ప్రధాని నరేంద్ర మోదీ నిజమైన బీసీ కాదని, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2002 వరకు మోదీ ఉన్నత కులానికి చెందిన వారని, గుజరాత్ సీఎం అయిన తర్వాత తన కులాన్ని బీసీల్లో చేర్చించుకున్నారని ఆరోపించారు. ఇది తన ఊహాగానం కాదని, అన్నీ పరిశీలించి మాట్లాడుతున్నానని తెలిపారు. మోదీ తన నిజమైన సామాజిక స్థితిని దేశ ప్రజల ముందు వెల్లడించాలని రేవంత్ డిమాండ్ చేశారు.

