జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఫిబ్రవరి 1 నుండి 13 వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. తర్వాత, మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు రెండో విడత బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. బడ్జెట్‌లో ఆర్థిక ప్రణాళికలు, ప్రాధాన్యతలు, సామాజిక సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాలపై కేంద్రం ప్రధాన దృష్టి సారించే అవకాశం ఉంది. ఈ సమావేశాలు దేశ ఆర్థిక పరిస్థితి రూపుదిద్దుకునే దిశగా కీలకంగా మారనున్నాయి.

