Monday, March 16, 2026
29.3 C
Hyderabad

ట్రంప్ ఎఫెక్టుతో కల్లలైన కలల సౌధం!|EDITORIAL

ఇండియన్స్ కి అమెరికా డ్రీమ్ ల్యాండ్. ప్రపంచ స్థాయి విద్య, పరిశోధనావకాశాలు, ఉద్యోగావకాశాలు అమెరికాను ముఖ్య గమ్యస్థానంగా మార్చాయి. డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడయ్యాక, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు అమెరికా వీసాల జారీని క్లిష్టంగా, భయానకంగా మార్చేశాయి. కఠిన నిబంధనలు, అర్థంలేని ఆంక్షలు, సోషల్‌ మీడియా వెట్టింగ్‌, విదేశీ విద్యార్థులపై పెరుగుతున్న అనుమానాలు భారతీయ విద్యార్థుల ఆశలను అడియాశలు చేశాయి.

అమెరికాలో చదవాలన్న ఆశతో లక్షలాది మంది విద్యార్థులు అర్హత పరీక్షలు రాస్తారు. ట్రంప్ ఆంక్షల నేపథ్యంలో కరోనా టైమ్ ని మించి విద్యార్థులు చరిత్రలో అతి తక్కువ స్థాయిలో దరఖాస్తులు చేసుకున్నారు. సాధారణంగా మార్చి నుంచి జూలై వరకు అమెరికా వీసా సీజన్‌ అత్యంత కీలకం. ఫాల్‌ సెమిస్టర్‌కు సిద్ధమయ్యే విద్యార్థులు ఈ సమయంలో వీసాల కోసం పెద్ద ఎత్తున అప్లై చేస్తారు. అయితే ఈ ఏడాది మార్చి–మే మధ్యకాలంలో ఎఫ్‌–1 వీసాల జారీ 27 శాతం తగ్గిపోయింది. గతేడాది ఇదే సమయంలో 14,987 వీసాలు ఇవ్వగా, ఈ ఏడాది కేవలం 9,906 మాత్రమే జారీ చేశారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, కోవిడ్‌ మహమ్మారి తర్వాత ప్రయాణాలు పునః ప్రారంభమైన 2022లో జారీ చేసిన 10,894 వీసాలతో పోల్చినా ఈ ఏడాది సంఖ్య దానికంటే కూడా తక్కువే. ఒకప్పుడు కలల సౌధమైన అమెరికా, ఇప్పుడు భారతీయ విద్యార్థుల కల్లల సౌధంగా మిగిలిపోయింది.

ఈ పరిస్థితికి ప్రధాన కారణం ట్రంప్‌ తీసుకుంటున్న విదేశీ విద్యార్థి వ్యతిరేక నిర్ణయాలే. పాలస్తీనా కలహాలకు మద్దతుగా జరిగిన ఆందోళనల్లో పాల్గొన్న పలువురు విద్యార్థుల వీసాలను రద్దు చేయడం, సోషల్‌ మీడియా ఖాతాలను తప్పనిసరిగా పబ్లిక్‌ చేయాలని ఆదేశించడం, వీసా అప్లికేషన్‌లకు రెండు వారాలు పూర్తిగా బ్రేక్‌ వేయడం వంటి చర్యలు అంతర్జాతీయ విద్యార్థుల్లో అనిశ్చితిని పెంచాయి. ముఖ్యంగా ‘సోషల్‌ మీడియా వెట్టింగ్‌’ పేరుతో విద్యార్థుల వ్యక్తిగత జీవితం, భావ వ్యక్తీకరణలను పరిశీలించడం వంటి చర్యలు ప్రజాస్వామ్య దేశానికి అసమంజసం. మే 27 నుండి జూన్‌ 18 వరకు వీసా దరఖాస్తులను నిలిపివేయడం వల్ల అప్లికేషన్ల సంఖ్య మరింత తగ్గిపోయింది.

అమెరికా యూనివర్సిటీలకు ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల్లో కోతలు విధించడం మరో కోణం. అంతర్జాతీయ విద్యార్థులతో వచ్చే ఆదాయం తగ్గుతుందనే భయంతో యూనివర్సిటీలు కూడా అస్పష్టంగా ఉన్నాయి. విదేశీ విద్యార్థుల ఫీజులపై అమెరికా యూనివర్సిటీలు ఎక్కువగా ఆధారపడతాయి. కానీ ప్రభుత్వమే వారికి అడ్డంకులు పెడుతుండటంతో పరిస్థితి మరింత సంక్లిష్టమవుతోంది.

ఒకప్పుడు చైనాను మించి అమెరికాలో అత్యధికులుగా ఉన్న భారతీయ విద్యార్థులు ఇప్పుడు వెనక్కి తగ్గుతున్నారు. 2023–24 అకడమిక్‌ ఇయర్‌లో అమెరికాలో చదువుకునే విదేశీ విద్యార్థుల్లో భారతీయులు అగ్రస్థానంలో ఉన్నారు. 2024లో అదే వీసా సంఖ్య భారీగా పడిపోయింది. 2023లో 1.03 లక్షల ఎఫ్‌–1 వీసాలు ఇవ్వగా, 2024లో జనవరి నుంచి సెప్టెంబర్‌ వరకు 64,008 మాత్రమే జారీ చేశారు.
ఈ పరిణామాలు అమెరికాలో చదవాలని ప్లాన్ చేస్తున్న భారతీయ విద్యార్థులకు గట్టి హెచ్చరిక. వీసా నిరాకరణలు పెరగడం, ఇంటర్వ్యూలలో కఠిన ప్రశ్నలు, కొత్త ఆంక్షలు వంటివన్నీ విద్యార్థుల మానసిక ఒత్తిడిని పెంచుతున్నాయి. అర్హత ఉన్నా, అడ్మిషన్‌ ఉన్నా వీసా లభిస్తుందనే హామీ లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది.

ఈ పరిస్థితుల్లో భారత ప్రభుత్వం విదేశీ విద్యాభ్యాసం కోసం అమెరికా మీద ఆధారాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవాలి. ఇండియన్ యూనివర్సిటీల్లో గ్లోబల్‌ స్థాయికి దగ్గరగా ఉండే కోర్సులు, పరిశోధన వాతావరణం, అంతర్జాతీయ ప్రమాణాలు పెంచాలి. విశాల ప్రపంచంలో దేశాల మధ్య దూరం, అంతరం తగ్గిపోతున్న తరుణంలో అమెరికా కుత్సిత ఆలోచనలు మానాలి. విద్యను వ్యక్తిగత, రాజకీయాల బారిన పడనీయకూడదు. విద్యార్థులు దేశాల మధ్య సామాజిక, సాంస్కృతిక సారథులు, వంతెనలు. వారిపై ఆంక్షలు విధించడం అమెరికా సహా, భవిష్యత్‌ తరాలకు తీరని నష్టం. విద్యకు కావాల్సింది ఆటంకాలు కాదు, అవకాశాలు.

Latest News

16-03-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి ద్వాదశి ఉదయం 07.43 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం ధనిష్ఠ రాత్రి తెల్ల 05.09 వరకు ఉపరి శతభిషం యోగం శివ ఉదయం 08.15 వరకు ఉపరి సిద్ద కరణం తైతుల ఉదయం...

ఇంట, వంట, పంట, పయానం అన్నీ గా ట్రాక్టరే!?|ADUGU TRENDS

ఉపాయం లేనోన్ని ఊల్లెనే ఉండనీయొద్దట! గందుకే ఉపాయమున్న గీయినె, ఊల్లు తిరుగుతాండు!! ఊల్లు తిరుగుడంటే, ఊల్లు పట్టుకుని తిరుగుతాండని కాదుల్లా... ఇట్టమైన ఊల్లని ఏ కట్టం లేకుండా తిరుగుతాండు. గదెట్లంటరా? ఇగో మీరే...

బడ్జెట్ : ప్రజాకాంక్షలను ప్రతిబింబించేనా!?|EDITORIAL

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు రాష్ట్ర రాజకీయ వర్గాలనేగాక, సాధారణ ప్రజల్లో కూడా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. రాష్ట్రంలోని రైతులు, ఉద్యోగులు,...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

మార్చి 15 నుండి మార్చి 21 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి పనుల్లో కొంత ఒత్తిడి ఉన్నా చివరికి మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఉద్యోగంలో మీ...

ఈవీలేవీ? ఈవీలపై క్లారిటీలేవీ?|EV|TELANGANA|CM|GOVERNMENT

మొన్న సీఎం|CM|REVANTH REDDY, నిన్న డిప్యూటీ సీఎం|DEPUTY CM|BHATTI VIKRAMARKA MALLU ప్రకటనల సారాంశమేంటి?|SUMMARY ప్రస్తుత వాహనాలనేం చేస్తారు?|OLD VEHICLES కొత్తవి సరే, పాతవాటి పరిస్థితేంటి? ఇప్పటికే తుప్పుపట్టిన వాహనాల సంగతేంటి? ఇం‘ధన’ ఖర్చు తగ్గించడానికి వేల కోట్ల వ్యయమా? ఉన్న...

ఎలుకలు రాకుండ అదిరే శిట్కా!?|ADUGU TRENDS

ఎలుక సొర్రిందని ఇల్లు తగుల బెట్టుకుంటమా? ఏంది? యెట్లన్న శేసి గా ఎలుకను బయిటికి తోలుతం. ఇల్లును మాత్రం మంచిగ కాపాడుకుంటం. మరైతే ఇంట్లకు ఎలుకలు రాకుండ ఏం శేయాల్నో, ఎట్లెట్ల శేయాల్నో...

రాహుల్ పరిపక్వ విపక్ష నేతేనా!?|EDITORIAL

భారత రాజకీయాల్లో విపక్ష నాయకత్వం ఎప్పుడూ ప్రజాస్వామ్య పరిరక్షణకు అత్యంత కీలకం. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, విధానాలను సమీక్షించడం, ప్రత్యామ్నాయ మార్గాలను చూపడం, అవసరమైన సూచనలు చేయడం, తద్వారా ప్రభుత్వాన్ని గాడిలో పెట్టడం విపక్షం...

14-03-2026, శనివారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి ఏకాదశి పూర్తిగ రోజంత నక్షత్రం ఉత్తరాషాఢ రాత్రి 02.53 వరకు ఉపరి శ్రవణ యోగం వరీయాన్ ఉదయం 09.01 వరకు ఉపరి పరిఘ కరణం బవ సాయంత్రం 06.24 వరకు ఉపరి బాలవ రాహుకాలం...

ముగిసిన యువకుడి అంత్యక్రియలు|PALAKURTHI

పుత్రశోకంలో కన్నతల్లి కన్నీటి వీడ్కోలు ఘన నివాళులు అర్పించిన పాలకుర్తి విధి ఆడిన వింత నాటకంలో ఒక కన్నతల్లికి అంతకన్నా దౌర్భాగ్య స్థితి మరొకటి ఉండదు. కొడుకే లోకమని, తనే తన సర్వస్వమని బతికిన ఆ...

గాలి మోటర్ల.. గా అత్తగారింటికి!?|ADUGU TRENDS

అత్తగారింటికి దారేది? అంటే గాల్లో తేలినట్లు ఏకంగా గాలి మోటర్లనే తీసుకపోయి, సూసెటోల్ల గుండె పేలినట్టు శేసిండో పెండ్లి కొడుకు. గీ మద్దెల పండ్లిల్లకు ఇరగమరగ కర్సు సేత్తాండ్లు. ఎంత ఎక్కువ కర్సు శేస్తే,...

సాగు బాగుకు ఇదే సరైన సమయం!|EDITORIAL

ప్రపంచ రాజకీయ పరిణామాలు, పశ్చిమాసియాలో యుద్ధాలు, అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థను ప్రగాఢంగా ప్రభావితం చేస్తున్నాయి. ఎగుమతులు, దిగుమతులు తీవ్ర అంతరాయానికి గురవుతున్నాయి. ఈ సమయాన్ని భారత్ తన ఆహార భద్రత, వ్యవసాయ రంగాన్ని...

13-03-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి దశమి రాత్రి తెల్ల 05.47 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం పూర్వాషాఢ రాత్రి 01.02 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం వ్యతీపాత ఉదయం 08.53 వరకు ఉపరి వరీయాన్ కరణం వణజి సాయంత్రం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News