తెలంగాణలో కులగణనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. హిందూ బీసీలు, ముస్లిం బీసీలు అని ఏ చట్టంలోనూ లేదని, ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యానించారు. “ముస్లింలందరినీ బీసీల్లో కలిపి, నిజమైన బీసీలకు కాంగ్రెస్ తీవ్ర అన్యాయం చేస్తోంది” అని ఆయన ఆరోపించారు.
కులగణన ప్రక్రియలో తీవ్ర లోపాలున్నాయన్నారు. “బహుశా చాలా ఇళ్లకు సర్వే చేసినవారు వెళ్లలేదని సమాచారం. ఈ గణాంకాలపై బీసీ సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి” అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రజలను కులం, మతాల పేరుతో విభజించడం పరిపాటి అని విమర్శించారు. “ఇది రాహుల్ గాంధీ స్ట్రాటజీ మాత్రమే కాదు, కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏలో ఉన్న విధానం” అని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. కులగణన తీరును పూర్తిగా సమీక్షించి, నిజమైన బీసీలకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

