Monday, August 17, 2026
25.5 C
Hyderabad

ఏర్పాట్లు ఎలా ఉన్నాయి!?|MEDARAM|SAMMAKKA SARALAMMA

మేడారంలో భక్తులతో మంత్రుల మాటామంతీ

అమ్మవార్లను దర్శించుకున్న మంత్రి పొంగులేటి కుటుంబం

తెలంగాణలో ప్రఖ్యాతి పొందిన మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతర ఘనంగా సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం జాతర నిర్వహణను పర్యవేక్షిస్తూ, భక్తులకు ఏ పొరపాటూ కలగకుండా ఏర్పాట్లు చేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. గురువారం ఉదయం, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరియు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ టి.ఎస్. దివాకర్, ఇతర అధికారులతో కలిసి బైక్‌లపై మేడారం జాతర ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ సందర్బంగా, మేడారం జంపన్న వాగు వద్ద భక్తుల పుణ్యస్నానాలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఘాట్లు, నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య పనులపై మంత్రులు గమనించారు. పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రతను అధికాధికారులు తనిఖీ చేశారు. అనంతరం, కన్నెపల్లి సర్కిల్ వద్ద ట్రాఫిక్ ఏర్పాట్లను పరిశీలించి, పెరుగుతున్న రద్దీని నియంత్రించేందుకు కొంత మార్గదర్శనం చేశారు. జంపన్న వాగు వద్ద భక్తులతో మాట్లాడి ఏర్పాట్ల గురించి ప్రశ్నించారు.

 

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. మహా జాతర సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్న దృష్ట్యా, తప్పిపోయిన వారిని వారి కుటుంబాలకు చేరవేయడానికి ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశారు. జాతర ప్రాంతంలో పరిశుధ్ధతకు ప్రాధాన్యత ఇచ్చి వ్యర్థాలను తరచుగా తొలగిస్తున్నారు. అమ్మవారి గద్దెల వద్ద ప్రత్యేక శానిటేషన్ సిబ్బంది నియమించి, భక్తులు సమర్పించే బెల్లం, మొక్కలు మొదలైన వాటిని వెంటనే తొలగిస్తున్నారు.

సారలమ్మ రాకతో మేడారంలో భక్తుల సంఖ్య మరింత పెరిగింది. జంపన్న వాగులో పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులు సందడి చేస్తున్నారు. క్యూ లైన్లు పతాకంగా తిరుగుతున్నాయి; మేడారం మొత్తం భక్తులతో నిండిపోయింది. నేడు సమ్మక్క తల్లి చిలకగుట్ట నుండి ఆలయ ప్రాంగణానికి రానున్న నేపథ్యంలో మరింత రద్దీ ఏర్పడనున్నదని అధికారులు అంచనా వేస్తున్నారు. సమ్మక్క ప్రతిష్ట అనంతరం భక్తుల సంఖ్య పెరగనుందని చెప్పారు.

సాయంత్రం చిలకగుట్ట నుండి సమ్మక్క తల్లిని ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య, మాల్యాల సత్యం, సిద్ధబోయిన మునిందర్, సిద్ధబోయిన బొక్కన్న, కొమ్ము స్వామి, కొమ్ము జనార్ధన్ కలిసి తీసుకురానున్నారు. ఇప్పటికే చిలకగుట్ట నుండి ఆలయ ప్రాంగణం వరకు రోప్ పార్టీ ట్రయల్ రన్ పూర్తయ్యింది. భక్తుల భద్రత కోసం పోలీస్, రెవెన్యూ, ఎండోమెంట్స్, అగ్నిమాపక, వైద్య శాఖలు తయారిగా ఉంటున్నాయని జిల్లా యంత్రాంగం తెలిపింది.

Latest News

ఆగస్టు 17, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం నాగ పంచమి గరుడ పంచమి తిధి శు.పంచమి సాయంత్రం 06.43 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం హస్త ఉదయం 06.40 వరకు ఉపరి చిత్త యోగం సాధ్య ఉదయం 07.51 వరకు ఉపరి శుభ కరణం బవ ఉదయం...

గా ఊల్లె తాగొద్దు..!?|ADUGU TRENDS

ఎనకటికి 'మందు తాగనోడు దున్నపోతై పుట్టున్ ' అన్నరు. కానీ గా ఊరోల్లు మాత్రం మందు తాగితే జరిమానా ఏత్తం అంటున్నరు. పెండ్లి కానోళ్లు తాగొద్దట! పెండ్లి అయినోళ్ళు తాగొచ్చట? కానీ, కొట్లాడుకోవద్దట! తమిళనాడు...

రాహుల్ గాంధీ ముందున్న సవాల్ ఇదే!?|EDITORIAL

రాహుల్ గాంధీకి ఇప్పుడు ఎదురున్న అసలు సవాల్ మోదీని వ్యక్తిగతంగా విమర్శించడం కాదు. తన రాజకీయ శైలిని పునర్నిర్మించుకోవడం. సభలో హుందాతనం, వాస్తవాలపై పట్టు, విదేశాంగంపై బాధ్యతాయుతమైన భాష, పార్టీ పునర్వ్యవస్థీకరణ, యువ...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఆగస్టు 16 నుండి ఆగస్టు 22 వరకు రాశి ఫలాలు మేష రాశి: ఈ వారం మీకు ఆత్మవిశ్వాసం పెరిగి చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేసే అవకాశం ఉంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు రావచ్చు....

గీ మిఠాయి మస్తు పిరం. కిలోకి 51 యేలే!|ADUGU TRENDS

ధర అదిరింది కదా! యే తియ్ మిఠాయి కి గంత ధరే0ది? అనుకుంటా0డ్లా? ఔ మల్ల నిజంగానే గా మిఠాయి కి గంత ధర ఎందుకంటే గా మిఠాయిల బంగారం కలిపిండ్రు. గది...

స్వాతంత్ర్యం, విద్వేషం విధ్వంసం, విషాదం!?|EDITORIAL

స్వాతంత్య్రం మనకు గొప్ప వరం. విభజన దాని వెంటే వచ్చిన మహా విషాదం! ఆ చీకటి అధ్యాయాన్ని గుర్తుచేసుకోవడం ఏ పార్టీనీ అవమానించడానికి కాదు. భవిష్యత్తులో మతం, ప్రాంతం, భాష పేరుతో సమాజం...

ఆగస్టు 15, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం- శుక్లపక్షం భారత స్వాతంత్ర్య దినోత్సవం తిధి శు.తదియ రాత్రి 07.19 వరకు ఉపరి చవితి నక్షత్రం పుబ్బ ఉదయం 06.20 వరకు ఉపరి ఉత్తర యోగం శివ ఉదయం 10.40 వరకు ఉపరి సిద్ద కరణం తైతుల ఉదయం 07.49...

గిట్ల కూడా బోనం!?|ADUGU TRENDS

జివ్వ కో రుసి, పుర్రె కో బుద్ధి అన్నరు. ఒక్కొక్క లు ఒక్కో తీరన్న మాట! మొన్నీ మద్దెల ఓ పొల్ల, కాల్లకు గిర్రలు కట్టుకొని, గుడికిపోయింది. గది గూడ బోనమెత్తింది. ఇగో గీ...

పార్లమెంటుపై ప్రశ్నలకు బదులేవి!?|EDITORIAL

జెన్‌జీతో పాటు ప్రతి ఓటరు ఇప్పుడు తన ఎంపీ పనితీరును ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది. ఎన్ని ప్రశ్నలు అడిగారు? ఎన్ని చర్చల్లో పాల్గొన్నారు? ప్రజా సమస్యలను ఎన్నిసార్లు లేవనెత్తారు? సభ స్తంభించినప్పుడు వారి...

ఆగస్టు 14, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-వర్ష ఋతువు శ్రావణ మాసం --శుక్లపక్షం తిధి శు.విదియ రాత్రి 08.20 వరకు ఉపరి తదియ నక్షత్రం మఖ ఉదయం 06.50 వరకు ఉపరి పుబ్బ యోగం పరిఘ మధ్యాహ్నం 12.36 వరకు ఉపరి శివ కరణం బాలవ ఉదయం...

బౌద్ధ మతం|ADUGU DIGITAL MEDIA|SPECIAL|COMPITITIVE EXAMS|HISTORY

క్రీ.పూ.ఆరవ శతాబ్దంలో గంగా మైదాన ప్రాంతంలో అనేక మాత శాఖలు వెలిశాయి. అలాంటివి మనకు సుమారు అరవై వరకు తెలుసు. మతాల పుట్టుకకు కారణాలు వేద కాలం తర్వాత సమాజంలో ప్రజలు నాలుగు వర్ణాలుగా (బ్రాహ్మణులు,...

నెత్తింటికెలా? నేతెంటికేలా!?|ADUGU TRENDS

కురులంటే నెత్తింటికలు. కేశాలు. ఎంట్రుకలను ఎన్కటికి కవులు కారుమబ్బులతోటి పోల్చిండ్రు. కావ్యాల్ల కలువల సమూహంతోటి పోల్చిండ్రు. ఎంట్రుకలకు పూల సుగంధాలు అద్దడం పరిపాటే. కల్పవృక్షాల పరిమళాలు దేవతల తలవెంట్రుకల నుండి వెలువడుతున్నట్లు వర్ణించడం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News