Sunday, October 18, 2026
25.1 C
Hyderabad

ఎల్ నినో ప్రభావాన్ని తగ్గించడమే అసలైన పరీక్ష!|EDITORIAL

ఎల్‌నినో బలహీనపడాలని, సమయానుకూలం గా వర్షాలు కురవాలని కోరుకోవడం సహజమే. కానీ వాతావరణాన్ని మార్చలేం. దాని ప్రభావాన్ని తగ్గించే వ్యవసాయ విధానాలను మాత్రం ముందుగానే రూపొందించవచ్చు. ఇదే ఇప్పుడు కేంద్రం, రాష్ట్రాలు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖలు కలిసి చేయాల్సిన అసలు పరీక్ష.!

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్ 

వాతావరణ మార్పులు వాటి ప్రభావం నేరుగా రైతు పొలంలో, పంట దిగుబడిలో, ఆహార ధరల్లో కనిపిస్తోంది. 2026–27 వ్యవసాయ ఏడాదికి ఎల్‌నినో మరో పెద్ద సవాల్ గా మారుతోంది. కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ క్లైమేట్ అండ్ సొసైటీ (ఐఆర్‌ఐ) సెప్టెంబర్ 21న విడుదల చేసిన తాజా అంచనా ప్రకారం, మధ్య-తూర్పు భూమధ్యరేఖ పసిఫిక్‌లోని నినో 3.4 సూచిక సెప్టెంబర్ మధ్య నాటికి +3.0 డిగ్రీల సెల్సియస్‌కు చేరింది. ఆగస్టులో ఇది +2.52 డిగ్రీలు. +2.0 డిగ్రీలకు పైగా ఉంటే ఐఆర్‌ఐ వర్గీకరణలో అది ‘వెరీ స్ట్రాంగ్’ ఎల్‌నినోగా పరిగణించబడుతుంది.

మరింత ఆందోళన కలిగించే అంశం 22 వాతావరణ నమూనాల ఏకాభిప్రాయం. ఇందులో 13 డైనమిక్, 9 స్టాటిస్టికల్ నమూనాలు ఉన్నాయి. ఇవన్నీ 2026 శీతాకాలంలో ఎల్‌నినో చాలా బలంగా ఉండే అవకాశాన్ని సూచించాయి. సెప్టెంబర్ 2026 నుంచి ఫిబ్రవరి 2027 వరకు ఎల్‌నినో పరిస్థితుల సంభావ్యత 100 శాతంగా ఉండగా, మార్చి–మేలో 99 శాతం, ఏప్రిల్–జూన్‌లో 90 శాతం, మే–జూలైలో 61 శాతంగా ఐఆర్‌ఐ అంచనా వేసింది. అంటే వచ్చే ఏడాది మధ్య నాటికి బలహీనపడే అవకాశం ఉన్నప్పటికీ, వ్యవసాయంపై దాని ప్రభావాలు అంత త్వరగా ముగుస్తాయని చెప్పలేం.

భారత్‌లో అసలు పరీక్ష వర్షాధార వ్యవసాయానిదే. ఎల్‌నినో ప్రభావం ప్రతి ప్రాంతంలో ఒకే విధంగా ఉండదన్నది గుర్తుంచుకోవాలి. వర్షపాతం తగ్గడం, వర్షాల సమయాల్లో మార్పు, అధిక ఉష్ణోగ్రతలు, పొడి కాలాలు పెరగడం వంటి పరిణామాలు నేల తేమను ప్రభావితం చేయవచ్చు. అదే సమయంలో అధిక వర్షం పడే ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడం, పంట నష్టం వంటి విరుద్ధ పరిస్థితులు కూడా తలెత్తవచ్చు. అందువల్ల ‘ఎల్‌నినో అంటే కరువు’ అనే సరళమైన అంచనా కాకుండా, ప్రాంతాల వారీ వాతావరణ సూచనల ఆధారంగా పంట ప్రణాళిక అవసరం.

ఇదే కారణంగా రబీ సీజన్ సన్నద్ధతపై కేంద్రం నిర్వహించిన జాతీయ సదస్సుకు ప్రాధాన్యం ఏర్పడింది. 2026 సెప్టెంబర్ 28–29 తేదీల్లో జరిగిన ఈ సమావేశం కేంద్ర–రాష్ట్ర సమన్వయం, వాతావరణ సవాళ్లకు అనుగుణమైన వ్యవసాయ వ్యూహాలపై దృష్టి పెట్టింది. గత రబీ గణాంకాలు కూడా పంటల విస్తీర్ణంలో గోధుమలు, పప్పుధాన్యాలు, నూనెగింజల ప్రాధాన్యాన్ని స్పష్టం చేస్తున్నాయి. 2025–26లో సాధారణ రబీ విస్తీర్ణం గోధుమలకు 312.35 లక్షల హెక్టార్లు, పప్పుధాన్యాలకు 140.42 లక్షలు కాగా, 2025 నవంబర్ 28 నాటికి వరుసగా 187.37, 87.01 లక్షల హెక్టార్లలో విత్తనాలు పడ్డాయి.

తెలంగాణ విషయానికి వస్తే, ఎల్‌నినోను రాజకీయ నినాదంగా కాకుండా రైతు వ్యూహంగా చూడాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం 2026–27 బడ్జెట్‌లో రైతు భరోసాకు రూ.18వేల కోట్లు కేటాయించింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం వ్యవసాయ రంగానికి గత 30 నెలల్లో రూ.1.75 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు ప్రకటించింది. 73.30 లక్షల మంది రైతులకు రూ.9వేల కోట్ల రైతు భరోసా విడుదల చేసినట్లు కూడా తెలిపింది.

అయితే, సంక్షేమ పథకాలకు నిధులు కేటాయించడం మాత్రమే సరిపోదు. రైతుకు విత్తనం నుంచి మార్కెట్ వరకు సమగ్ర భద్రత, పంట బీమా, సాగునీటి నిర్వహణ, నేల ఆరోగ్యం, వాతావరణ ఆధారిత పంట సలహాలు, నిల్వ సదుపాయాలు అవసరం. పంటల వైవిధ్యీకరణ కూడా ఇక ఐచ్ఛికం కాదు.
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అవసరం. ప్రభుత్వ పథకాల ఫలితాలను కొలవడం అంతకంటే అవసరం. గత ప్రభుత్వం మెరుగైనదని భావించే వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయవచ్చు. ప్రస్తుత ప్రభుత్వం తన పనితీరును గణాంకాలతో సమర్థించుకోవచ్చు. కానీ రైతు మాత్రం రాజకీయ వాగ్దానాల కంటే సమయానికి విత్తనం, నీరు, పెట్టుబడి, బీమా, గిట్టుబాటు ధర కోరుకుంటాడు.
ఎల్‌నినో బలహీనపడాలని, సమయానుకూలం గా వర్షాలు కురవాలని కోరుకోవడం సహజమే. కానీ వాతావరణాన్ని మార్చలేం. దాని ప్రభావాన్ని తగ్గించే వ్యవసాయ విధానాలను మాత్రం ముందుగానే రూపొందించవచ్చు. ఇదే ఇప్పుడు కేంద్రం, రాష్ట్రాలు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖలు కలిసి చేయాల్సిన అసలు పరీక్ష.

Latest News

ఈ దంపతులు సింపతీ కోల్పోతున్నారా!?|KONDA SUREKHA|KONDA MURALI|FAMILY

పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలకు దూరం..పైగా సెపరేట్ ఈసీపై ఏఐసీసీ ఆందోళనలకు కూడా హాజరుకాని వైనం పట్టభద్రుల ఎమ్మెల్సీ సమాయత్త సమావేశానికి గైర్హాజర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు మంత్రుల సందర్శనలోనూ నో వేర్ పైగా విడిగా పార్టీ...

బతుకమ్మ వాయినం!?|ADUGU TRENDS

‘ఇత్తినమ్మ వాయినం అంటే, తీస్కుంటినమ్మ వాయినం.’ అని అంటరు. గిదేందంటే, పండుగలు, పబ్బాలకు, శుభ కార్యాలకు, రతాలకు ముత్తైదువులకు అందించే తాంబూలం, పిండివంటలు, పండ్లు-పూలు, పసుపు-కుంకుమలను కలిపి ఇచ్చే కానుకలను వాయినం అంటరు....

పటిష్ట వ్యవస్థ తప్పనిసరి!|EDITORIAL

ఓటరు జాబితాలో ఒక్క పేరు మాయమైనా.. ప్రజాస్వామ్యానికి గట్టి దెబ్బే! దేశవ్యాప్తంగా ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై పెరుగుతున్న ఆందోళనలు, ఓటర్ల పేర్ల తొలగింపుపై ఆరోపణలు ఎన్నికల వ్యవస్థ పారదర్శకతను ప్రశ్నిస్తున్నాయి. జాబితాల ప్రక్షాళన అవసరమే.....

అక్టోబర్ 17, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజ మాసం శుక్లపక్షం శ్రీ చండికాదేవి అలంకరణ తిధి సప్తమి రాత్రి తెల్ల 05.10 వరకు ఉపరి అష్టమి నక్షత్రం మూల ఉదయం 08.16 వరకు ఉపరి పుర్వాషాఢ యోగం అతిగండ రాత్రి 10.31 వరకు ఉపరి సుకర్మ కరణం...

ఆడ ఏడో రోజే|SADDULA BATHUKAMMA

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. అయితే జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలోని పెద్దమడూరు గ్రామంలో మాత్రం ఈ పండుగను ఏడో...

పొద్దుగాల పెండ్లి.. సీకటి పడంగనే పెటాకులు!?|ADUGU TRENDS

పెండ్లంటే నూరేండ్ల పంట అన్నరు. ఒకపాలి పెండ్లైందంటే వందేండ్లైనా గా అనుబంధం యిడి పోదని దానర్థం. కానీ, గీ మద్దెల పెండ్లిల్లు.. పెటాకులైపోవడానికి పెద్దగ టైమేం పడ్తలేదు. గిప్పుడు పెండ్లి సేసుకుంటాండ్లో లేదో.....

రియాద్ సంక్షోభం!|EDITORIAL

మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి! హౌతీల భీకర క్షిపణి దాడులతో సౌదీ రాజభవనాలు వణుకుతుండగా, క్రౌన్ ప్రిన్స్ ప్రాణభయంతో అజ్ఞాతంలోకి వెళ్లిన వేళ.. ఇజ్రాయెల్ స్నేహహస్తాన్ని తిరస్కరించిన రియాద్ నిర్ణయం గల్ఫ్ రాజకీయాల్లో...

అక్టోబర్ 16, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజ మాసం శుక్లపక్షం శ్రీ సరస్వతిదేవి అలంకరణ తిధి షష్ఠి రాత్రి తెల్ల 03.02 వరకు ఉపరి సప్తమి నక్షత్రం మూల పూర్తిగా ఉంది యోగం శోభ రాత్రి 09.56 వరకు ఉపరి అతిగండ కరణం కౌలవ పగలు...

గియేం పోస్టాపీసుల్రా నాయినా!?|ADUGU TRENDS

మనం సూసిన పోస్టాపీసులకు గీ పోస్టాపీసులకు పోలికలే లేవు. ఒకటేమో నీల్ల మీద. ఇంకోటేమో నీల్ల లోపల, మరోటేమో ఎత్తనై భూమ్మీద, ఇంకా గుహల్ల, రైలు పట్టాల మద్దెల... గిట్ల గీ పోస్టాపీసులన్నయి....

ప్రపంచానికి పెను ముప్పు!?|EDITORIAL

క్షిపణుల మోతతో పశ్చిమాసియా దద్దరిల్లుతోంది! విమానాశ్రయాలే లక్ష్యంగా దాడులు.. చమురు కేంద్రాలపై ప్రతీకార దాడులు.. కీలక సముద్ర మార్గాల్లో పెరుగుతున్న ఉద్రిక్తతలు! అగ్రరాజ్యాల జోక్యంతో యుద్ధం మరింత విస్తరిస్తుందా? చమురు ధరల నుంచి...

అక్టోబర్ 15, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజ మాసం శుక్లపక్షం శ్రీ లలిత త్రిపుర సుందరిదేవి అలంకరణ తిధి పంచమి రాత్రి 01.00 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి తెల్ల 05.41 వరకు ఉప6 మూల యోగం సౌభాగ్య రాత్రి 09.28...

బంగారం సొరంగంలకి!?|ADUGU TRENDS

ఆశకు అంతుండాలంటరు. అత్యాశకు పోతే ఒక్కోపాలి పానమే పోతది. గట్లనే అయింది గీ ఇద్దరి దోస్తుల పని. యూ ట్యూబ్ సూసి, బంగారం కోసం ఓ సొరంగంలకి పోయి పానం మీదికి తెచ్చుకున్నర...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News