Sunday, October 18, 2026
24.8 C
Hyderabad

ఉద్వాసనమే!|KONDA SUREKHA|CM|REVANTH REDDY|DELHI

సురేఖను పట్టించుకోని అధిష్ఠానం
ముక్తసరిగా మూడు ముక్కల్లో ఖర్గేతో మచ్చట
అపాయింట్ మెంట్ ఇవ్వని కేసీ వేణుగోపాల్
ఏఐసీసీ కార్యాలయంలోనే రోజంతా పడిగాపులు
నిరాశతో వెనుతిరిగిన మంత్రి కొండా సురేఖ
ఖర్గే, కేసీలతో రేవంత్ రెడ్డి వేర్వేరుగా భేటీలు
సురేఖ వ్యవహారాన్ని అంతర్గతంగా చూడొద్దని వినతి

తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్న అంతర్గత విభేదాలు ఢిల్లీని తాకాయి. మంత్రి కొండా సురేఖకు కాంగ్రెస్‌ అధిష్ఠానం నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లభించలేదు. పార్టీ అగ్రనేతలతో భేటీ కోసం ఢిల్లీ వెళ్లిన ఆమెకు పడిగాపులు తప్పలేదు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సురేఖ భేటీ ముక్తసరిగా, మూడు ముక్కల్లోనే ముగిసింది. మరోవైపు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడంతో ఆమె ఏఐసీసీ కార్యాలయంలోనే చాలాసేపు వేచి చూడాల్సి వచ్చింది.

తెలంగాణ కాంగ్రెస్‌లో కొంతకాలంగా కొనసాగుతున్న అంతర్గత విభేదాల నేపథ్యంలో సురేఖ ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ఆమె కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యలు, వాటిపై పార్టీలో వ్యక్తమైన అసంతృప్తి, తన వాదనను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే మంత్రి కొండా సురేఖ ఢిల్లీకి వెళ్లారు. అయితే అధిష్ఠానం ఆమెను సీరియస్ గా తీసుకోలేదు. పార్టీ పెద్దల నుంచి తగినంత సమయం లభించకపోవడం ఆమెకు నిరాశ కలిగించింది.

ఖర్గేతో జరిగిన సమావేశంలో సురేఖ తనకు ఎదురవుతున్న రాజకీయ పరిస్థితులను వివరించేందుకు ప్రయత్నించినప్పటికీ, ఖర్గే పెద్దగా ఆసక్తి చూపకపోగా, పీసీసీ స్థాయిలోనే చూసుకోండని చెప్పినట్లు తెలిసింది.

ఇదే సమయంలో కేసీ వేణుగోపాల్‌ను కలిసేందుకు సురేఖ ప్రయత్నించినప్పటికీ అపాయింట్‌మెంట్ దక్కలేదు. దీంతో ఏఐసీసీ కార్యాలయంలోనే ఆమె రోజంతా వేచి చూశారు. చివరకు నిరాశతో వెనుదిరిగినట్లు తెలుస్తోంది.

ఈ పరిణామాలు సురేఖను దాదాపు పార్టీ నుంచి పక్కన పెట్టినట్లేనని, మంత్రి పదవికి ఉద్వాసన తప్పదన్న సంకేతాలేనని పార్టీలోని వారే తేల్చేస్తున్నారు. ఆమె అనుచరులు సైతం కొండా సురేఖపై వేటు తప్పదని, అలా జరిగితే, ఆమె బీజేపీవైపునకు మొగ్గవచ్చన్న సంకేతాలిస్తున్నారు. అలా జరిగితే, తాము మాత్రం కాంగ్రెస్ తోనే ఉంటామని కూడా కొందరు చెబుతున్నారు.

ఇదిలావుంటే, సురేఖ డిల్లీలో కొద్దిసేపు మీడియాతో చిట్ చాట్ చేశారు. అందులోనూ ఏ మాత్రం తగ్గకపోవడం పలువురిని ఆశ్చర్య పరచింది. ‘క్రమశిక్షణ చర్యలు, షోకాజ్ నోటీసులు.. సీఎం నుంచే మొదలు పెడదాం. ఎమ్మెల్యే టికెట్లను ఎలా ప్రకటిస్తారు? పదేళ్ళు నేనే సీఎం అని ఎలా అంటారు? భట్టి భార్య వసూళ్ళు? పొంగులేటి దౌర్జన్యాల మాటేమిటి? పీసీసీని 50 కోట్లకు కొన్నారన్న కోమటిరెడ్డి మాటేమిటి? నా బిడ్డ ఆవేదనలోతప్పే లేదు. ప్రశ్నిస్తే షో కాజా? నన్ను ముట్టుకుంటే కాంగ్రెస్ కు తీవ్ర నష్టం. రాజీనామా చేయాలని నన్నెవరూ కోరలేదు. నిజాలు బయట పెడతారనే నా ఓఎస్డీ అరెస్టు. బీసీలంటే అలుసా? బీసీని కాబట్టే నాపై ఇన్ని కుట్రలు’ చేస్తున్నారనే వ్యాఖ్యలు చేశారు.

కొండా సురేఖలో పశ్చాత్తాపమే కనిపించకపోవడం, అధిష్ఠానం ఆసక్తి కనబరచకపోవడాన్ని బట్టి కొండా సురేఖ కాంగ్రెస్ తో ప్రయాణం దాదాపు పూర్తయినట్లుగానే భావించాల్సి వస్తున్నది.
ఇదిలావుంటే, సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్‌ అగ్రనేతలతో వరుసగా భేటీ కావడం. మల్లికార్జున ఖర్గేతో, అనంతరం కేసీ వేణుగోపాల్‌తో వేర్వేరుగా సమావేశమై తెలంగాణలోని తాజా రాజకీయ పరిణామాలను వివరించినట్లు సమాచారం. ముఖ్యంగా సురేఖ వ్యవహారాన్ని వ్యక్తిగత లేదా అంతర్గత వివాదంగా చూడకుండా, పార్టీ క్రమశిక్షణకు సంబంధించిన అంశంగా పరిగణించాలని రేవంత్‌రెడ్డి అధిష్ఠానం పెద్దలను కోరినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, సురేఖపై అధిష్ఠానం తుది నిర్ణయం మాత్రం వెలువడలేదు.

Latest News

బతుకమ్మ|BATHUKAMMA|HISTORY|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL

తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగను పూల పండుగగా పిలుస్తారు. ఈ పండుగను రాష్ట్ర ప్రభుత్వం 2014 జూన్ 16న రాష్ట్ర పండుగగా గుర్తించింది. ఇదే రోజున బోనాలు పండుగను కూడా రాష్ట్ర పండుగగా...

భివండిల ‘మహా’ బతుకమ్మ!?|ADUGU TRENDS

ఈ పపంచకంలనే పక్రుతిని ఆరాధించి, పువ్వులనే దేవుల్లుగ కొలిసే అరుదైన పండుగ బతుకమ్మ. గీ పండుగ తెలంగాణలనే కాదు. ఇగిప్పుడు గీ తెలంగాణోల్లు ఏడుంటే గాడ ఘనంగా జరుగుతాంది. ఒకప్పటి లెక్క గాకుండ,...

పూల పండుగకు ప్రపంచ పట్టాభిషేకం!|EDITORIAL|BATHUKAMMA

పూల సోయగాలు.. ఉయ్యాల పాటలు.. కోలాటాల సందడి.. వెరసి బతుకమ్మ సంబురం! తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే ఈ పూల పండుగ నేడు ఖండాంతరాలు దాటి, ప్రపంచ వేదికపై మన సంస్కృతి...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

అక్టోబర్ 18 నుండి అక్టోబర్  24 వరకు రాశి ఫలాలు మేష రాశి కొత్త పనులు ప్రారంభించాలనే ఉత్సాహం పెరుగుతుంది. ఉద్యోగంలో మీ సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం లభించవచ్చు. వ్యాపారంలో కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయి....

ఈ దంపతులు సింపతీ కోల్పోతున్నారా!?|KONDA SUREKHA|KONDA MURALI|FAMILY

పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలకు దూరం..పైగా సెపరేట్ ఈసీపై ఏఐసీసీ ఆందోళనలకు కూడా హాజరుకాని వైనం పట్టభద్రుల ఎమ్మెల్సీ సమాయత్త సమావేశానికి గైర్హాజర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు మంత్రుల సందర్శనలోనూ నో వేర్ పైగా విడిగా పార్టీ...

బతుకమ్మ వాయినం!?|ADUGU TRENDS

‘ఇత్తినమ్మ వాయినం అంటే, తీస్కుంటినమ్మ వాయినం.’ అని అంటరు. గిదేందంటే, పండుగలు, పబ్బాలకు, శుభ కార్యాలకు, రతాలకు ముత్తైదువులకు అందించే తాంబూలం, పిండివంటలు, పండ్లు-పూలు, పసుపు-కుంకుమలను కలిపి ఇచ్చే కానుకలను వాయినం అంటరు....

పటిష్ట వ్యవస్థ తప్పనిసరి!|EDITORIAL

ఓటరు జాబితాలో ఒక్క పేరు మాయమైనా.. ప్రజాస్వామ్యానికి గట్టి దెబ్బే! దేశవ్యాప్తంగా ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై పెరుగుతున్న ఆందోళనలు, ఓటర్ల పేర్ల తొలగింపుపై ఆరోపణలు ఎన్నికల వ్యవస్థ పారదర్శకతను ప్రశ్నిస్తున్నాయి. జాబితాల ప్రక్షాళన అవసరమే.....

అక్టోబర్ 17, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజ మాసం శుక్లపక్షం శ్రీ చండికాదేవి అలంకరణ తిధి సప్తమి రాత్రి తెల్ల 05.10 వరకు ఉపరి అష్టమి నక్షత్రం మూల ఉదయం 08.16 వరకు ఉపరి పుర్వాషాఢ యోగం అతిగండ రాత్రి 10.31 వరకు ఉపరి సుకర్మ కరణం...

ఆడ ఏడో రోజే|SADDULA BATHUKAMMA

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. అయితే జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలోని పెద్దమడూరు గ్రామంలో మాత్రం ఈ పండుగను ఏడో...

పొద్దుగాల పెండ్లి.. సీకటి పడంగనే పెటాకులు!?|ADUGU TRENDS

పెండ్లంటే నూరేండ్ల పంట అన్నరు. ఒకపాలి పెండ్లైందంటే వందేండ్లైనా గా అనుబంధం యిడి పోదని దానర్థం. కానీ, గీ మద్దెల పెండ్లిల్లు.. పెటాకులైపోవడానికి పెద్దగ టైమేం పడ్తలేదు. గిప్పుడు పెండ్లి సేసుకుంటాండ్లో లేదో.....

రియాద్ సంక్షోభం!|EDITORIAL

మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి! హౌతీల భీకర క్షిపణి దాడులతో సౌదీ రాజభవనాలు వణుకుతుండగా, క్రౌన్ ప్రిన్స్ ప్రాణభయంతో అజ్ఞాతంలోకి వెళ్లిన వేళ.. ఇజ్రాయెల్ స్నేహహస్తాన్ని తిరస్కరించిన రియాద్ నిర్ణయం గల్ఫ్ రాజకీయాల్లో...

అక్టోబర్ 16, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజ మాసం శుక్లపక్షం శ్రీ సరస్వతిదేవి అలంకరణ తిధి షష్ఠి రాత్రి తెల్ల 03.02 వరకు ఉపరి సప్తమి నక్షత్రం మూల పూర్తిగా ఉంది యోగం శోభ రాత్రి 09.56 వరకు ఉపరి అతిగండ కరణం కౌలవ పగలు...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News