శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని అనేక రకాలుగ అలంకరిత్తరు. దేవి శరన్నవరాత్రులల్ల రోజుకో పత్యేక రూపంల అమ్మవారు భక్తులకు దర్శనమిత్తరు. బంగారు కవచంతోటి, చిన్న పిల్లల రూపంల, గంటె చేతిల పట్టుకుని భిక్షపాత్రతోటి అన్నపూర్ణగ, పంచముఖాలు, తెల్లని, బంగారు ఆభరణాలతోటి, సర్వాభరణ భూషితమై పరమేశ్వరిగ, సంపదలకు అధిదేవత లక్ష్మీదేవిగ, సదువుల తల్లి సరస్వతిగ, ఆదిశక్తిగా దుర్గాదేవిగ, రాక్షస సంహారిని మహిషాసుర మర్ధినిగ, విజయదశమి నాడు పరమశివుడి వామభాగంలో రాజరాజేశ్వరిగ దివ్యమైన అలంకరణలు శేత్తరు. ఇగ ఆషాఢ మాసంల అమ్మవారిని రకరకాల తాజా కూరగాయలు, పండ్లతోటి అద్భుతంగా అలంకరిత్తరు. గట్లనే గీ కార్తీక మాసంల గా కనక దుర్గమ్మ తల్లి ఎట్ల దర్శనిమిచ్చొందో సూడుండ్రి.
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గ తల్లికి గీ కార్తీక శుద్ధ విదియ యమద్వితీయ, భగినీ హస్త భోజనం సందర్భంగ అమ్మవారి మూలవిరాట్‌తో పాటు గుడి మొత్తాన్ని 8 లచ్చల రంగురంగుల గాజులతోటి విశేషంగా అలంకరించిండ్రు. ఇగ గా గాజుల్ని భక్తులకు అందశేత్తరు. భక్తులకు పాటి ఉండాలె గని, గా దేవుళ్ళను ఎట్ల కొలుత్తరో సూడుండ్రి.
8 లచ్చల గాజులతోటి అమ్మవారికి అలంకరణ!|ADUGU TRENDS

