Wednesday, September 16, 2026
30.2 C
Hyderabad

మత్తుమాఫియాపై ముప్పేట దాడి!|EDITORIAL

మాదకద్రవ్యాల వినియోగం విచ్చలవిడిగా విస్తరిస్తోంది. నిఘా పెరిగింది. అక్కడక్కడా అడపాదడపా గంజాయి, ఇతర మత్తు పదార్థాల ముఠాలను పట్టుకుంటున్నారు. కానీ, ఆ మాఫియా గుట్టు రట్టవుతున్నా, మట్టు పెట్టడమే సాధ్యమవడంలేదు. ఎక్కడో ఒకచోట పట్టుబడితే, అంతకుమించి మరోచోట రవాణా కొనసాగుతోంది. ఇది కేవలం చట్టానికి మాత్రమే కాదు, సమాజానికే సవాల్ గా మారిన సంక్షోభం.
ఇటీవల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జరిగిన కొన్ని ఘటనలు ఈ సమస్య తీవ్రతను వెల్లడిస్తున్నాయి. ఏపీలోని మదనపల్లెలో బాలికపై జరిగిన దారుణం, నెల్లూరులో ప్రజాకళాకారుడు పెంచలయ్య హత్య, తెలంగాణలోని నిజామాబాద్ లో ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యపై జరిగిన దాడి, ఆమె మరణం వంటి సంఘటనల వెనుక మత్తు మాఫియా దౌర్జన్యమే ప్రస్ఫుటమవుతోంది. మత్తు మనిషిలోని విచక్షణను హరించి, నేరానికి దారి తీస్తోందని ఈ ఘటనలు హెచ్చరిస్తున్నాయి.

గత రెండు దశాబ్దాల కాలంలో దేశవ్యాప్తంగా పట్టుబడిన మాదకద్రవ్యాల పరిమాణం విపరీతంగా పెరిగింది. వేల కోట్ల విలువైన, లక్షల కిలోల మత్తు పదార్థాలు పట్టుపడుతున్నాయి. దీన్ని బట్టి మత్తు పదార్థాల వినియోగం ఏ స్థాయిలో విస్తరించిందో ఊహించవచ్చు. స్కూల్ ఏజీ పిల్లల నుంచి యువత వరకూ మత్తు బారిన పడుతున్నారన్న నివేదికలు భవిష్యత్తు సమాజంపై భయాందోళనలు కలిగిస్తున్నాయి. మత్తుకు బానిసైన యువత తమ భవిష్యత్తును తామే నాశనం చేసుకుంటున్నారు.

నిజానికి మత్తు, మాదకద్రవ్యాల సమస్యను కేవలం పోలీసు చర్యలతోనే ఎదుర్కోలేం. ఇంకా కఠిన చట్టాలు అవసరం. అంతర్జాతీయ, అంతర్రాష్ట్ర రవాణా మార్గాలపై నిఘా పెరగాలి. రాష్ట్రాలు, కేంద్ర సంస్థలు సమన్వయంతో పనిచేయాలి. ముఖ్యంగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, తెలంగాణ పోలీస్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ వంటి సంస్థలు సమగ్ర కార్యాచరణతో దూకుడు పెంచాలి.

ఈ దుష్ప్రభావానికి సమాజంలో పెరుగుతున్న నేర ప్రవృత్తి, ఈజీగా డబ్బు సంపాదన, నిరుద్యోగం, ఆకలి, అవసరాలు కూడా కారణాలు. వేగంగా డబ్బు సంపాదించాలి, బాగా ఎంజాయ్ చేయాలనే ఆశతో కొందరు యువకులు ఈ వ్యాపారంలోకి దిగుతున్నారు. ఉపాధి అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు విస్తరించాలి. యువతకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపించకుండా కేవలం శిక్షలతో సమస్యను అణచివేయడం సాధ్యం కాదు. ఇవ్వాళ జైలుకెల్లిన వాళ్లు రేపు విడుదలై తిరిగి అదే పనిలో నిమగ్నమవుతున్నారు.

ఇక మత్తుకు బానిసలైన వారిని నేరస్తులుగా కాకుండా బాధితులుగా చూడాలి. ప్రతి జిల్లాలో డీ-అడిక్షన్ కేంద్రాలు ఏర్పాటు చేసి, సకాలంలో వైద్య సహాయం అందించాలి. మత్తు వినియోగం మొదట సరదాగా మొదలై, తరువాత శారీరక, మానసిక వ్యవస్థలను క్రమంగా దెబ్బతీస్తుంది. కుటుంబాలు ఛిన్నాభిన్నం అవుతున్నాయి. ఆర్థికంగా, సామాజికంగా పతనం జరుగుతోంది. కాబట్టి పునరావాస విధానాలు సమర్థంగా అమలవ్వాలి.

రాజకీయ వ్యవస్థ కూడా తన బాధ్యతను గుర్తించాలి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా, మత్తు ముఠాలకు రాజకీయ అండదండలు లభించడం నిజమైతే అత్యంత ప్రమాదకరం. అన్ని రాజకీయ పార్టీలూ కలిసి మాదకద్రవ్యాల వ్యాపారంతో సంబంధం ఉన్నవారిని వెలివేయాలి. ఈ విషయంలో రాజకీయం మించి సామాజిక ప్రయోజనం ప్రధానంగా నిలవాలి.

విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు అత్యవసరం. స్కూలు స్థాయిలోనే పిల్లలకు మత్తు ప్రమాదాలపై బోధించాలి. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. కాలేజీల్లో నిఘా పెరగాలి. మీడియా సంచలనాత్మక వార్తలకే పరిమితం కాకుండా అవగాహన సృష్టించే కార్యక్రమాలు చేపట్టాలి.

మాదకద్రవ్యాలపై సమాజం మొత్తం కలిసిరావాలి. సరఫరాను అరికట్టడమే కాదు, డిమాండ్‌ లేకుండా చేయాలి. ఉపాధి, అవగాహన, కఠిన చట్ట అమలు, పునరావాసం వంటి అంశాలపై సమగ్ర కార్యాచరణ చేపట్టాలి.

Latest News

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

మోదీ 25ఏళ్ళ ప్రస్థానం బీజేపీ ప్రచార వ్యూహం!?|EDITORIAL

మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ రూపొందించిన కార్యాచరణలో ప్రజల వద్దకు వెళ్లడం మాత్రమేనా? లేక ప్రజల మాట వినడం కూడా జరుగుతుందా? రాబోయే ఎన్నికల రాజకీయాల్లో ఈ తేడానే...

సెప్టెంబర్ 16, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పంచమి ఉదయం 08.28 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం విశాఖ రాత్రి 06.02 వరకు ఉపరి అనురాధ యోగం వైధృతి పగలు 02.11 వరకు ఉపరి విస్కమ్బ కరణం బాలవ ఉదయం 08.28...

సెప్టెంబర్ 15, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు చవితి ఉదయం 06.59 వరకు ఉపరి పంచమి నక్షత్రం స్వాతి సాయంత్రం 04.18 వరకు ఉపరి విశాఖ యోగం ఐంద్ర పగలు 02.21 వరకు ఉపరి వైధృతి కరణం భద్ర ఉదయం 06.59...

సెప్టెంబర్ 14, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం వినాయక చవితి https://www.instagram.com/reel/DdPKUAqysmC/?stkn=Nmxzdnc3NDB4ejNn తిధి శు తదియ ఉదయం 07.00 వరకు ఉపరి చవితి నక్షత్రం చిత్త పగలు 03.05 వరకు ఉపరి స్వాతి యోగం బ్రహ్మ పగలు 02.54 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం...

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

గుప్తుల సమాజం|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL|HISTORY

గుప్తుల సామ్రాజ్యం అనేక రాష్ట్రాలుగా విభజించబడింది. ఈ రాష్ట్రాలను భుక్తులు అని పిలిచేవారు. ఒక భుక్తి యొక్క ముఖ్య అధికారిని ఉపారిక అన్నారు. ఈ భుక్తులను విషయాలుగా (జిల్లాలుగా) విభజించారు. ఒక విషయం...

గీ ఊర్లల్ల యేడ సూసినా, యేడి నీల్లే!?|ADUGU TRENDS

గా ఊర్లల్ల భూమి కింద మంట పెట్టినట్లు... అదే పనిగ కట్టెలెగేస్తున్నట్లు... కరెంటుతో గీజరేసినట్లు... యేడి నీల్లు ఉబికి వత్తయి.! ఒకేళ వాన పడ్డా సరే, పెనం మీద నీల్లు పోసినట్లు భూమి...

ప్రపంచానికి బ్రిక్స్ సరికొత్త దశాదిశ!?|EDITORIAL

ఢిల్లీ సదస్సు బ్రిక్స్ కు కొత్త దిశను సూచిస్తోంది. ప్రపంచ పాలనలో సంస్కరణలు, గ్లోబల్ సౌత్‌కు గొంతుక, ఆర్థిక సంస్థల్లో సమాన ప్రాతినిధ్యం వంటి లక్ష్యాలు స్వాగతించదగినవే. అయితే, తీర్మానాల అమలే అసలు...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 13 నుండి సెప్టెంబర్ 19 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి పనుల్లో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం...

గీ బూచోడు, ఎంత మంచోడో!?|ADUGU TRENDS

మనుసుల్లో మంచి మనుసులున్నట్లే.. దొంగల్ల కూడ మంచి దొంగలుంటారని నిరూపించాడో దొంగ. తను దోసుకున్న దేవుడి నగలే కాదు, వాటిని మరమ్మతు సేయడానికి కొంత నగదు కూడా పెట్టి, దేవుడా శమించు... తప్పైందని...

వానల్లేక అన్నదాతల విలవిల!?|EDITORIAL

వర్షం పడటం ప్రకృతి చేతిలో ఉండొచ్చు. కానీ వర్షం పడకపోయినా రైతును కాపాడే వ్యవస్థను నిర్మించడం మాత్రం పాలకుల చేతుల్లోనే ఉంది. వరుణుడి కోసం ఎదురుచూస్తూ చేతులు ముడుచుకుంటే కరువు ముప్పు మరింత...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News