Wednesday, September 23, 2026
26 C
Hyderabad

గ్యాస్ ట్రబుల్స్-ప్రత్యామ్నాయ మార్గాలు|EDITORIAL

ప్రపంచంతోపాటు, భారతదేశంలో వంటగ్యాస్‌-ఎల్పీజీ వినియోగం గత రెండు దశాబ్దాల్లో విపరీతంగా పెరిగింది. ఒకప్పుడు నగరాలకే పరిమితమైన ఈ ఇంధనం ఇప్పుడు గ్రామాలకు కూడా విస్తరించింది. వంట కోసం ఇంధనంగా ఎల్పీజీ వినియోగం పెరగడం ప్రజల జీవన విధానం, ప్రమాణాల్లో వచ్చిన మార్పునకు సంకేతం. అయితే, అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులు, దిగుమతులపై ఆధారపడే వ్యవస్థ అవడం, దేశంలో గ్యాస్‌ భద్రతపై అప్పుడప్పుడూ ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రస్తుతం ఇరాన్ లో యుద్ధం, ఉద్రిక్తతల కారణంగా గ్యాస్ సరఫరా అంతరాయం కలగవచ్చనే చర్చ మళ్లీ మొదలైంది. ఈ నేపథ్యంలో దేశంలో గ్యాస్ వినియోగ స్థితి, నిల్వలు, భవిష్యత్ అవసరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను విశ్లేషించుకోవడం అవసరం.

భారతదేశంలో ఎల్పీజీ వినియోగం వేగంగా పెరుగుతోంది. 2004-05లో దేశంలో ఎల్పీజీ వినియోగం కేవలం 10.2 మిలియన్ మెట్రిక్ టన్నులు మాత్రమే ఉండగా, 2024-25 నాటికి ఇది 31.3 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరింది. అంటే రెండు దశాబ్దాల్లో వినియోగం మూడు రెట్లు పెరిగింది. 2017లో 21.6 మి.మె.ట.గా ఉన్న వినియోగం 2025లో 31.3 మి.మె.ట.కి చేరి దాదాపు 44 శాతం వృద్ధి నమోదైంది.
ప్రస్తుతం దేశంలో 32.9 కోట్ల గృహ వినియోగదారులు ఎల్పీజీ కనెక్షన్లు ఉపయోగిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎల్పీజీ అందుబాటు 102.8 శాతానికి చేరినట్లుగా అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అంటే దేశంలో ప్రతి కుటుంబానికి గ్యాస్ సదుపాయం దాదాపు చేరిందని చెప్పవచ్చు. ప్రతి నెల సగటు. దేశంలో 2.6 మి. మె. ట. ల ఎల్పీజీ వినియోగం జరుగుతోంది. కుటుంబాల వారీగా చూస్తే సాధారణ వినియోగదారులు ఏడాదికి సగటున 6–7 సిలిండర్లు వినియోగిస్తుండగా, పేద కుటుంబాలకు అందించే పథకాల కింద సగటు వినియోగం 4.5 సిలిండర్లుగా ఉంది.

ఎల్పీజీ వినియోగం దేశీయ ఉత్పత్తి కంటే ఎక్కువగా వేగంగా పెరుగుతోంది. భారత్‌లో వినియోగించే ఎల్పీజీలో 60%-65% వరకు దిగుమతులపైనే ఆధారపడుతోంది. ముఖ్యంగా ఇరాన్ తదితర దేశాల నుంచి వచ్చే సరఫరా కీలకం. ప్రపంచంలో అతి పెద్ద జనాభా కలిగిన దేశంగాగానే గాక, రెండో అతిపెద్ద ఎల్పీజీ దిగుమతి దేశంగా భారత్ నిలిచింది.

మధ్యప్రాచ్యంలో యుద్ధాలు లేదా ఉద్రిక్తతలకు సరఫరా మార్గాలు ప్రభావితం అవుతున్నాయి. ప్రపంచ చమురు, గ్యాస్ రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధి ద్వారా భారత్‌కు వచ్చే ఎల్పీజీ సరఫరాలో అంతరాయం కలిగే ప్రమాదం ఉంది. ఈ మార్గం ద్వారా వచ్చే సరఫరా నిలిచిపోతే దేశంలో తాత్కాలిక కొరత ఏర్పడే అవకాశం ఉంటుంది.

ఇప్పటికే బెంగళూరు, ముంబై వంటి మహానగరాల్లో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరత మొదలైంది. హోటళ్లు, రెస్టారెంట్లకు గ్యాస్ సరఫరా తగ్గడంతో వ్యాపారాలు ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వం గృహ వినియోగదారులకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల వాణిజ్య రంగానికి సరఫరా తగ్గినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
దేశంలో గ్యాస్ నిల్వల పరిస్థితి కూడా అంతగా దీర్ఘకాలిక భద్రతను, భరోసాను ఇవ్వలేవనే అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో గ్యాస్ నిల్వ సామర్థ్యం 16 రోజుల వినియోగానికి సరిపడే స్థాయిలో మాత్రమేనని పరిశ్రమ నివేదికలు చెబుతున్నాయి. అంటే దిగుమతులు నిలిచిపోయినా, సరఫరా ఆగిపోయినా, దేశం ఎక్కువకాలం నిల్వలపై ఆధారపడే పరిస్థితి లేదు.

ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం కొన్ని అత్యవసర చర్యలు తీసుకుంది. రిఫైనరీలను పూర్తి సామర్థ్యంతో నడపాలని ఆదేశించడం, ఎల్పీజీ ఉత్పత్తిని 10 శాతం పెంచడం, పరిశ్రమలకు వెళ్లే గ్యాస్‌ను కొంత మేర గృహ వినియోగానికి మళ్లించడం వంటి చర్యలు చేపట్టింది.

అయితే, దీర్ఘకాలికంగా చూస్తే మరికొన్ని చర్యలు అమలు చేయాల్సిన అగత్యం కనిపిస్తోంది. మొదటగా, ఎల్పీజీ దిగుమతులపై అధికంగా ఆధారపడే పరిస్థితిని తగ్గించాలి. అమెరికా, ఆఫ్రికా వంటి ఇతర దేశాల నుంచి కూడా ప్రత్యామ్నాయ దిగుమతులకు పూనుకోవాలి. రెండవది, దేశంలో నిల్వ సామర్థ్యాన్ని పెంచాలి. ప్రస్తుతం ఉన్న 16 రోజుల నిల్వ సామర్థ్యాన్ని కనీసం ఒక నెలకు పెరగాలి. మూడవది, గ్యాస్ వినియోగంలో సమర్థతను పెంచే చర్యలు అవసరం. స్మార్ట్ బుకింగ్ విధానాలు, నిల్వల నియంత్రణ, బ్లాక్ మార్కెటింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి.

నాలుగవది, ప్రత్యామ్నాయ శక్తి వనరులపై దృష్టి పెట్టాలి. బయోగ్యాస్, విద్యుత్ ఆధారిత వంట పద్ధతులు, పునరుత్పాదక ఇంధనాలను ప్రోత్సహించడం ద్వారా గ్యాస్‌పై ఒత్తిడిని తగ్గించవచ్చు. గ్యాస్ వినియోగం అభివృద్ధికి సూచికగా కనిపిస్తున్నప్పటికీ, అదే సమయంలో ఇది ఇంధన భద్రతకు సవాలుగా నిలుస్తోంది. పెరుగుతున్న వినియోగానికి తగిన అన్ని ప్రత్యామ్నాయ శక్తి వనరులు లేకపోతే భవిష్యత్తులో మరింత సంక్షోభంగా మారే ప్రమాదం ఉంది. అందుకే ప్రభుత్వం, పరిశ్రమలు, వినియోగదారులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తేనే దేశ ఇంధన భద్రతకు భద్రత ఉంటుంది.

Latest News

గా ఊర్ల పేమ పెండ్లిల్లు నిషేధం!?|ADUGU TRENDS

ఇగీ మద్దెల ఏడ సూసినా, లవ్వు మ్యారేజీలు, లివింగ్ టుగెదర్లేనాయె! గియి ఊర్లు, మండలాలు, జిల్లాలు, రాష్ట్రాలు దాటి దేశాలు, ఖండాంతరాలకు విస్తరించినయి. ఇగ కులం లేదు, మతం లేదు. ఇల0 లేదు....

యూపీ విభజన ప్రతిపాదనా? రాజకీయ వ్యూహమా?|EDITORIAL

దేశంలో చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై చర్చ జరగడం సహజమే. కానీ ఇలాంటి నిర్ణయాలు ప్రజల దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకోవాలి. యూపీ విభజనపై రాజ్‌భర్‌ చేసిన ప్రకటన అధికారిక విధానంగా మారుతుందా?...

సెప్టెంబర్ 23, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు ద్వాదశి రాత్రి 08.43 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం శ్రవణ ఉదయం 08.18 వరకు ఉపరి ధనిష్ఠ యోగం సుకర్మ సాయంత్రం 04.50 వరకు ఉపరి ధృతి కరణం బవ ఉదయం 08.03...

పుతిన్ తిరుగులేని నేతేనా!?|EDITORIAL

పుతిన్ రాజకీయ పట్టు బలపడినప్పటికీ, ప్రతిపక్ష స్వేచ్ఛ, ఎన్నికల పారదర్శకత, యుద్ధానికి ముగింపు వంటి అంశాలపై రష్యా ఎదుర్కొంటున్న ప్రశ్నలు అలాగే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పుతిన్ ఆధిపత్యాన్ని కేవలం సీట్ల సంఖ్యతో...

బంగారం కొనే ముందు గీ మూడు సూడాలే!|ADUGU TRENDS

మనం బంగారం, నగలు ఏడ కొంటం? ఔసలోల్ల దగ్గర, బంగారం దుకాణాల్ల కొంటం .పెద్దపెద్ద దుకాణాలకు కూడా పోయేటోల్లు ఉంటరు. కానీ, గీ మూడు ముఖ్యమైన ముచ్చట్లు పట్టించుకోం. కానీ మన సర్కార్...

సెప్టెంబర్ 22, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు ఏకాదశి రాత్రి 07.23 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 06.14 వరకు ఉపరి శ్రవణ యోగం అతిగండ సాయంత్రం 04.49 వరకు ఉపరి సుకర్మ కరణం వణజి ఉదయం 06.34...

సెప్టెంబర్ 21, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు దశమి సాయంత్రం 05.43 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం ఉత్తరాషాఢ పూర్తిగా ఉంది యోగం శోభ సాయంత్రం 04.30 వరకు ఉపరి అతిగండ కరణం గరజి సాయంత్రం 05.43 వరకు ఉపరి వణజి రాహుకాలం...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 20 నుండి సెప్టెంబర్ 26 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం కొత్త అవకాశాలు కనిపిస్తాయి, ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపార రంగాల్లో ముందడుగు వేసే పరిస్థితులు ఏర్పడతాయి. నిలిచిపోయిన పనులను...

కరకరలాడే కరెన్సీ నోట్లతో నాయకుడు!|ADUGU TRENDS

అవును. మీరు ఇ0టున్నది నిజమే. కావాలనంటే మీరే సూడు0డ్రి. గాడ కరకరలాడే కొత్త కరెన్సీ నోట్ల తోటి ఇనాయకుడిని అలంకరించినరు. ఒక్క రూపాయి రెండు రూపాయలతోటి కాదుల్ల ఏకంగా 65.03 లచ్చల నోట్ల...

పన్నుల ఉచ్చులో ప్రపంచ వాణిజ్యం!|EDITORIAL

సుంకాల అస్త్రంతో అమెరికా మరోసారి ప్రపంచ వాణిజ్యాన్ని కుదిపేస్తోంది. రష్యా, ఇరాన్‌లపై ఆంక్షల పేరుతో భారత్, చైనాలపై కూడా భారీ సుంకాల ముప్పు తెరపైకి వచ్చింది. ముఖ్యంగా రష్యా చమురు దిగుమతుల విషయంలో...

సెప్టెంబర్ 19, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు అష్టమి పగలు 01.40 వరకు ఉపరి నవమి నక్షత్రం మూల రాత్రి 01.14 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం ఆయుష్మాన్ పగలు 03.20 వరకు ఉపరి సౌభాగ్య కరణం బవ పగలు 01.40...

గాడ సదివిత్తేనే బువ్వ!|ADUGU TRENDS

ఔ మల్ల! గాడ చదివిపిత్తే తప్ప బువ్వ పెట్టారు. కనీసం టోకెన్ కూడా ఇయ్యరు. నువ్వు పెండ్లికి పో, పుట్టిన రోజుకు పో. ఇంకేదైనా ప్రబోజనానికి పో..ఏ ఫంక్షన్ కైనా పో! గాడ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News