మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. రామ్ చరణ్‌కు కొడుకు పుట్టాలని, కానీ మళ్లీ ఆడపిల్ల పుడుతుందేమోనని భయపడుతున్నట్లు చేసిన వ్యాఖ్యలు నెటిజన్ల నుంచి తీవ్రమైన ప్రతిస్పందనకు గురయ్యాయి. ఓ సినిమా ఈవెంట్‌లో మాట్లాడిన చిరంజీవి, తన ఇల్లు మనవరాళ్లతో నిండిపోయిందని, ఇంట్లో లేడీస్ హాస్టల్ వార్డెన్‌లా ఫీలవుతున్నట్లు హాస్యప్రాయంగా వ్యాఖ్యానించారు. అలాగే, ప్రతిసారి రామ్ చరణ్‌ను “ఒక అబ్బాయిని కనురా” అని అడుగుతానని అన్నారు. ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు, మహిళా సంఘాలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. 2025లో కూడా ఇలాంటి పురుషాధిక్య అభిప్రాయాలు వ్యక్తం చేయడం తగదని మండిపడుతూ, చిరంజీవి వెంటనే క్షమాపణ చెప్పాలని కోరుతున్నారు.

