నల్గొండ జిల్లా డిండిలో అదనపు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ శ్రీ నేనవత్ శ్యామ్ నాయక్ లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.ఒక నిరుపేద కుటుంబానికి చెందిన ఒక మహిళకు కల్యాణ లక్ష్మీ పథకం కింద దరఖాస్తు పరిశీలించి ముందుకు పంపించడానికి 10,000 లంచం అడగగా, అందులో 5,000 రూపాయల లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు అతనిని పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని హైదరాబాద్ నాంపల్లి ఎస్పీ, వారి బృందం ఏసీబీ ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరచారు.
ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు మాట్లాడుతూ… ప్రజలు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగితే వెంటనే 1064 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు.

