పెద్ద వంగర మండలం, చిట్యాల గ్రామంలో కోట భిక్షం, ఎదురు సుధాకర్ లు, చిన్నవంగర గ్రామంలో యసరపు ఎల్లయ్య, యసరపు లక్ష్మి , పెద్ద వంగర మండల కేంద్రంలో ఎడవెల్లి సోమలక్ష్మి, ఉడుగుల సోమయ్య లు ఈ మధ్య కాలంలో మృతి చెందగా పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఈ రోజు వారి ఇంటికి వెళ్లి మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందచేశారు.
ఝాన్సీ రెడ్డి వెంట పరామర్శించిన వారిలో తొర్రూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ అనుమాండ్ల తిరుపతి రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ హామ్యా నాయక్, మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ముద్దసాని సురేష్, సీనియర్ నాయకులు గంజి విజయపాల్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు రంగు మురళి, శ్యామ్, గోపాల్, వేణు, సుధాకర్, నరేందర్ రెడ్డి, శ్రీను, వివిధ గ్రామ అధ్యక్షులు, యూత్ నాయకులు, తదితరులు ఉన్నారు.

