కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న శ్రీ తేజ్ ను TFDC చైర్మెన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు పరామర్శించారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ, పుష్ప ప్రీమియర్ షో సమయంలో జరిగిన సన్నివేశం చాలా బాధకరమని అన్నారు. ఇలాంటి సంఘటనలు సినీ ఇండస్ట్రీలో అప్పుడప్పుడు జరుగుతాయని తెలిపారు. ముఖ్యంగా, ఇలాంటి అనుకోని సంఘటనలు ఇంకా ముందు ఎన్నడూ జరగకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని కోరారు.
ఇప్పుడు,సిఎం రేవంత్ రెడ్డి నియమించిన TFDC చైర్మెన్ గా సినిమా ఇండస్ట్రీకి సరైన దారి చూపించేందుకు, ఇండస్ట్రీకి మద్దతుగా ఉండి బాధితుల సహాయానికి ముందుకు వచ్చానని తెలిపారు. తాను కేవలం ప్రభుత్వానికి, ఇండస్ట్రీకి మాధ్య సమన్వయం చేస్తూ… రేవతి కుటుంబానికి అండగా వుంటాను అన్నారు. ఇతర సినీ ప్రముఖులతో మాట్లాడి ఇలాంటి సంఘటనలను నివారించేందుకు అన్ని విధాలుగా సహకరించాలని, ఈ విషయంలో ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానని అన్నారు.

