు ఉపరి విస్కమ్బ కరణం బాలవ ఉదయం 08.28...

సెప్టెంబర్ 15, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు చవితి ఉదయం 06.59 వరకు ఉపరి పంచమి నక్షత్రం స్వాతి సాయంత్రం 04.18 వరకు ఉపరి విశాఖ యోగం ఐంద్ర పగలు 02.21 వరకు ఉపరి వైధృతి కరణం భద్ర ఉదయం 06.59...

సెప్టెంబర్ 14, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం వినాయక చవితి https://www.instagram.com/reel/DdPKUAqysmC/?stkn=Nmxzdnc3NDB4ejNn తిధి శు తదియ ఉదయం 07.00 వరకు ఉపరి చవితి నక్షత్రం చిత్త పగలు 03.05 వరకు ఉపరి స్వాతి యోగం బ్రహ్మ పగలు 02.54 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం...

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

గుప్తుల సమాజం|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL|HISTORY

గుప్తుల సామ్రాజ్యం అనేక రాష్ట్రాలుగా విభజించబడింది. ఈ రాష్ట్రాలను భుక్తులు అని పిలిచేవారు. ఒక భుక్తి యొక్క ముఖ్య అధికారిని ఉపారిక అన్నారు. ఈ భుక్తులను విషయాలుగా (జిల్లాలుగా) విభజించారు. ఒక విషయం...

గీ ఊర్లల్ల యేడ సూసినా, యేడి నీల్లే!?|ADUGU TRENDS

గా ఊర్లల్ల భూమి కింద మంట పెట్టినట్లు... అదే పనిగ కట్టెలెగేస్తున్నట్లు... కరెంటుతో గీజరేసినట్లు... యేడి నీల్లు ఉబికి వత్తయి.! ఒకేళ వాన పడ్డా సరే, పెనం మీద నీల్లు పోసినట్లు భూమి...

ప్రపంచానికి బ్రిక్స్ సరికొత్త దశాదిశ!?|EDITORIAL

ఢిల్లీ సదస్సు బ్రిక్స్ కు కొత్త దిశను సూచిస్తోంది. ప్రపంచ పాలనలో సంస్కరణలు, గ్లోబల్ సౌత్‌కు గొంతుక, ఆర్థిక సంస్థల్లో సమాన ప్రాతినిధ్యం వంటి లక్ష్యాలు స్వాగతించదగినవే. అయితే, తీర్మానాల అమలే అసలు...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News