పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో కూడి వుండాలని స్థానిక ఎమ్మెల్యే యశస్విని రాజా రామ్మోహన్ రెడ్డి దంపతులు, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి డా. ఝాన్సీ రాజేందర్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య శ్రీ సత్యనారాయణ వ్రతం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ స్థాయి నాయకులు, తొర్రూరు మార్కెట్ చైర్మన్ హనుమాండ్ల తిరుపతిరెడ్డి, మామిడాల తిరుపతిరెడ్డి, రెండు బ్లాక్ ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆరు మండలాల పార్టీ అధ్యక్షులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


