Wednesday, July 29, 2026
23.5 C
Hyderabad

అధికారం కోసం రాజకీయ అరాచకాలు!|EDITORIAL

అధికారం ప్రమాదకర మత్తు. అదో మాయామేయ జగత్తు. దాని కోసం ఎంతకైనా తెగించడం దాని గమ్మత్తు. కనిపెట్టిన వాడు దాని తాకత్తు. ప్రజలకు కనికడుతూనే ఉంటాడు ఆ తాయత్తు. ఒకసారి అధికారం రుచి చూసింది లగాయత్తు. దాని చుట్టూతిరుగుతుంటుంది యావత్తు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైంది, అందరికీ ఆసక్తి గొలిపేది, ఆకర్షణ కూడా కలిగి ఉంది. రాజకీయమే. వెనుకటికి మహిళ కోసం మహిలో యుద్ధాలే జరిగాయన్నది ఎంత నిజమో ఇవ్వాళ రాజకీయ అధికారం కోసం అంతకుమించిన ఆరాచక మథాంధకారం రాజ్యమేలుతోంది. ఇవ్వాళ భూమి మీద ఇన్ని రకాల ఉపద్రవాలకు, యుద్ధాలకు కూడా రాజకీయాలను తప్పు పట్టకుండా ఉండలేం. అందుకే అధికారంలో ఉండగానే కాదు, అధికారాంతమున చూడవలే అయ్యవారి ఆగడములు.. ఊరికే అనలేదు. దాని మహత్తు అలాంటిది మరి. అధికారం కోసం రాజకీయ నాయకులు ఎంతకైనా తెగిస్తారనడానికి ప్రపంచ, దేశ, రాష్ట్రాలలో వారి రాజకీయాలు చూస్తే అర్థమవుతుంది. దేన్నైనా తమకు అనుకూలంగా, అనువుగా మార్చుకోవడం, దోచుకోవడం, దాచుకోవడం, తమ పబ్బం గడుపుకుని పలాయనం చిత్తగించడం రివాజుగా మారింది.

ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జగన్ పర్యటనలో జరిగిన హంగామా ఇద్దరి ప్రాణాలు తీసింది. చనిపోయిన ఓ వ్యక్తి పరామర్శ మరో ఇద్దరి చావుకు కారణమైంది. పరామర్శకు కూడా ఇంత అవసరమా అన్నదే సామాన్యుల ప్రశ్న. పరామర్శలకు వెళుతున్నారా లేక, రాజకీయ హంగామాకా? అధికారంలో ఉండగా ప్యాలెస్‌ దిగిరాని జగన్, సామాన్యులను పట్టించుకోలేదు. అమరావతి రైతుల ఆందోళనలు వినలేదు. చనిపోయిన వారెవ్వరి గురించీ ఆలోచించలేదు. ఇవ్వాళ ఇదంతా ఎందుకంటే అధికారం కోసం. ఏపీలో జగన్ కు, తెలంగాణలో కేసీఆర్ కు అధికారం దూరమై ఇంకా రెండేండ్లు నిండలేదు. అప్పుడే కొంపలు అంటుకు పోయినట్లు దారుణంగా అడ్డగోలుగా గగ్గోలు పెడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు దురాగతాలకు పాల్పడి ఇప్పుడు ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛ, పోలీసుల వేధింపుల గురించి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది. ఇప్పటి కిప్పుడు ఎన్నికలు జరిగితే తమదే అధికారమని సొంత పత్రికల్లో బాకాలూదుతున్నారు.

విమర్శలకు కూడా హద్దులు ఉంలాలి. మీడియాతో మాట్లాడటం, మరుసటి రోజు ట్విట్టర్‌ లో వల్లించడం, ఆతర్వాత రోజు దానిపై సొంత పత్రికల్లో కథనాలు, టీవీల్లో బాకాలు ఊదడం అలవాటైపోయిది. ప్రజల సమస్యలు పక్కకు పోయాయి. నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు అన్నట్లుగా తమ పాలనలోని గత తమ పాపాలను ప్రజలు మరచి పోతారన్న ఏకైక లక్ష్యంతో జంకూగొంకూ బొంకుతున్నారు. అబద్ధాల ప్రచారంలో ఆరితేరారు. ఇది చాలదన్నట్లు తెలంగాణలో ఇప్పుడు కవిత కూడా బలయుదేరారు. తాము అధికారంలో ఉన్నన్నాళ్ళూ గుర్తుకురాని బీసీలకు రాజ్యాధికారం, రిజర్వేషన్లు, పూలే విగ్రహాలు వంటివన్నీ కవిత నోటినుంచి తన్నుకు వస్తున్నాయి. అధికారమంటే దోచుకోవడమే అన్న చందంగా ఐదేళ్లు జగన్‌, పదేళ్లు బిఆర్‌ఎస్‌ నేతలు దోచుకున్న విషయాన్ని ప్రజలు ఇంకా మరచి పోలేదు.

అసలు ఏపీ విభజన జరిగిందే తమ ఆదాయాల పెంచడానికి అన్నట్లుగా ఇరు రాష్టాల్రను అప్పట్లో దోచారు. అప్పుల్లో ముంచేశారు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితికి తీసుకుని వచ్చారు. ఇసుక, మట్టి, క్వారీ, భూకబ్జాలు వంటివెన్నో చెప్పనక్కరలేదు. జర్నలిస్టులను అంటరానివారిగా చూసిన ఘనత ఈ ఇద్దరు నాయకులకే చెల్లింది. సీఎం ప్రజలను కలవాల్సిన అవసర మేముందని దబాయించిన నేతలు ఇప్పుడు నీతి దండకాలు చదువుతున్నారు.

మాజీలని అనిపించుకోవడానికి కూడా ఇష్టపడని, ప్రతిపక్షంలో కూర్చోవడానికి కూడా సిద్ధంగా లేని నేతల పార్టీల పని పట్టి, ప్రజలు గట్టి బుద్ధే చెప్పారు. ఎర్రవెల్లి ఫాం హౌస్ కి కేసీఆర్, బెంగుళూరు ప్యాలెస్ కు జగన్ పరిమితమయ్యారు. మల్లన్నసాగర్‌లో ప్రజల జీవితాలను ముంచేసిన కేసీఆర్‌ బృందం ఇప్పుడు మూసీ మురికి బాధితుల కోసం మొసలి కన్నీరు కారుస్తున్నారు. దోచుకోవడమే పాలన అన్నచందంగా సాగిన వీరి ఆగడాలను భరించలేకే ప్రజలు అధికారం నుంచి దించేశారు. సంక్షేమం పేరిట ప్రజలకు డబ్బు పందేరాలు సాగించి, అదే అభివృద్ధి అని నమ్మించి, ఎన్నికల్లో ఓటమి పాలైనా వీరికి జ్ఞానోదయం కలగినట్లు లేదు. మూసీ మురికి వదలకూడదు. బతుకమ్మ చీరలు, నిరుద్యోగులకు టోపీ పెట్టిన వైనాన్ని నిలదీయరాదు. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, కాళేశ్వరం, ధరణి అవినీతుల గురించి అడగరాదు. ఈ ఫార్ములా రేసులో డబ్బుల హవాలాపై కేసు పెట్టరాదు. ఇక ఇప్పుడు ఏపీలోనూ పోలీసు కేసులు, వేధింపులు, పత్రికా స్వేచ్ఛ అంటూ జగన్‌ అండ్‌ కో గగ్గోలు పెట్టడం చూస్తే జాలేస్తోంది. పార్టీల, మీడియా ముసుగులో రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే ముఠాలు బయలుదేరాయి. మీడియాకు కూడా ప్యాకేజీలతో మాయ చేసే, థాట్ పోలీసింగ్ మాయను ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నది మరువరాదు.

గతంలో అధికారాన్ని అడ్డు పెట్టుకుని అక్రమాలకు పాల్పడి, అవినీతికి తెగించి, ఆర్థిక విధ్వంసాలు సృష్టించిన వారిపై చర్యలు ఉండకపోతే భవిష్యత్తులో మరికొందరు బరి తెగిస్తారు. తమకేమీ కాదులే అన్న దీమా రాజకీయ నేతల్లోనే కాదు ఎవ్వరిలోనూ రాకూడదు. పాలనలో జవాబుదారీతనం, పారదర్శకత ఉండి తీరాలి. అయితే, అధికారంలో ఉన్న, లేని అన్ని పార్టీలు ఒకరిని ఒకరు పైకి విమర్శించినా, లోలోన సమర్ధించుకోవడం, సహకరించడమే రాజకీయాల్లో అత్యంత దారుణంగా, దయనీయంగా ఆందోళనకరంగా మారింది.

Latest News

ద్రవరూప రంగుల విల్లు|ADUGU|SPECIAL STORY|CANO CRYSTALS

కొలంబియాలోని ‘లిక్విడ్ రెయిన్‌బో’ కానో క్రిస్టేల్స్ అద్భుత గాథ! ప్రకృతి ఒడిలో దాగున్న వింతలు, విశేషాలు ఎప్పుడూ మానవాళిని మంత్రముగ్ధులను చేస్తూనే ఉంటాయి. మన భూగోళంపై నీలిరంగులో నిర్మలంగా పారే నదులు, అద్దంలా మెరిసే...

అగ్గి పెట్టెతోటే హాజరీ!?|ADUGU TRENDS

పాఠం సెప్పుడంటే పుస్తకం సూసి సదువుడు కాదు. గండ్లున్నదాన్నే వళ్లె యేసుడు కాదు. బెత్తెం పట్టుకుని, బట్టీ పట్టిచ్చుడు అసలే కాదు. గా పిల్లల మెదల్లకు మేతేసుడు. పదను పెట్టుడు. కొత్తగ ఆచరించుడు,...

పార్టీలకు, ప్రభుత్వాలకు ‘నీట్’ గా ఓ హెచ్చరిక!|EDITORIAL

సామాన్య పౌరులు ప్రారంభించిన చిన్న ఉద్యమాలకు దేశవ్యాప్త ఆదరణ లభించడం రాజకీయ పార్టీలకు ఒక గట్టి హెచ్చరిక. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సంప్రదాయ నాయకత్వంపై మాత్రమే ఆధారపడటం లేదు. కొత్త...

జూలై 28, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి చతుర్దశి సాయంత్రం 05.30 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం పూర్వాషాఢ మధ్యాహ్నం 01.31 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం విష్కంబ రాత్రి 12.49 వరకు ఉపరి ప్రీతి కరణం వణజి సాయంత్రం 05.30 వరకు ఉపరి...

ప్రకృతి వింత: నడిచే అడవి రహస్యం తెలుసా?|NATURE|FOREST

ప్రకృతి సృష్టించే వింతలు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అడవి అనగానే ఒకే చోట స్థిరంగా ఉండే వృక్షాలు గుర్తుకొస్తాయి. కానీ, చెట్లు ఒక చోటు నుండి మరొక చోటుకి నెమ్మదిగా నడుస్తూ కదులుతాయనే...

జూలై 27, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి త్రయోదశి మధ్యాహ్నం 03.35 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం మూల ఉదయం 11.00 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం వైధృతి రాత్రి 12.18 వరకు ఉపరి విస్కమ్బ కరణం తైతుల మధ్యాహ్నం 03.35 వరకు ఉపరి...

భరించేదే భార్య పో!?|ADUGU TRENDS

‘భరించేటోడే భర్త అన్నరు!’. ‘నిజానికి భరించేదే భార్య!!’ అనే గా సామెతకు గీమె సరిగ్గా సరిపోతది. పెనిమిటిని 180 కిలోమీటర్లు భుజానేసుకుని నడిశిన పెండ్లాన్ని మనమెక్కడైనా సూసినమా? కావాల్నంటే మీరే సూడుండ్రి. గీమె పేరు...

‘బొద్దింక’లు హిట్టా? ఫట్టా!?|EDITORIAL

విద్యార్థుల చదువు, పరీక్షలు, భవిష్యత్తుతో కూడిన అంశాలపై విశేష మద్దతు లభించడం సహజం. ఏ రాజకీయ పార్టీ అయినా ఉద్యమానికి మద్దతు పలకడం వేరు, ఆ ఉద్యమాన్నే హైజాక్ చేయడం వేరు. అలాగే...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూలై 26 నుండి ఆగష్టు 01 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం చేపట్టిన పనులు క్రమంగా విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహకారం...

ఒక్క ఏసీ మిషినీ, రొండు అర్రలకు సల్లదనం!?|ADUGU TRENDS

‘ఒక్క దెబ్బకు రెండు పిట్టలు!’. ‘ఒకే కాన్పుల ఇద్దరు పిల్లలు!! లెక్కనే’ గీ ‘ఒక్క ఏసీతో రెండు గదుల్ల సల్లదనమన్నట్లు!?’ అరె గదెట్ల? అనుకుంటాండ్రా? కావాల్నంటే ఇగో సూడుండ్రి. ఇగో గీ ఉపాయం ఏడ...

‘బొద్దింకే’ కదాని నిర్లక్ష్యం చేస్తే..!?|EDITORIAL

‘బొద్దింక’లే కదాని చులకనగా చూడొద్దు. వాటిని చంపినా మళ్ళీ అవి పుట్టుకు వస్తూనే ఉంటాయి. వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఉద్యమాలను అణచివేయవచ్చు. కానీ, సమస్యలను పరిష్కరించకపోతే కొత్త రూపాల్లో అసంతృప్తి మళ్లీ...

జూలై 25, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తొలి ఏకాదశి తిధి ఏకాదశి ఉదయం 11.38 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం అనురాధ ఉదయం 05.49 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం బ్రహ్మ రాత్రి 11.00 వరకు ఉపరి ఐంద్ర కరణం భద్ర ఉదయం 11.38...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News