Sunday, August 9, 2026
25 C
Hyderabad

BRS|బీఆర్ఎస్ MLA|ఎమ్మెల్యే PADI KAUSHIK REDDY|పాడి కౌశిక్ రెడ్డి ARREST|అరెస్ట్..

GRANITE| గ్రానైట్ క్వారీ వ్యాపారిని బెదిరించాడని ఆరోపణ
పలు SECTIONS| సెక్షన్ల కింద CASE| కేసులు నమోదు
SHAMSHABAD| శంషాబాద్ AIRPORT| ఎయిర్ పోర్ట్ లో అదుపులోకి

తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ని శంషాబాద్ విమానాశ్రయంలో వరంగల్ సుబేదారీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను వరంగల్ కు తరలించారు. కమలాపూర్ మండలంలో గ్రానైట్ క్వారీ వ్యాపారిని బెదిరించి డబ్బులు డిమాండ్ చేశారనే ఆరోపణలపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌)లోని సెక్షన్‌ 308(2), 308(4), 352 కింద కేసులు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మనోజ్ రెడ్డి అనే వ్యక్తి కమలాపూర్ మండలంలోని వంగపల్లిలో గ్రానైట్ క్వారీ నిర్వహిస్తున్నారు. హుజూరాబాద్ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి తనను రూ.50 లక్షలు ఇవ్వాలని బెదిరించినట్లు మనోజ్ రెడ్డి భార్య ఉమాదేవీ సుబేదారీ పీఎస్‌లో చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే సుబేదారీ పోలీసులు శనివారం తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కేసును కొట్టేయాలని పేర్కొంటూ కౌశిక్‌రెడ్డి హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌ను జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ ధర్మాసనం కొట్టేసింది. తాజాగా అదే బెదిరింపు కేసులో కౌశిక్‌ రెడ్డి ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని వేసిన మరో పిటిషన్​ను సైతం హైకోర్టు నిరాకరించింది. కౌంటర్‌ దాఖలు చేయాలని పోలీసులకు నోటీసులు జారీచేస్తూ విచారణను ఈనెల 24కు వాయిదా వేసింది. దీంతో కౌశిక్ రెడ్డి గత రాత్రి శంషాబాద్ ఎయిర్​పోర్టు సమీపంలో ఉన్నాడని తెలుసుకున్న సుబేదారి పోలీసులు అరెస్ట్ చేసి ఠాణాకు తరలించారు. కాసేపట్లో ఎంజీఎం ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం, అతన్ని కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.ఎమ్మెల్యే పాడి కౌశిక్​ రెడ్డి కోర్డులో హాజరుపరిచేందుకు పోలీసులు చర్యలు చేపడుతున్నారు. కోర్టులో హాజరుపరిచేందుకు వైద్య పరీక్షల కోసం ఎంజీఎం ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా బీఆర్ఎస్​ లీగల్​ టీమ్​ వచ్చాక పరీక్షలకు తీసుకెళ్లాలని కౌశిక్​ కోరారు. బీఆర్​ఎస్​ లీగల్ టీమ్ చేరుకున్నాక వైద్య పరీక్షలకు తీసుకెళ్లనున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరుచనున్నారు. కౌశిక్​ను కలిసేందుకు మాజీ ఎమ్మెల్యే వినయ్​ భాస్కర్, బీఆర్​ఎస్​ నేత రాకేశ్​ రెడ్డి రాగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీఆర్​ఎస్​ నాయకులు ఆందోళన చేపట్టారు. కాసేపటి తర్వాత వారికి లోనికి అనుమతించారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టును ఆ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీమంత్రి హరీశ్‌రావులు ఎక్స్‌ వేదికగా తీవ్రంగా ఖండించారు. శంషాబాద్ విమానాశ్రయంలో కౌశిక్‌రెడ్డిని అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అని కేటీఆర్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి అక్రమాలు, మంత్రుల అవినీతి, దుర్మార్గాలను కౌశిక్‌రెడ్డి ప్రశ్నిస్తున్నందుకే ఆయనపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు.

పాలన గాలికొదిలేసి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడడమే కాంగ్రెస్ పనిగా పెట్టుకుందని హరీశ్‌ రావు తీవ్ర విమర్శలు చేశారు. రైతుల నుంచి ప్రజాప్రతినిధుల వరకూ అందర్నీ అక్రమ కేసులతో వేధిస్తూ రాక్షసానందం పొందుతున్నారని ఆక్షేపించారు. నమ్మించి నయవంచన చేసిన మోసపూరిత వైఖరిని ప్రజాక్షేత్రంలో ఎండగడతామని తేల్చిచెప్పారు. అక్రమ అరెస్టు చేసిన కౌశిక్‌ రెడ్డి బేషరుతుగా వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేసిన కేటీఆర్, హరీశ్‌రావులు ఎన్ని వందల కేసులు పెట్టినా ప్రజల పక్షాల బీఆర్‌ఎస్‌ పోరాడుతూనే ఉంటుందని పునరుద్ఘాటించారు.

Latest News

బోనాలు – చరిత్ర, సంస్కృతి, సంప్రదాయం|BONALU|HISTORY|CULTURE

చారిత్రక, పురావస్తు, శాసన, సాహిత్య ఆధారాల విశ్లేషణ ప్రకారం బోనం సమర్పించే ఆచారం ఆషాఢ మాసంలో తెలంగాణతో పాటు దక్షిణ భారతదేశంలోని అనేక గ్రామాల్లో గ్రామదేవతారాధనలో అంతర్భాగంగా కొనసాగుతోంది. వర్షాకాలం ప్రారంభ దశలో...

కల్లుకు శిల్లు.. సీసీ కెమెరా!?|ADUGU TRENDS

యెన్కటికి దొంగకు శెప్పే లాభమన్నరు. దోసుకుంటోనికి శెప్పైనా, తప్పైనా ఒకటే. పడదలే సూసుకుంటడు. గట్లనే గీ మద్దెల దొంగలు తమ రూటు మార్సుకున్నరు. కంటికి కనుకు లేకుండా ఇంటికి కన్నాలేసుడు అసొంటివి మానేసిండ్రు....

రాహుల్ ముందున్న మార్గాలివే!?|EDITORIAL

రాహుల్‌ ముందున్నది ‘బొద్దింకలను బుట్టలో వేసుకోవడం’ కాదు. యువత నమ్మకాన్ని సంపాదించడం. ఆ నమ్మకం ఒక్క ఆందోళనతో రాదు. నిరంతర పోరాటం, స్పష్టమైన విధానాలు, ప్రత్యామ్నాయ పాలనా నమూనా, విశ్వసనీయ నాయకత్వం కావాలి....

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఆగస్టు 09 నుండి ఆగస్టు 15 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశివారికి అనుకూలమైన మార్పులు చోటుచేసుకుంటాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. మీ పనితీరుకు ఉన్నతాధికారుల...

నవ్వినోల్లే నోర్లెల్లబెట్టిండ్రు!?|ADUGU TRENDS

సంకల్పించాలె కనీ, కాని పని ఉంటదా? ఉండనే ఉండదని నిరూపించిండు గీ పెద్దాయినె. నల్గురు సూసి నవ్వినా, నా పని నేను శేసుక పోతానని, శేసి సూపిండు. గీయినె పేరు హీలియో డా సల్వా....

క్యా బోల్తే… పాలక్!?|EDITORIAL

దేశ భవిష్యత్తు యువతే. ఆ యువత ప్రశ్నిస్తే వినాలి, సూచిస్తే ఆలోచించాలి, సమస్యలు చెబితే పరిష్కరించాలి. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలంటే అధికారానికి సమాంతరంగా జవాబుదారీతనాన్ని పెంపొందించే స్వతంత్ర ప్రజా వేదికలు అవసరం. ప్రజల...

ఆగస్టు 08, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి దశమి ఉదయం 11.09 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం రోహిణీ మధ్యాహ్నం 03.15 వరకు ఉపరి మృగశిర యోగం ధ్రువ ఉదయం 08.20 వరకు ఉపరి వ్యాఘాత కరణం భద్ర ఉదయం 11.09 వరకు ఉపరి...

ఇగిప్పుడు ‘సావు’కొచ్చింది!?|ADUGU TRENDS

మన ఊర్లల్ల ఎవ్వలన్న కాలం శేసిండ్రంటేనే సూసొత్తం. కనికరం సూపి తలో సెయ్యేత్తం. దిక్కూమొక్కూలేనోల్లతై మనమే తలా ఇంతేసుకుని గాయింత ఇగ గా కట్టెల్లేసొత్తం. కానీ, తలకొరివి పెట్టాల్సిన కన్న బిడ్డలే కడసారి...

శ్రద్ధేది? శుద్ధ దండగ!?|EDITORIAL

2025 వర్షాకాల సమావేశాల్లో నిర్ణయించిన సమయంలో లోక్‌సభ కేవలం 29%, రాజ్యసభ 34% మాత్రమే పనిచేశాయి. ప్రశ్నోత్తరాల సమయంలో లోక్‌సభలో కేవలం 23%, రాజ్యసభలో 6% మాత్రమే పని జరిగింది. అదే సమావేశాల్లో14...

ఆగస్టు 07, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి నవమి మధ్యాహ్నం 01.29 వరకు ఉపరి దశమి నక్షత్రం కృత్తిక సాయంత్రం 04.48 వరకు ఉపరి రోహిణీ యోగం వృద్ధి ఉదయం 11.17 వరకు ఉపరి ధ్రువ కరణం గరజి మధ్యాహ్నం 01.29 వరకు ఉపరి...

మౌర్య పూర్వయుగం|ADUGU SPECIAL|HISTORY|COMPITITIVE EXAMS

క్రీ.పూ.650 నుండి క్రీ.పూ.250 మధ్య ఉన్న కాలాన్ని మౌర్యుల పూర్వయుగం లేదా బుద్ధుని యుగం లేదా షోడశ మహాజనపాదాల యుగం అని అంటారు. ఈ కాలంలో గౌతమ బుద్ధుడు ముఖ్య పురుషుడు కాబట్టి...

సంయమనం కోల్పోతే రాజకీయ సంక్షోభమే!?|EDITORIAL

వ్యక్తిగత విమర్శలు తాత్కాలిక రాజకీయ ప్రచారానికి ఉపయోగపడవచ్చు. కానీ, దీర్ఘకాలంలో నాయకుడి విశ్వసనీయతను దెబ్బతీస్తాయి. రాజకీయ వారసత్వం కేవలం కుటుంబ నేపథ్యంతోనే రాదు, హుందాతనంతో కూడిన నాయకత్వంతోనే నిలుస్తుంది. మాటలతో సంపాదించేది ప్రచారం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News