ఆధునిక భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు, సామాజిక సంస్కర్త సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా జూబ్లిహిల్స్‌లోని తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమె చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సావిత్రిబాయి పూలే త్యాగాల ద్వారా విద్యా హక్కులు, మహిళా సమానత్వం కోసం చేసిన కృషిని ముఖ్యమంత్రి ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆమె చూపిన మార్గదర్శక స్ఫూర్తిని అందరూ పాటించాలని పిలుపునిచ్చారు.


