
ఇల్లు కడితే ఏం శేత్తం? గోడలు కట్టినంక నీల్లు బాగా పడ్తం. కనీ, ఇటికెలకు నీల్లు పట్టినంకనే గోడలు కట్టాల్నట! గట్ల కడితే గా ఇటికెలు గట్టిపడి గోడలు నెర్రెలు బాయయట. గంతే కాదుల్లా.. గా గోడలు గట్టిగుండి వందేండ్లైనా కరాబు కావట. ఇటికెలు శుబ్రంగ అవుట్ల.. సిమిటి మాల్ కూడ తక్కువ పడ్తదట!! ఇగ ఇటికెల మద్దెల కిరాకులు కూడా రావట. గిట్ల శేస్తే వందేండ్ల ఇల్లు గింత గూడ ఇంకిన్ని ఎక్కువ ఏండ్లే ఉంటయట. ఇంకెందుకు ఆలెశెం? ఇగ ఎప్పుడు ఇల్లు కట్టినా, గా ఇటికెలకు ముందుగనే నీల్లు పట్టాలె. గటెంకనే గా గోడలు కట్టాలె. ఇన్నారుల్లా….

