Monday, August 10, 2026
27.5 C
Hyderabad

బడ్జెట్ : ప్రజాకాంక్షలను ప్రతిబింబించేనా!?|EDITORIAL

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు రాష్ట్ర రాజకీయ వర్గాలనేగాక, సాధారణ ప్రజల్లో కూడా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. రాష్ట్రంలోని రైతులు, ఉద్యోగులు, యువత, మహిళలు, వ్యాపారులు అందరి ఆశలు, ఆకాంక్షలు ఈ బడ్జెట్‌పైనే నిలిచాయి.
పశ్చిమాసియా యుద్ధం ప్రభావం, పెట్రో, డీజిల్, గ్యాస్ సమస్యలు, వాటి ప్రభావంతో పెరగనున్న అన్ని ధరలు, రాష్ట్ర అప్పులు, వడ్డీలు, సంక్షేమ పథకాలు, ఆరు గ్యారెంటీల అమలు, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ ప్రక్షాళన, చెరువుల పునరుద్ధరణ, సుందరీకరణ, హైదరాబాద్ క్లీనింగ్ 99-డే ప్లాన్, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, స్కిల్ డెవలప్ మెంట్, ఉద్యోగ, ఉపాధి కల్పన, మహిళా విద్యార్థులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు వంటి అనేకానేక హామీల అమలు, ఆర్థికాంశాలను బ్యాలెన్స్ చేస్తూ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టాల్సి ఉంది. రాష్ట్ర అభివృద్ధి దశ, దిశను మార్చడమేగాక, ప్రజల జీవితాలపై ప్రభుత్వం, ప్రభుత్వంపై ప్రజాభిప్రాయం ప్రభావం చూపనుంది. అయితే ఈ బడ్జెట్ నిజంగా ప్రజా సమస్యలకు పరిష్కారం చూపగలదా?

ప్రభుత్వానికి బడ్జెట్ కు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రధాన సవాల్ గా మారింది. అయితే, రాష్ట్ర మొత్తం బడ్జెట్ పరిమాణం రూ.3 లక్షల కోట్లకు పైగా ఉండే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర అప్పులు ఇప్పటికే రూ.6 లక్షల కోట్లకు చేరువలో ఉన్నాయి. ఆదాయం పెరగాల్సిన అవసరం ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు భారీగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వం సంక్షేమం-అభివృద్ధి మధ్య సమన్వయం ఎలా సాధిస్తుందో చూడాల్సి ఉంది.

తెలంగాణలో ప్రజలకు వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. రైతు భరోసా కొనసాగింపు, సాగునీటి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు, పంటలకు గిట్టుబాటు హామీలను రైతులు కోరకుంటున్నారు. రాష్ట్రంలో 65 లక్షలకు పైగా రైతు కుటుంబాలు ఉన్నట్లు అంచనా. మరి వ్యవసాయ రంగానికి భారీ కేటాయింపులు ఉండే అవకాశం ఉందా? సాగునీటి ప్రాజెక్టులు, నీటి నిర్వహణ, రైతు రుణాలపై బడ్జెట్‌లో ప్రత్యేక దృష్టి ఉండవచ్చు.

రాష్ట్రంలో నిరుద్యోగం ప్రధాన సమస్యగా మారింది. ప్రతి ఏటా లక్షలాది మంది యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ ఖాళీలు, ప్రైవేట్ రంగ పెట్టుబడులు, స్టార్టప్‌లకు ప్రోత్సాహం వంటి అంశాలు ఈ బడ్జెట్‌లో ప్రాధాన్యం పొందే అవకాశం ఉంది. అలాగే స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలు, యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించే పథకాలు ప్రకటించే అవకాశం ఉంది.
రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు ప్రభుత్వ రాజకీయ వ్యూహంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.మహిళలకు ఆర్థిక సహాయం, విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, పెన్షన్‌లకు మరోసారి బడ్జెట్‌లో గణనీయమైన నిధులు కేటాయించే అవకాశం ఉంది. రాష్ట్రంలో 40 లక్షల మందికి పైగా పెన్షనర్లు ఉన్నారు. వీటి కొనసాగింపు తప్పనిసరి కాబట్టి, సంక్షేమ వ్యయం తగ్గే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి.

రాష్ట్ర అభివృద్ధిలో కీలకమైన మౌలిక వసతులైన కీలకం.రోడ్లు, పట్టణాభివృద్ధి, మెట్రో, రవాణా, పారిశ్రామిక పార్కులు వంటి రంగాల్లో పెట్టుబడులు పెంచే అవకాశముంది. ఐటీ, పరిశ్రమల రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.

సాధారణంగా బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమై, బడ్జెట్ ప్రవేశపెట్టడం, శాఖల వారీగా చర్చ, ప్రతిపక్షాల విమర్శలు, సూచనలు, ప్రభుత్వ సమాధానాలు, బడ్జెట్ ఆమోదంతో ముగుస్తాయి. అయితే సమావేశాలు వాడి వేడిగా కొనసాగే అవకాశాలున్నాయి. మరోసారి ప్రతిపక్షం ప్రభుత్వ ఆర్థిక విధానాలపై తీవ్ర విమర్శలు చేసే అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వం తన అభివృద్ధి కార్యక్రమాలను సమర్థించుకుంటుంది. కాకపోతే, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ఈ సమావేశాలు వస్తారా? లేక గతంలో లాగే టెక్నికల్ గా తన పదవికి ఇబ్బందీ కాకుండా హాజరైవెళ్ళిపోతారా? అన్నది చూడాలి.

అయితే, ఈ బడ్జెట్‌పై ప్రజల అంచనాలు భారీగా ఉన్నాయి. పెట్రో, డీజిల్, గ్యాస్ సహా ధరల నియంత్రణ, రైతులకు స్థిరమైన ఆదాయం, యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు, పట్టణ, గ్రామీణాభివృద్ధి, పెన్షన్లు, ఇండ్లు, రైతు భరోసా నిధులు, రేషన్ కార్డులు వంటి అనేకాంశాలపై స్పష్టమైన ప్రణాళికలు ప్రకటిస్తే మాత్రమే బడ్జెట్ ప్రజల విశ్వాసాన్ని పొందగలగుతుంది.

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే కీలక ఘట్టంగా నిలవనున్నాయి. సంక్షేమం, అభివృద్ధి, ఆర్థిక నియంత్రణల మధ్య సమతౌల్యం, సమన్వయం సాధించడం ప్రభుత్వానికి పెద్ద సవాలుగా నిలువనుంది.

ఈ బడ్జెట్ నిజంగా ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబిస్తుందా? రాష్ట్రంలోని ప్రధాన సమస్యలకు పరిష్కారం చూపుతుందా? ఏమైనా ఈ బడ్జెట్ తెలంగాణ ప్రజల ఆర్థిక, సామాజిక భవిష్యత్తుపై గణనీయమైన ప్రభావం చూపనుంది.

Latest News

ఆగస్టు 10, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి ద్వాదశి ఉదయం 06.13 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం ఆరుద్ర ఉదయం 11.53 వరకు ఉపరి పునర్వసు యోగం వజ్ర రాత్రి 11.10 వరకు ఉపరి సిద్ది కరణం తైతుల ఉదయం 06.13 వరకు ఉపరి...

బోనాలు – చరిత్ర, సంస్కృతి, సంప్రదాయం|BONALU|HISTORY|CULTURE

చారిత్రక, పురావస్తు, శాసన, సాహిత్య ఆధారాల విశ్లేషణ ప్రకారం బోనం సమర్పించే ఆచారం ఆషాఢ మాసంలో తెలంగాణతో పాటు దక్షిణ భారతదేశంలోని అనేక గ్రామాల్లో గ్రామదేవతారాధనలో అంతర్భాగంగా కొనసాగుతోంది. వర్షాకాలం ప్రారంభ దశలో...

కల్లుకు శిల్లు.. సీసీ కెమెరా!?|ADUGU TRENDS

యెన్కటికి దొంగకు శెప్పే లాభమన్నరు. దోసుకుంటోనికి శెప్పైనా, తప్పైనా ఒకటే. పడదలే సూసుకుంటడు. గట్లనే గీ మద్దెల దొంగలు తమ రూటు మార్సుకున్నరు. కంటికి కనుకు లేకుండా ఇంటికి కన్నాలేసుడు అసొంటివి మానేసిండ్రు....

రాహుల్ ముందున్న మార్గాలివే!?|EDITORIAL

రాహుల్‌ ముందున్నది ‘బొద్దింకలను బుట్టలో వేసుకోవడం’ కాదు. యువత నమ్మకాన్ని సంపాదించడం. ఆ నమ్మకం ఒక్క ఆందోళనతో రాదు. నిరంతర పోరాటం, స్పష్టమైన విధానాలు, ప్రత్యామ్నాయ పాలనా నమూనా, విశ్వసనీయ నాయకత్వం కావాలి....

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఆగస్టు 09 నుండి ఆగస్టు 15 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశివారికి అనుకూలమైన మార్పులు చోటుచేసుకుంటాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. మీ పనితీరుకు ఉన్నతాధికారుల...

నవ్వినోల్లే నోర్లెల్లబెట్టిండ్రు!?|ADUGU TRENDS

సంకల్పించాలె కనీ, కాని పని ఉంటదా? ఉండనే ఉండదని నిరూపించిండు గీ పెద్దాయినె. నల్గురు సూసి నవ్వినా, నా పని నేను శేసుక పోతానని, శేసి సూపిండు. గీయినె పేరు హీలియో డా సల్వా....

క్యా బోల్తే… పాలక్!?|EDITORIAL

దేశ భవిష్యత్తు యువతే. ఆ యువత ప్రశ్నిస్తే వినాలి, సూచిస్తే ఆలోచించాలి, సమస్యలు చెబితే పరిష్కరించాలి. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలంటే అధికారానికి సమాంతరంగా జవాబుదారీతనాన్ని పెంపొందించే స్వతంత్ర ప్రజా వేదికలు అవసరం. ప్రజల...

ఆగస్టు 08, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి దశమి ఉదయం 11.09 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం రోహిణీ మధ్యాహ్నం 03.15 వరకు ఉపరి మృగశిర యోగం ధ్రువ ఉదయం 08.20 వరకు ఉపరి వ్యాఘాత కరణం భద్ర ఉదయం 11.09 వరకు ఉపరి...

ఇగిప్పుడు ‘సావు’కొచ్చింది!?|ADUGU TRENDS

మన ఊర్లల్ల ఎవ్వలన్న కాలం శేసిండ్రంటేనే సూసొత్తం. కనికరం సూపి తలో సెయ్యేత్తం. దిక్కూమొక్కూలేనోల్లతై మనమే తలా ఇంతేసుకుని గాయింత ఇగ గా కట్టెల్లేసొత్తం. కానీ, తలకొరివి పెట్టాల్సిన కన్న బిడ్డలే కడసారి...

శ్రద్ధేది? శుద్ధ దండగ!?|EDITORIAL

2025 వర్షాకాల సమావేశాల్లో నిర్ణయించిన సమయంలో లోక్‌సభ కేవలం 29%, రాజ్యసభ 34% మాత్రమే పనిచేశాయి. ప్రశ్నోత్తరాల సమయంలో లోక్‌సభలో కేవలం 23%, రాజ్యసభలో 6% మాత్రమే పని జరిగింది. అదే సమావేశాల్లో14...

ఆగస్టు 07, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి నవమి మధ్యాహ్నం 01.29 వరకు ఉపరి దశమి నక్షత్రం కృత్తిక సాయంత్రం 04.48 వరకు ఉపరి రోహిణీ యోగం వృద్ధి ఉదయం 11.17 వరకు ఉపరి ధ్రువ కరణం గరజి మధ్యాహ్నం 01.29 వరకు ఉపరి...

మౌర్య పూర్వయుగం|ADUGU SPECIAL|HISTORY|COMPITITIVE EXAMS

క్రీ.పూ.650 నుండి క్రీ.పూ.250 మధ్య ఉన్న కాలాన్ని మౌర్యుల పూర్వయుగం లేదా బుద్ధుని యుగం లేదా షోడశ మహాజనపాదాల యుగం అని అంటారు. ఈ కాలంలో గౌతమ బుద్ధుడు ముఖ్య పురుషుడు కాబట్టి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News