హైదరాబాద్‌లోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. సచిన్ సత్యనారాయణ, ప్రేమ వివాహం చేసుకుని జీవనం సాగిస్తుండగా, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. కొంతకాలం విడిగా ఉన్నా, తిరిగి కలిసి జీవనం కొనసాగించారు. అయితే స్నేహ గర్భవతి కావడంతో సచిన్ అనుమానంతో మద్యం తాగించి, ఆమె పొట్టపై కూర్చొని హత్య చేశాడు. భయాందోళనతో కడుపులో ఉన్న బిడ్డ బయటపడి ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని నింపింది. పోలీసుల విచారణ కొనసాగుతోంది

