Wednesday, September 16, 2026
31.2 C
Hyderabad

దసరా వైశిష్ట్యం విజయోస్తు!|EDITORIAL

హిందువులు జరుపుకునే పండగలలో దసరా పండగకు విశిష్ట స్థానం ఉంది. ఈ విజయ దశమికి సంబంధించి పలు పురాణగాథలు చెలామణిలో ఉన్నాయి. రాముడు రావణుని పై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భమున రావణవధ, జమ్మి ఆకుల పూజ చేయటం ఆనవాయితీగా వస్తోంది. జగన్మాత అయిన దుర్గాదేవి, మహిషాసురుడనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధం చేసి, అతడిని వధించి జయాన్ని పొందిన సందర్భంగా 10వ రోజు ప్రజలంతా సంతోషంతో పండగ జరుపుకున్నారు. అదే విజయదశమి. అందుకే దసరా హిందువులకు ముఖ్యమైన పండుగ.

ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవరోజు విజయదశమి కలసి దసరా జరుపుకుంటున్నాం. ఇది శక్తి ఆరాధనకు ప్రాధాన్యమిచ్చే పండుగ. ఈ పండుగను నవరాత్రి, శరన్నవరాత్రి అని కూడా అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికి, తర్వాతి మూడు రోజుల లక్ష్మీ దేవికి, ఆ తర్వాత మూడురోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. ఆశ్వయుజ మాసం శుక్ల పక్షంలో మొదటి తొమ్మిది రోజులను దసరా నవరాత్రులు, దేవీ నవరాత్రులు లేక శరన్నవరాత్రులు అంటారు. 10వ రోజును దసరా లేదా విజయదశమిగా జరుపుకుంటారు. ఈ తొమ్మిది రోజులు శక్తిస్వరూపిణి అయిన దుర్గాదేవి అవతారాలైన నవదుర్గలను అత్యంత భక్తీ శ్రద్ధలతో పూజిస్తారు. ఈ దేవీ నవరాత్రులలో చివరి మూడు రోజులు, దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమిగా జరుపుకుంటారు. విద్యార్ధులు పుస్తకాలూ, పెన్నులను పూజిస్తే, శ్రామికులు తమ పనిముట్లను పూజిస్తారు. ఇక క్షత్రియులు ఆయుధ పూజ చేసి, అమ్మవారి కృపకు పాత్రులవుతారు.

విజయ సూచిక అయిన దసరానే.. పూర్వం రాజులు తమ దండయాత్రకు శుభ ముహూర్తంగా ఎంచుకునే వారట. దేవీ పూజ ప్రాధాన్యత ఈశాన్య భారతదేశంలో ఎక్కువ. దైత్య వంశానికి ఆశాదీపంలా జన్మించిన ’మహిషాసురుడు’ తన ఆంతరంగిక మిత్రులతో, సచివులతో సమాలోచన చేసి, మరణంలేని జీవనం కోసం మేరు పర్వతశిఖరం చేరి బ్రహ్మ దేవుని గూర్చి ఘోరతపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, ‘మహిషాసురా! ఇంక తపస్సు చాలించి ఏ వరం కావాలో కోరుకో’ అన్నాడు. ‘పితామహా.,నేను అమరుణ్ణి కావాలి. నాకు మరణం లేని జీవితాన్ని ప్రసాదించ’మని మహిషాసురుడు కోరాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ‘మహిషాసురా.. పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు.., గిట్టిన ప్రాణి మరల పుట్టక తప్పదు. జననమరణాలు సకల ప్రాణి కోటికి సహజ ధర్మాలు. సప్తసముద్రాలకూ, మహా పర్వతాలకూ కూడా వినాశం తప్పదు. ప్రకృతి విరుద్ధమైన నీ కోరిక తీర్చుట అసంభవం. కనుక, నీ మరణానికి మృత్యువుకు ఒక మార్గం విడిచిపెట్టి, మరే వరమైనా కోరుకో’ అన్నాడు. అప్పుడు మహిషా సురుడు ’విధాతా.. అల్పమైన కోరికలకు ఈ మహిషాసురుడు ఆశపడడు. సరే, ఆడది నా దృష్టిలో అబల.. ఆమె వల్ల నాకే ప్రమాదమూ రాదు. కనుక, పురుషుడి చేతిలో నాకు మరణం రాకుండా వరం అనుగ్రహించ’మని కోరాడు. బ్రహ్మదేవుడు ఆ వరాన్ని మహిషాసురునికి అనుగ్రహించి అంతర్థాన మయ్యాడు.

వరగర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధం చేసి వారిని ఓడించి ఇంద్రపదవి చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులతో మొర పెట్టుకోగా, మహిషునిపై వారిలో రగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజంగా మారింది. త్రిమూర్తుల తేజం కేంద్రీకృతమై ఒక స్త్రీరూపమై జన్మించింది. శివుని తేజం ముఖంగా, విష్ణు తేజం బాహువులుగా, బ్రహ్మ తేజం పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 18 బాహువులను కలిగి ఉంది. ఆమెకు శివుడు శూలాన్ని, విష్ణువు చక్రాన్ని, ఇంద్రుడు వజ్రాయుధాన్ని, వరుణుడు పాశాన్ని, బ్రహ్మదేవుడు అక్షమాల, కమండలం.. హిమవంతుడు సింహాన్ని వాహనంగా ఇచ్చారు. ఇలా సర్వదేవతల ఆయుధాలు సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకర పోరు సల్పింది. మహిషా సురుని తరఫున పోరు సల్పుతున్న ఉదద్రుడు, మహాహనుడు, అసిలోముడు, బాష్కలుడు, బిడాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసురునితో అమ్మ తలపడింది. దేవితో తలపడిన అసురుడు మహిషి రూపాన, సింహ రూపాన, మానవ రూపాన భీకరంగా పోరి చివరకు తిరిగి మహిషి రూపంలో దేవిచేతిలో హతుడైనాడు.

మహిషుని సంహరించిన దినం కాబట్టి అప్పటి నుండి మహిషాసుర మర్ధనిని కొలిచే దసరా పర్వదినంగా ప్రజలు నిర్వహించుకుంటున్నారు. ఉత్తర భారతంలో దసరాను రావణ దహనంగా నిర్వహిస్తారు. దక్షిణాన శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపుగా నిర్వహిస్తారు. ఇలా ఒక్కోచోట ఒక్కో విధంగా అమ్మవారిని పూజించడం ఆనవాయితీగా వస్తోంది. ఎలా పూజించినా అమ్మవారితో పాటు, ప్రకృతిని ఆరాధించడం శరన్నవరాత్రులు, దసరా విష్టతగా చెప్పుకోవాలి. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు! విజయోస్తు!!

Latest News

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

మోదీ 25ఏళ్ళ ప్రస్థానం బీజేపీ ప్రచార వ్యూహం!?|EDITORIAL

మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ రూపొందించిన కార్యాచరణలో ప్రజల వద్దకు వెళ్లడం మాత్రమేనా? లేక ప్రజల మాట వినడం కూడా జరుగుతుందా? రాబోయే ఎన్నికల రాజకీయాల్లో ఈ తేడానే...

సెప్టెంబర్ 16, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పంచమి ఉదయం 08.28 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం విశాఖ రాత్రి 06.02 వరకు ఉపరి అనురాధ యోగం వైధృతి పగలు 02.11 వరకు ఉపరి విస్కమ్బ కరణం బాలవ ఉదయం 08.28...

సెప్టెంబర్ 15, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు చవితి ఉదయం 06.59 వరకు ఉపరి పంచమి నక్షత్రం స్వాతి సాయంత్రం 04.18 వరకు ఉపరి విశాఖ యోగం ఐంద్ర పగలు 02.21 వరకు ఉపరి వైధృతి కరణం భద్ర ఉదయం 06.59...

సెప్టెంబర్ 14, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం వినాయక చవితి https://www.instagram.com/reel/DdPKUAqysmC/?stkn=Nmxzdnc3NDB4ejNn తిధి శు తదియ ఉదయం 07.00 వరకు ఉపరి చవితి నక్షత్రం చిత్త పగలు 03.05 వరకు ఉపరి స్వాతి యోగం బ్రహ్మ పగలు 02.54 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం...

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

గుప్తుల సమాజం|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL|HISTORY

గుప్తుల సామ్రాజ్యం అనేక రాష్ట్రాలుగా విభజించబడింది. ఈ రాష్ట్రాలను భుక్తులు అని పిలిచేవారు. ఒక భుక్తి యొక్క ముఖ్య అధికారిని ఉపారిక అన్నారు. ఈ భుక్తులను విషయాలుగా (జిల్లాలుగా) విభజించారు. ఒక విషయం...

గీ ఊర్లల్ల యేడ సూసినా, యేడి నీల్లే!?|ADUGU TRENDS

గా ఊర్లల్ల భూమి కింద మంట పెట్టినట్లు... అదే పనిగ కట్టెలెగేస్తున్నట్లు... కరెంటుతో గీజరేసినట్లు... యేడి నీల్లు ఉబికి వత్తయి.! ఒకేళ వాన పడ్డా సరే, పెనం మీద నీల్లు పోసినట్లు భూమి...

ప్రపంచానికి బ్రిక్స్ సరికొత్త దశాదిశ!?|EDITORIAL

ఢిల్లీ సదస్సు బ్రిక్స్ కు కొత్త దిశను సూచిస్తోంది. ప్రపంచ పాలనలో సంస్కరణలు, గ్లోబల్ సౌత్‌కు గొంతుక, ఆర్థిక సంస్థల్లో సమాన ప్రాతినిధ్యం వంటి లక్ష్యాలు స్వాగతించదగినవే. అయితే, తీర్మానాల అమలే అసలు...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 13 నుండి సెప్టెంబర్ 19 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి పనుల్లో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం...

గీ బూచోడు, ఎంత మంచోడో!?|ADUGU TRENDS

మనుసుల్లో మంచి మనుసులున్నట్లే.. దొంగల్ల కూడ మంచి దొంగలుంటారని నిరూపించాడో దొంగ. తను దోసుకున్న దేవుడి నగలే కాదు, వాటిని మరమ్మతు సేయడానికి కొంత నగదు కూడా పెట్టి, దేవుడా శమించు... తప్పైందని...

వానల్లేక అన్నదాతల విలవిల!?|EDITORIAL

వర్షం పడటం ప్రకృతి చేతిలో ఉండొచ్చు. కానీ వర్షం పడకపోయినా రైతును కాపాడే వ్యవస్థను నిర్మించడం మాత్రం పాలకుల చేతుల్లోనే ఉంది. వరుణుడి కోసం ఎదురుచూస్తూ చేతులు ముడుచుకుంటే కరువు ముప్పు మరింత...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News