మహా కుంభమేళాకు భక్తుల రాక కొనసాగుతోంది. కోట్లాది భక్తులు తరలి వస్తుండటంతో ప్రయాగ్రాజ్ వైపు వెళ్లే రోడ్లన్నీ వాహనాలతో రద్దీగా మారాయి. దాదాపు 200-300kms మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్లు సమాచారం. దీంతో పోలీసులు మధ్య ప్రదేశ్లోనే వాహనాలను ఆపేస్తున్నారు. యూపీ అధికారుల నుంచి అనుమతి వస్తేనే ముందుకు పంపిస్తున్నారు. యాత్రికులు వెనక్కి వెళ్లిపోవాలంటూ ఓ పోలీస్ సూచిస్తున్న వీడియో వైరల్ గా మారింది.

