Monday, August 10, 2026
27.5 C
Hyderabad

నీట్-అణచివేతే పరిష్కారం కాదు!|EDITORIAL

దేశ జనాభాలో 65%నికి పైగా 35ఏళ్ళ లోపు వాళ్ళే. ప్రపంచంలో అత్యధిక యువ జనాభా కలిగిన దేశంగా భారత్‌కు గొప్ప అవకాశం. అయితే ఇదే యువత ఉద్యోగాలు, పారదర్శక నియామకాలు, నాణ్యమైన విద్య, సమాన అవకాశాల కోసం ఆందోళన చెందడం ఆలోచించాల్సిన విషయం. ఉద్యోగాల కొరతతో పాటు నియామకాలలో ఆలస్యం, పరీక్షల రద్దు, పేపర్ లీకేజీలు యువతలో నిరాశను మరింత పెంచుతున్నాయి.

యువత ఆగ్రహాన్ని అణచివేయడం పరిష్కారం కాదు. వారి ప్రశ్నలకు సమాధానం చెప్పడమే నిజమైన పాలనా బాధ్యత. అధికార, ప్రతిపక్షమన్న తేడా లేకుండా ప్రతి రాజకీయ శక్తి యువత భవిష్యత్తును రాజకీయ ప్రయోజనాల కంటే ఉన్నతంగా చూడాలి. పార్లమెంట్‌లో చర్చలు జరగాలి. ప్రజలకు నిజాలు తెలియాలి. తప్పు చేసినవారు ఎవ్వరైనా చట్టం ముందు జవాబుదారీగా నిలవాలి. యువత ఆక్రోశాన్ని రాజకీయ నినాదంగా కాకుండా ఒక హెచ్చరికగా గుర్తించాలి. లేకపోతే ఈ అసంతృప్తి మరింత విస్తరించి, భవిష్యత్తులో పెద్ద సామాజిక ఉద్యమాలకు దారితీసే అవకాశాన్ని విస్మరించలేం.

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్

దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉంటుందని ప్రతి రాజకీయ నాయకుడు చెబుతుంటాడు. కానీ అదే యువత వీధుల్లోకి వచ్చి తమ భవిష్యత్తుపై ప్రశ్నలు సంధించినప్పుడు నేతలు, అధికార యంత్రాంగం స్పందించే తీరు మాత్రం విభిన్నంగా ఉంటోంది. ఇటీవల నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వివాదం, దేశవ్యాప్తంగా విద్యార్థుల నిరసనలు, పార్లమెంట్‌లో నెలకొన్న ప్రతిష్ఠంభన కీలక ప్రశ్నలను మరోసారి తెరపైకి తీసుకొచ్చాయి. యువతలో పెరుగుతున్న అసహనం, అసంతృప్తిలకు కేవలం రాజకీయ సమాధానాలు సరిపోవు. వ్యవస్థాగత సంస్కరణలే శాశ్వత పరిష్కారం.

జాతీయ స్థాయిలో వైద్య విద్యలో ప్రవేశానికి నిర్వహించే నీట్ పరీక్షను ప్రతి ఏడాది 24 లక్షల మంది విద్యార్థులు రాస్తున్నారు. లక్షలాది కుటుంబాల ఆశలు, సంవత్సరాల శ్రమ, కోట్లాది రూపాయల ఖర్చు ఈ ఒక్క పరీక్షపై ఆధారపడి ఉంటుంది. అలాంటి పరీక్షలో ప్రశ్నాపత్రం లీక్ కావడం కేవలం పరీక్షా నిర్వహణలో వైఫల్యం మాత్రమే కాదు. అది విద్యా వ్యవస్థపై విద్యార్థుల నమ్మకాన్ని దెబ్బతీసే ఘటన. అందుకే ఈ అంశంపై విద్యార్థుల ఆగ్రహాన్ని చిన్న సమస్యగా చూడడం సమంజసం కాదు.

పార్లమెంట్‌లో తీవ్ర చర్చ జరగాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. ప్రభుత్వం కూడా దర్యాప్తు, అరెస్టులు, చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పినప్పటికీ, ప్రజల సందేహాలను నివృత్తి చేసేలా పారదర్శక వివరణ ఇవ్వాల్సిన బాధ్యత పాలకులపై ఉంది. అదే సమయంలో ప్రతిపక్షాలు కూడా చర్చ జరిగేలా సహకరించడం అవసరం. నిరసన ఎంత ముఖ్యమో, చర్చ కూడా అంతే ముఖ్యం.

దేశంలో పేపర్ లీకేజీల సమస్య కొత్తది కాదు. గత పదేళ్లలో 150కు పైగా పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని పార్లమెంట్‌లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. యూపిఎ హయాంలోనూ లీకులు జరిగాయి. అనేక పరీక్షలు రద్దు కావడం, మళ్లీ నిర్వహించాల్సి రావడం, లక్షలాది మంది అభ్యర్థులు ఇబ్బందులు పడటం మాత్రం వాస్తవం. ప్రతి పరీక్ష రద్దు వెనుక వేలాది కుటుంబాల ఆర్థిక భారం, నెలల తరబడి చేసిన శ్రమ, మానసిక ఒత్తిడి ఉంటాయి.

దేశ జనాభాలో 65%నికి పైగా 35ఏళ్ళ లోపు వాళ్ళే. ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా కలిగిన దేశంగా భారత్‌కు గొప్ప అవకాశం. అయితే ఇదే యువత ఉద్యోగాలు, పారదర్శక నియామకాలు, నాణ్యమైన విద్య, సమాన అవకాశాల కోసం ఆందోళన చెందడం ఆలోచించాల్సిన విషయం. అంతర్జాతీయ కార్మిక సంస్థ నివేదికల ప్రకారం యువ నిరుద్యోగం భారతదేశానికి ప్రధాన సవాల్. ఉద్యోగాల కొరతతో పాటు నియామకాలలో ఆలస్యం, పరీక్షల రద్దు, పేపర్ లీకేజీలు యువతలో నిరాశను మరింత పెంచుతున్నాయి.

జంతర్ మంతర్ లో జరిగిన విద్యార్థుల నిరసనలు కూడా ఇదే అసంతృప్తికి ప్రతిబింబం. సామాజిక మాధ్యమాల ద్వారా స్వచ్ఛందంగా సమీకరించిన వేలాది మంది యువత పాల్గొనడం, మహిళల భాగస్వామ్యం అధికంగా ఉండడం, రాజకీయ పార్టీలకు అతీతంగా విద్యార్థులు తమ సమస్యలను వ్యక్తపరచడం కొత్త సామాజిక పరిణామం. ప్రతి నిరసన వెనుక రాజకీయ కోణం వెతకడం కంటే, ఆ నిరసనకు దారితీసిన కారణాలను అర్థం చేసుకోవడం పాలకుల బాధ్యత.

అవినీతి కూడా ఈ సంక్షోభానికి మరో మూల కారణం. ప్రశ్నాపత్రాల లీకేజీలు, నియామకాలలో అవకతవకలు, లంచగొండితనం వంటి ఘటనలు ఆయా వ్యవస్థలపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయి. అవినీతి నిరోధక చట్టాలను మరింత సమర్థంగా అమలు చేయడం, దర్యాప్తు సంస్థలకు స్వతంత్రత కల్పించడం, వేగవంతమైన విచారణలు నిర్వహించడం, దోషులకు కఠిన శిక్షలు విధించడం అవసరం. అయితే శిక్షల విషయంలో రాజ్యాంగం, న్యాయవ్యవస్థ నిర్దేశించిన ప్రమాణాలు, మానవ హక్కుల సూత్రాలకు అనుగుణంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.

విద్యా వ్యవస్థలో సమూల సంస్కరణలు కూడా అత్యవసరం. పరీక్షల నిర్వహణలో అత్యాధునిక సాంకేతికత వినియోగం, ప్రశ్నాపత్రాల భద్రత, డిజిటల్ పర్యవేక్షణ, బాధ్యులపై వేగవంతమైన చర్యలు, పరీక్షా సంస్థల జవాబుదారీతనం పెంపు వంటి చర్యలు చేపట్టాల్సిన సమయమది. అలాగే నియామక ప్రక్రియలు నిర్ణీత కాలపట్టికలో పూర్తి చేయడం ద్వారా యువతలో నమ్మకాన్ని పునరుద్ధరించాలి.

యువత ఆగ్రహాన్ని అణచివేయడం పరిష్కారం కాదు. వారి ప్రశ్నలకు సమాధానం చెప్పడమే నిజమైన పాలనా బాధ్యత. అధికార, ప్రతిపక్షమన్న తేడా లేకుండా ప్రతి రాజకీయ శక్తి యువత భవిష్యత్తును రాజకీయ ప్రయోజనాల కంటే ఉన్నతంగా చూడాలి. పార్లమెంట్‌లో చర్చలు జరగాలి. ప్రజలకు నిజాలు తెలియాలి. తప్పు చేసినవారు ఎవ్వరైనా చట్టం ముందు జవాబుదారీగా నిలవాలి. యువత ఆక్రోశాన్ని రాజకీయ నినాదంగా కాకుండా ఒక హెచ్చరికగా గుర్తించాలి. లేకపోతే ఈ అసంతృప్తి మరింత విస్తరించి, భవిష్యత్తులో పెద్ద సామాజిక ఉద్యమాలకు దారితీసే అవకాశాన్ని విస్మరించలేం.

Latest News

ఆగస్టు 10, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి ద్వాదశి ఉదయం 06.13 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం ఆరుద్ర ఉదయం 11.53 వరకు ఉపరి పునర్వసు యోగం వజ్ర రాత్రి 11.10 వరకు ఉపరి సిద్ది కరణం తైతుల ఉదయం 06.13 వరకు ఉపరి...

బోనాలు – చరిత్ర, సంస్కృతి, సంప్రదాయం|BONALU|HISTORY|CULTURE

చారిత్రక, పురావస్తు, శాసన, సాహిత్య ఆధారాల విశ్లేషణ ప్రకారం బోనం సమర్పించే ఆచారం ఆషాఢ మాసంలో తెలంగాణతో పాటు దక్షిణ భారతదేశంలోని అనేక గ్రామాల్లో గ్రామదేవతారాధనలో అంతర్భాగంగా కొనసాగుతోంది. వర్షాకాలం ప్రారంభ దశలో...

కల్లుకు శిల్లు.. సీసీ కెమెరా!?|ADUGU TRENDS

యెన్కటికి దొంగకు శెప్పే లాభమన్నరు. దోసుకుంటోనికి శెప్పైనా, తప్పైనా ఒకటే. పడదలే సూసుకుంటడు. గట్లనే గీ మద్దెల దొంగలు తమ రూటు మార్సుకున్నరు. కంటికి కనుకు లేకుండా ఇంటికి కన్నాలేసుడు అసొంటివి మానేసిండ్రు....

రాహుల్ ముందున్న మార్గాలివే!?|EDITORIAL

రాహుల్‌ ముందున్నది ‘బొద్దింకలను బుట్టలో వేసుకోవడం’ కాదు. యువత నమ్మకాన్ని సంపాదించడం. ఆ నమ్మకం ఒక్క ఆందోళనతో రాదు. నిరంతర పోరాటం, స్పష్టమైన విధానాలు, ప్రత్యామ్నాయ పాలనా నమూనా, విశ్వసనీయ నాయకత్వం కావాలి....

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఆగస్టు 09 నుండి ఆగస్టు 15 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశివారికి అనుకూలమైన మార్పులు చోటుచేసుకుంటాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. మీ పనితీరుకు ఉన్నతాధికారుల...

నవ్వినోల్లే నోర్లెల్లబెట్టిండ్రు!?|ADUGU TRENDS

సంకల్పించాలె కనీ, కాని పని ఉంటదా? ఉండనే ఉండదని నిరూపించిండు గీ పెద్దాయినె. నల్గురు సూసి నవ్వినా, నా పని నేను శేసుక పోతానని, శేసి సూపిండు. గీయినె పేరు హీలియో డా సల్వా....

క్యా బోల్తే… పాలక్!?|EDITORIAL

దేశ భవిష్యత్తు యువతే. ఆ యువత ప్రశ్నిస్తే వినాలి, సూచిస్తే ఆలోచించాలి, సమస్యలు చెబితే పరిష్కరించాలి. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలంటే అధికారానికి సమాంతరంగా జవాబుదారీతనాన్ని పెంపొందించే స్వతంత్ర ప్రజా వేదికలు అవసరం. ప్రజల...

ఆగస్టు 08, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి దశమి ఉదయం 11.09 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం రోహిణీ మధ్యాహ్నం 03.15 వరకు ఉపరి మృగశిర యోగం ధ్రువ ఉదయం 08.20 వరకు ఉపరి వ్యాఘాత కరణం భద్ర ఉదయం 11.09 వరకు ఉపరి...

ఇగిప్పుడు ‘సావు’కొచ్చింది!?|ADUGU TRENDS

మన ఊర్లల్ల ఎవ్వలన్న కాలం శేసిండ్రంటేనే సూసొత్తం. కనికరం సూపి తలో సెయ్యేత్తం. దిక్కూమొక్కూలేనోల్లతై మనమే తలా ఇంతేసుకుని గాయింత ఇగ గా కట్టెల్లేసొత్తం. కానీ, తలకొరివి పెట్టాల్సిన కన్న బిడ్డలే కడసారి...

శ్రద్ధేది? శుద్ధ దండగ!?|EDITORIAL

2025 వర్షాకాల సమావేశాల్లో నిర్ణయించిన సమయంలో లోక్‌సభ కేవలం 29%, రాజ్యసభ 34% మాత్రమే పనిచేశాయి. ప్రశ్నోత్తరాల సమయంలో లోక్‌సభలో కేవలం 23%, రాజ్యసభలో 6% మాత్రమే పని జరిగింది. అదే సమావేశాల్లో14...

ఆగస్టు 07, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి నవమి మధ్యాహ్నం 01.29 వరకు ఉపరి దశమి నక్షత్రం కృత్తిక సాయంత్రం 04.48 వరకు ఉపరి రోహిణీ యోగం వృద్ధి ఉదయం 11.17 వరకు ఉపరి ధ్రువ కరణం గరజి మధ్యాహ్నం 01.29 వరకు ఉపరి...

మౌర్య పూర్వయుగం|ADUGU SPECIAL|HISTORY|COMPITITIVE EXAMS

క్రీ.పూ.650 నుండి క్రీ.పూ.250 మధ్య ఉన్న కాలాన్ని మౌర్యుల పూర్వయుగం లేదా బుద్ధుని యుగం లేదా షోడశ మహాజనపాదాల యుగం అని అంటారు. ఈ కాలంలో గౌతమ బుద్ధుడు ముఖ్య పురుషుడు కాబట్టి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News