డయల్ యువర్ డిఎం కార్యక్రమాన్ని ఈనెల 21న మంగళవారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు హనుమకొండ ఆర్టీసీ డిపో మేనేజర్ భూక్యా ధరంసింగ్ తెలిపారు. తమ డిపో పరిధిలోని జమ్మికుంట, వేలేరు, ఐనవోలు, పర్వతగిరి, సంగెం ,ఖిలావరంగల్, హనుమకొండ, హసన్ పర్తి, కమలాపూర్, వరంగల్ మండలాల ప్రజలకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణ సౌకర్యం కొరకు డయల్ యువర్ డిఎం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమానికి తమ పరిధిలోని మండలాల ప్రజలు తాము సూచించిన సమయంలో 9959226049కు ఫోన్ చేసి తమ విలువైన సూచనలను, సలహాలను అందించి మరింత సౌకర్యవంతమైన ప్రయాణంతోపాటు, డిపో అభివృద్ధికి సహకరించాలని డిఎం భూక్యా ధరంసింగ్ కోరారు.

