ఒకప్పుడు కుటుంబ సంబంధాలు ఎంతో పకడ్బందీగా ఉండేయి. గా ఫెవికాల్, ఫెవికిక్ కంటే గట్టిగ అతికినట్టుండేయి. ఎవ్వలింట్ల ప్రభోజనమైనా, అందరిండ్లల్ల పండుగలెక్కనే ఉండేది. పొరపాటునో, గ్రహపాటునో ఎవర్నన్నా పిలుసుడు మరిసిపోతే, ఇగ భూగోళం బద్ధలయ్యేది! పిలిత్తే వచ్చుడే పెద్ద పీకులాట. ఇగ పిలవకుంటే వత్తాం? అని గా ఇంటికి, గీ ఇంటికి సూపులు, పలకరింపులే కాదుల్లా! రాకపోకలే బందయ్యేది. గా ఇంటి మీది కాకి గీ ఇంటి మీద వాలేది కాదు! గసొంటిది ఇయ్యాల గా పట్టింపులే లేవాయె. పిల్సినా, పిల్వకపోయినా, పత్రికిచ్చినా ఇయ్యకపోయినా, గా ప్రభోజనం మనదైనా, మందిదైనా ఎగబడి పోతాండ్రు. సిగ్గు ఎగ్గు లేకుండా తాగుతాండ్లు, తినొత్తాండ్లు. ఇగ గా పంక్షన్ హాల్లల్ల గియి జరగబట్టి, ఎవ్వలు బడితే గవాళ్ళే వత్తాండ్లు. తింటాండ్లు, పోతాండ్లు. ఇగ పంక్షన్ హాలంటేనే మనోళ్ళకాడికి కావంగ మీదనే మల్లో వంద మందికి ఎక్కువ వండుతాండ్లు! ఇగ ఊల్లల్ల, చౌరస్తాలల్ల, జనం బాగా వచ్చేకాడ ఉండే ఫంక్షన్ హాల్లకు గిరాకే లేకుండా పోయింది. యే తియ్! గది మాట్లాడితే, మనోల్లకంటే గా బయటోల్లే ఎక్కువ వత్తరని గా ఫంక్షన్ హాల్లను ఎవ్వలూ దేకుతనే లేరు. ఇగ గిదంత పని కాదని గా పంక్షన్ హాలాయినె ఏం శేసిండో సూడుండ్రి!

ఇగ ‘గీ పంక్షన్ హాలుకు సంబంధం లేని వ్యక్తులు వచ్చి దొరుకుతే, సెక్షన్ 441 (ప్రస్తుతం బీఎన్ ఎస్ సెక్షన్ 329) పకారం మూడు నెలల జైలు శిచ్చ, 5 యేల రూపాల జరిమానా!’ అంటూ గా పంక్షన్ హాలు ముంగట ఓ బోర్డు రాసి పెట్టిండ్రు గా నిర్వాహకులు. ఇగ గిది రాసిపెట్టింది ఎక్కడనుకుంటాండ్లు? గా పాలమూరు పాత జిల్ల వనపర్తిల. మంచిగుంది కదా? గీ ముచ్చట! ఇగ గిట్లనే అన్ని ఫంక్షన్ హాల్లల్ల బోర్డులు పెడితే, గా పుల్లెగండు గాల్ల కడుపుకొట్టుడే కదల్లా?

